Chennai | డబుల్స్ టైటిల్‌పై వైష్ణవి, రుతుజ కన్ను
Chennai | భారత మహిళల టెన్నిస్‌లో చరిత్ర సృష్టించేందుకు వైష్ణవి అడ్కర్, రుతుజా భోసలే సిద్ధమయ్యారు. చెన్నైలోని ఎస్‌డీఏటీ టెన్నిస్ స్టేడియంలో జరుగుతున్న డబ్ల్యూటీఏ టోర్నీ మహిళల డబుల్స్ ఫైనల్లో ఈ భారత జోడీ స్విట్జర్లాండ్‌కు చెందిన నైమా కరమోకో, సిమోనా వాల్టర్‌లతో తలపడనుంది.
- డబ్ల్యూటీఏ ఫైనల్లో భారత జోడీ.. చరిత్రకు అడుగు దూరంలో..
Chennai | భారత మహిళల టెన్నిస్‌లో చరిత్ర సృష్టించేందుకు వైష్ణవి అడ్కర్, రుతుజా భోసలే సిద్ధమయ్యారు. చెన్నైలోని ఎస్‌డీఏటీ టెన్నిస్ స్టేడియంలో జరుగుతున్న డబ్ల్యూటీఏ టోర్నీ మహిళల డబుల్స్ ఫైనల్లో ఈ భారత జోడీ స్విట్జర్లాండ్‌కు చెందిన నైమా కరమోకో, సిమోనా వాల్టర్‌లతో తలపడనుంది. ఈ టైటిల్ పోరు నేడు సాయంత్రం 4 గంటలకు ప్రారంభం కానుంది. ఈ ఫైనల్‌తో వైష్ణవి, రుతుజ అరుదైన ఘనత సాధించనున్నారు. డబ్ల్యూటీఏ టూర్ స్థాయి డబుల్స్ ఫైనల్‌కు చేరిన తొలి భారత మహిళల జోడీగా చరిత్రకెక్కనున్నారు. సెమీఫైనల్లో రెండో సీడ్ జోడీ వెరోనికా ఫాల్కోవ్‌స్కా, అలానా స్మిత్‌పై 6-2, 2-6, (10-8)తో ఉత్కంఠ విజయం సాధించి తుదిపోరుకు అర్హత సాధించారు. ఫైనల్లోనూ ఇదే జోరు కొనసాగించి టైటిల్ అందుకోవాలని భారత జోడీ పట్టుదలగా ఉంది. విజయం సాధిస్తే భారత మహిళల టెన్నిస్‌లో ఇదొక మైలురాయిగా నిలవనుంది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●PM Modi | నక్సలిజంపై విజయం.. సైనికులతో దీపావళి వేడుకలు
- ●Telugu youth dies in USA | అమెరికాలో తెలుగు యువకుడి మృతి.. జగిత్యాల జిల్లాలో విషాదఛాయలు
- ●Juluru Gouri Shankar | తెలంగాణ సంస్కృతిలోని వైవిధ్యాన్ని కాపాడుకోవాలి
- ●Three dies by Suicide | ఒకే కుటుంబంలో ముగ్గురి ఆత్మహత్య.. స్థానికుల సమాచారంతో వెలుగులోకి..
- ●Skin Care | చలికాలంలో చర్మం పొడిబారుతోందా..? ఈ జాగ్రత్తలు పాటించండి
- ●Governor visit Bhagyalakshmi temple | పేదల జీవితాల్లో వెలుగులు పంచడమే దీపావళి స్ఫూర్తి: గవర్నర్

PM Modi | నక్సలిజంపై విజయం.. సైనికులతో దీపావళి వేడుకలు

Telugu youth dies in USA | అమెరికాలో తెలుగు యువకుడి మృతి.. జగిత్యాల జిల్లాలో విషాదఛాయలు

Juluru Gouri Shankar | తెలంగాణ సంస్కృతిలోని వైవిధ్యాన్ని కాపాడుకోవాలి

Three dies by Suicide | ఒకే కుటుంబంలో ముగ్గురి ఆత్మహత్య.. స్థానికుల సమాచారంతో వెలుగులోకి..



