Bandi Sanjay | బీజేపీని అడ్డుకునే దమ్ము ఆ పార్టీలకు లేదు.. రాష్ట్రంలో వచ్చేది డబుల్ ఇంజిన్ సర్కారే: బండి సంజయ్
Bandi Sanjay | బీజేపీని చూసి సీఎం రేవంత్ రెడ్డి భయపడుతున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) అన్నారు. బీజేపీని తట్టుకునే దమ్ము బీఆర్ఎస్, కాంగ్రెస్ లేదని చెప్పారు. కాంగ్రెస్‌కు బీఆర్ఎస్ (BRS) ఎలా ప్రత్యర్థి అవుతుందో రేవంత్ చెప్పాలన్నారు.
Bandi Sanjay | త్రినేత్ర న్యూస్: బీజేపీని చూసి సీఎం రేవంత్ రెడ్డి భయపడుతున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) అన్నారు. బీజేపీని తట్టుకునే దమ్ము బీఆర్ఎస్, కాంగ్రెస్ లేదని చెప్పారు. కాంగ్రెస్‌కు బీఆర్ఎస్ (BRS) ఎలా ప్రత్యర్థి అవుతుందో రేవంత్ చెప్పాలన్నారు. తెలంగాణలో బీజేపీ ఉనికే లేదని.. తమ ప్రధాన ప్రత్యర్థి బీఆర్ఎస్ పార్టీయే అని సీఎం రేవంత్ (Revanth Reddy) వ్యాఖ్యలకు ఆయన కౌంటర్ ఇచ్చారు. బీజేపీ జాతీయ (BJP) అధ్యక్షుడు నితిన్ నబీన్ నవంబర్ 23న కరీంనగర్‌లో పర్యటించనున్నారు. ఓటర్ల సమగ్ర సవరణ ప్రక్రియపై విపక్షాల విమర్శలకు ప్రతిగా బీజేపీ మహాపాదయాత్రలు నిర్వహిస్తున్నది. ఇందులో భాగంగా కరీంనగర్‌లో నితిన్ నబిన్ పాదయాత్ర చేయనున్నారు. ఈ కార్యక్రమ ఏర్పాట్లపై బండి సంజయ్ సమీక్షించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఫాంహౌస్‌లో ఉన్న కేసీఆర్ (KCR).. రేవంత్ రెడ్డికి ప్రత్యర్థినా? అని ప్రశ్నించారు. రేవంత్ వ్యాఖ్యలతో బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ ఒక్కటేనని అర్థమవుతున్నదని చెప్పారు.
తెలంగాణలో ఒక్క ఎంపీ సీటు, ఒక్క కార్పొరేషన్ కూడా లేని బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్‌కు (Congress) ఎలా పోటీ అవుతుందో ముఖ్యమంత్రి చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ పోటీని తట్టుకోలేకనే ఆ పార్టీలు లోపాయికారీగా ఒక్కటై తమను అడ్డుకోవాలని చూస్తున్నాయని విమర్శించారు. మీరు మాత్రమే కాదు, ఇతర దేశస్తులను తెచ్చుకున్నా బీజేపీని అడ్డుకోలేరన్నారు. తెలంగాణలో (Telangana) త్వరలోనే బీజేపీ డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తుందని చెప్పారు. కరీంనగర్‌లో జరగబోయే మహాపాద యాత్రను అడ్డుకోవాలని ప్రయత్నిస్తే.. గట్టిగా సమాధానం చెబుతామని హెచ్చరించారు.
18 ఏండ్లు నిండిన అర్హులందరికీ ఓటు హక్కు కల్పించడం, డబుల్ ఓట్లు, మరణించిన వారి ఓట్లను తొలగించడమే సర్ (SIR) ముఖ్య ఉద్దేశమని చెప్పారు. ఇతర దేశాల నుంచి అక్రమంగా వచ్చి ఓటు హక్కు పొందుతూ, ఇక్కడి పేదల సంక్షేమ పథకాలను కొల్లగొడుతున్న వారికి చెక్ పెట్టేందుకే ఈ ప్రక్రియ అని వెల్లడించారు. SIR ప్రక్రియను అడ్డుకునే వారు దేశద్రోహులేనని మండిపడ్డారు.
సంబంధిత వార్తలు

Yuzvendra Chahal | నిన్నటి దాకా పిచ్‌పై వికెట్ల వేట.. ఇక రాజకీయాల్లో చాహల్ కొత్త ఇన్నింగ్స్!
నవంబర్ 22, 2026

Koleti Damodar Gupta | కేసీఆర్ దీక్ష ఫలితమే తెలంగాణ ఆవిర్భావం.. దీక్షాదివస్ బహిరంగ సభను విజయవంతం చేద్దాం: కోలేటి దామోదర్ గుప్తా
నవంబర్ 22, 2026

Anirudh Kavya Maran Reception | అంగరంగ వైభవంగా అనిరుధ్, కావ్య మారన్ రిసెప్షన్
నవంబర్ 21, 2026
తాజావార్తలు
- ●Ananda Nilayam Vimana | తిరుమల ఆనందనిలయ విమానం వెనుక ఆసక్తికర చరిత్ర..!
- ●Yuzvendra Chahal | నిన్నటి దాకా పిచ్‌పై వికెట్ల వేట.. ఇక రాజకీయాల్లో చాహల్ కొత్త ఇన్నింగ్స్!
- ●Vikarabad | ఆటోను ఢీకొట్టిన లారీ.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి
- ●Kiran Abbavaram | కిరణ్ అబ్బవరం రికార్డ్ - డైరెక్టర్‌గా మారనున్న సుకుమార్ శిష్యుడు
- ●Koleti Damodar Gupta | కేసీఆర్ దీక్ష ఫలితమే తెలంగాణ ఆవిర్భావం.. దీక్షాదివస్ బహిరంగ సభను విజయవంతం చేద్దాం: కోలేటి దామోదర్ గుప్తా
- ●US Airport | విమానం ఎక్కుతుండగా ఇద్దరు ప్రయాణికుల అరెస్ట్.. ఎయిర్‌పోర్టులో ఇమిగ్రేషన్ అధికారుల అతి!

Ananda Nilayam Vimana | తిరుమల ఆనందనిలయ విమానం వెనుక ఆసక్తికర చరిత్ర..!

Yuzvendra Chahal | నిన్నటి దాకా పిచ్‌పై వికెట్ల వేట.. ఇక రాజకీయాల్లో చాహల్ కొత్త ఇన్నింగ్స్!

Vikarabad | ఆటోను ఢీకొట్టిన లారీ.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి

Kiran Abbavaram | కిరణ్ అబ్బవరం రికార్డ్ - డైరెక్టర్‌గా మారనున్న సుకుమార్ శిష్యుడు



