Bandi Sanjay | బీజేపీ గెలిస్తే కుల సంఘాలకు శాశ్వత భవనాలు
Bandi Sanjay | తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని అన్ని కుల సంఘాలకు శాశ్వత భవనాల (Permanent buildings for caste associations)ను నిర్మించి ఇస్తామని కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) హామీ ఇచ్చారు.
- కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో అర్హులైన పేదలకు కార్పొరేట్ స్థాయి విద్య, వైద్య సేవలు అందిస్తాం
- ఓటర్ల జాబితా ప్రక్షాళనపై కాంగ్రెస్‌ది అనవసర రాద్దాంతం
- నితిన్ నబిన్ ఎల్లుండి పర్యటనను విజయవంతం చేయాలి
- కేంద్ర మంత్రి బండి సంజయ్ పిలుపు
Bandi Sanjay | త్రినేత్ర న్యూస్: తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని అన్ని కుల సంఘాలకు శాశ్వత భవనాల (Permanent buildings for caste associations)ను నిర్మించి ఇస్తామని కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) హామీ ఇచ్చారు. నియోజకవర్గంలోని అర్హులైన పేద, మధ్య తరగతి ప్రజలకు కార్పొరేట్ స్థాయిలో ఉచిత విద్య, వైద్య సేవలు అందిస్తామని చెప్పారు. కరీంనగర్ (Karimnagar)లోని పద్మశాలి సంఘం భవనం పై అంతస్తులో నూతనంగా నిర్మించిన గదులను బండి సంజయ్ శనివారం ప్రారంభించి మాట్లాడారు.
అధికారంలో లేకపోయినా ఎంపీ లాడ్స్ నిధుల ద్వారా పద్మశాలి సంఘం భవన నిర్మాణానికి సహకరించానని తెలిపారు. ఇతర కుల సంఘాలకు కూడా తన వంతు సాయం అందించానన్నారు. కమ్యూనిటీ హాళ్ల నిర్మాణంతో పాటు గుడి, బడి, ఆసుపత్రుల సేవలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ సంక్షోభంలోకి వెళ్లిందని, ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మాటలకే పరిమితమయ్యాయని విమర్శించారు.
ఓటర్ల జాబితా ప్రక్షాళనపై కాంగ్రెస్‌కు వచ్చిన ఇబ్బంది ఏంటి
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ విషయంలో కాంగ్రెస్ అనవసర రాద్ధాంతం చేస్తోందని బండి సంజయ్ విమర్శించారు. ఈ సందర్భంగా పలు ప్రశ్నలు సంధించారు. చనిపోయిన ఓటర్ల పేర్లను తొలగించాలా? విదేశీ అక్రమ చొరబాటుదారుల ఓట్లను తొలగించాలా? రెండు, మూడు ఓట్లు కలిగిన వారి పేర్లను జాబితా నుంచి తొలగించాలా? 18 ఏళ్లు నిండిన భారతీయులందరికీ ఓటు హక్కు కల్పించాలా? అని ప్రశ్నించారు. ఓటర్ల జాబితాను ప్రక్షాళన చేస్తుంటే కాంగ్రెస్‌కు వచ్చిన ఇబ్బంది ఏమిటని నిలదీశారు.
SIRపై వాస్తవాలను ప్రజలకు వివరించేందుకు ఈ నెల 23న బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ కరీంనగర్‌కు వస్తున్నారని బండి సంజయ్ తెలిపారు. ఈ సందర్భంగా నిర్వహించనున్న మహా పాదయాత్రకు పెద్ద సంఖ్యలో తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రజలు, పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో నగర మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, పద్మశాలి సంఘం నాయకులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- ●Keethy Suresh | అందుకే సినిమా ప్రమోషన్స్‌లో కనిపించడు - భర్తపై కీర్తి సురేష్ కామెంట్స్
- ●Harish Rao Paddy Procurement Telangana | తుఫాన్ ముప్పు పొంచి ఉన్నా వడ్లు కొనరా?
- ●TSPJA | ఒక్క ఫోటో.. వెయ్యి భావాలు.. తరతరాలకు నిలిచే చరిత్ర!
- ●Ponguleti Srinivas Reddy | మా ఆట బాగుంది.. వచ్చే ఎన్నికల్లో మళ్లా గోల్ మాదే
- ●Agniveer Data Breach Dark Web | 4,000 మంది అగ్నివీరుల డేటా హ్యాక్.. డార్క్ వెబ్‌లో అమ్మకానికి పెట్టిన 14 ఏళ్ల కుర్రాడు!
- ●Jagadeesh Reddy | తెలంగాణ నీళ్లను కాపాడే సోయి లేదా?

Keethy Suresh | అందుకే సినిమా ప్రమోషన్స్‌లో కనిపించడు - భర్తపై కీర్తి సురేష్ కామెంట్స్

Harish Rao Paddy Procurement Telangana | తుఫాన్ ముప్పు పొంచి ఉన్నా వడ్లు కొనరా?

TSPJA | ఒక్క ఫోటో.. వెయ్యి భావాలు.. తరతరాలకు నిలిచే చరిత్ర!

Ponguleti Srinivas Reddy | మా ఆట బాగుంది.. వచ్చే ఎన్నికల్లో మళ్లా గోల్ మాదే





