త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Tourist Bus | య‌మునా ఎక్స్‌ప్రెస్‌వేపై టూరిస్టు బస్సు ద‌గ్దం.. 9 మంది సజీవ దహనం

Tourist Bus | ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడా (Greater Noida) సమీపంలో యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర రోడ్డు ప్రమాదం జ‌రిగింది. ప్రయాణికులతో వెళ్తున్న టూరిస్టు బస్సులో (Tourist Bus) అర్ధరాత్రి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

G

National | Published On Sep 24, 2026, 7.55 am IST

Tourist Bus | య‌మునా ఎక్స్‌ప్రెస్‌వేపై టూరిస్టు బస్సు ద‌గ్దం.. 9 మంది సజీవ దహనం
Advertisement

Tourist Bus | త్రినేత్ర‌.న్యూస్‌: ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడా (Greater Noida) సమీపంలో యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర రోడ్డు ప్రమాదం జ‌రిగింది. ప్రయాణికులతో వెళ్తున్న టూరిస్టు బస్సులో (Tourist Bus) అర్ధరాత్రి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో 9 మంది సజీవ దహనమయ్యారు. ప‌లువురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

బీహార్ రిజిస్ట్రేష‌న్ ఉన్న రాజ్ క‌ల్ప ట్రావెల్స్‌కు చెందిన టూరిస్టు బ‌స్సు ఢిల్లీ నుంచి మొహాబ (Mahoba) వెళ్తున్న‌ది. ఈ క్ర‌మంలో గురువారం తెల్ల‌వారుజామున‌ నోయిడా ఇంర్నేష‌న‌ల్ ఎయిర్‌పోర్టు స‌మీపంలో యుమునా ఎక్స్‌ప్రెస్‌వేపై (Yamuna Expressway) బ‌స్సులో ఒక్క‌సారిగా మంట‌లు అంటుకున్నాయి. కొద్దిసేప‌ట్లోనే బ‌స్సు మొత్తానికి వ్యాపించాయి. అప్ర‌మ‌త్త‌మైన డ్రైవ‌ర్ బ‌స్సును రోడ్డు ప‌క్క‌కు నిలిపివేశారు. అయితే ప్ర‌యాణికులు గాఢ నిద్ర‌లో ఉన్న స‌మ‌యంలో ప్ర‌మాదం జ‌ర‌గ‌డంతో తొమ్మిది మంది స‌జీవ‌ద‌హ‌న‌మ‌య్యారు. ప‌లువురు కిటికీల్లోంచి కిందికి దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. స‌మాచారం అందుకున్న అగ్నిమాప‌క సిబ్బంది, పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని మంట‌ల‌ను అదుపుచేశారు. అయితే అప్ప‌టికే బ‌స్సు పూర్తిగా ద‌గ్ధ‌మైంది.

ప్ర‌మాదం స‌మ‌యంలో బ‌స్సులు సుమారు 35 మంది ప్ర‌యాణికులు ఉన్నారు. వారంతా పర్యాటకులని తెలుస్తున్న‌ది. వారిలో ఎక్కువ మంది వృద్ధ మహిళలు, చిన్నారులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. కొంతమంది దివ్యాంగ పిల్లలు కూడా ఉన్నట్లు సమాచారం. గాయపడిన వారిని స‌మీపంలోని ద‌వాఖాన‌కు తరలించారు.

బ‌స్సు ప్ర‌మాద ఘ‌ట‌న‌పై సీఎం యోగీ ఆదిత్య‌నాథ్ ( Yogi Adityanath) దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. మృతుల కుంటుంబాల‌కు ప్ర‌గాఢ సానుభూతి తెలిపారు. గాయ‌ప‌డిన‌వారికి మెరుగైన చికిత్స అందించాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. క్ష‌త‌గాత్రులు త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఆకాంక్షించారు.

Advertisement
Advertisement