త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Godavari Pushkaralu Logo Design and Tagline | గోదావ‌రి పుష్క‌రాల లోగో డిజైన్‌, ట్యాగ్ లైన్ పంపండి.. న‌గ‌దు బ‌హుమ‌తులు గెలుచుకోండి

Godavari Pushkaralu Logo Design and Tagline | గోదావరి పుష్కరాలు-2027 లోగో డిజైన్ (Logo Design), ట్యాగ్ లైన్ (Tagline) పోటీల్లో ఔత్సాహికులు పాల్గొని త‌మ డిజైన్ల‌ను రూపొందించి ఈనెల 30 లోపు పంపాల‌ని మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ (Ponnam Prabhakar) సూచించారు.

S

Telangana | Published On Nov 23, 2026, 1.16 pm IST

Godavari Pushkaralu Logo Design and Tagline | గోదావ‌రి పుష్క‌రాల లోగో డిజైన్‌, ట్యాగ్ లైన్ పంపండి.. న‌గ‌దు బ‌హుమ‌తులు గెలుచుకోండి
Advertisement
  • ఔత్సాహికుల‌కు మంత్రి పొన్నం ప్రభాక‌ర్ పిలుపు

Godavari Pushkaralu Logo Design and Tagline | త్రినేత్ర న్యూస్‌: గోదావరి పుష్కరాలు-2027 లోగో డిజైన్ (Logo Design), ట్యాగ్ లైన్ (Tagline) పోటీల్లో ఔత్సాహికులు పాల్గొని త‌మ డిజైన్ల‌ను రూపొందించి ఈనెల 30 లోపు పంపాల‌ని మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ (Ponnam Prabhakar) సూచించారు. ఉత్తమ లోగో, డిజైన్లను పంపిన ముగ్గురి ఔత్సాహికులకు రూ.లక్ష, రూ.50 వేలు, రూ.25 వేలు చొప్పున నగదు బహుమతులు అంద‌జేస్తామ‌ని తెలిపారు. సోమ‌వారం జవహర్ లాల్ నెహ్రూ ఫైన్ ఆర్ట్స్ లో నిర్వహించిన వర్క్ షాప్ లో మంత్రి పొన్నం పాల్గొని మాట్లాడారు. అదనంగా అత్యుత్తమంగా నిలిచిన 100 ఎంట్రీలకు ప్రశంసా పత్రాలు ఇచ్చి స‌త్క‌రిస్తామ‌ని వెల్ల‌డించారు.

పుష్కరాల ఆధ్యాత్మిక, సాంస్కృతిక ప్రాముఖ్యతను ప్రతిబింబించేలా వినూత్న లోగోలు, ట్యాగ్‌లైన్‌లను ఉండేలా చూసుకోవాల‌న్నారు. ఉత్తర భారతదేశంలో జరిగే కుంభమేళా తరహాలో 2027, జూన్ 26 నుంచి ప్రారంభమయ్యే గోదావరి పుష్కరాలను తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా, ఘనంగా నిర్వహించబోతోందని తెలిపారు. లోగో, ట్యాగ్ లైన్ లను కలిపి godavaripushkaralutg@gmail.com కు ఈనెల 30న‌ సాయంత్రం 5 గంటల లోపు పంపాలని సూచించారు. లోగోతో పాటు తెలుగు లేదా ఇంగ్లీష్ భాషల్లో ట్యాగ్‌లైన్, డిజైన్ వెనుక ఉన్న కాన్సెప్ట్ వివరణను జత చేయాలని పేర్కొన్నారు.

Advertisement
Advertisement