త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CM Revanth Reddy | కొత్త ఆస్ప‌త్రుల్లో అత్యాధునిక ప‌రిక‌రాలు స‌మ‌కూర్చండి

CM Revanth Reddy | ఉస్మానియా ఆసుపత్రి, వరంగల్ సూపర్ స్పెషాలిటీ, ఎల్బీ నగర్, అల్వాల్ టిమ్స్ ఆసుపత్రుల నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ ఆసుపత్రులకు సంబంధించి వైద్యులు, ఇతర సిబ్బంది అవసరాలను గుర్తించి నియామక ప్రక్రియను కూడా మొదలుపెట్టాలని చెప్పారు.

S

Telangana | Published On Oct 3, 2026, 6.16 pm IST

CM Revanth Reddy | కొత్త ఆస్ప‌త్రుల్లో అత్యాధునిక ప‌రిక‌రాలు స‌మ‌కూర్చండి
Advertisement

ఉస్మానియా, టిమ్స్ ఆస్ప‌త్రుల‌పై సీఎం రేవంత్ రెడ్డి స‌మీక్ష‌

CM Revanth Reddy | త్రినేత్ర న్యూస్ : ఉస్మానియా ఆసుపత్రి, వరంగల్ సూపర్ స్పెషాలిటీ, ఎల్బీ నగర్, అల్వాల్ టిమ్స్ ఆసుపత్రుల నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ ఆసుపత్రులకు సంబంధించి వైద్యులు, ఇతర సిబ్బంది అవసరాలను గుర్తించి నియామక ప్రక్రియను కూడా మొదలుపెట్టాలని చెప్పారు.

రాష్ట్రంలో విద్య, వైద్యానికి సంబంధించిన క్షేత్రస్థాయి పరిస్థితులపై ముఖ్యమంత్రి జూబ్లీహిల్స్ నివాసంలో సీఎంవో అధికారులతో జరిగిన సమావేశంలో పలు కీలక సూచనలు చేశారు. రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న ప్రధాన ఆసుపత్రుల నిర్మాణం, వాటి పురోగతిపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రుల నిర్మాణం పూర్తయ్యే నాటికి సిబ్బంది కొరత లేకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు. నిర్మాణాలు పూర్తయ్యేనాటికి ఆసుపత్రుల్లో అవసరమైన అత్యాధునిక పరికరాలను కొనుగోలు చేసి అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులోకి తేవాలని చెప్పారు.

జిల్లా కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటించేలా చూడాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఆదేశించారు. జిల్లా కలెక్టర్లతో పాటు అధికారులు క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పాఠశాలలు, సాంఘిక సంక్షేమ హాస్టళ్లు, ఆసుపత్రులను విధిగా సందర్శించాలని స్పష్టం చేశారు. జిల్లా స్థాయిలో ప్రతి వారం వీటిపై సమీక్ష నిర్వహించాలన్నారు. సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పాఠశాలల్లో అవసరమైన చోట మరమ్మతు పనులను చేపట్టాలని తెలిపారు. డిసెంబరులో భారత్ ఫ్యూచర్ సిటీలో నిర్వహించ తలపెట్టిన ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లపైనా సమావేశంలో చర్చించారు. సమ్మిట్ ఏర్పాట్లు, అతిథులు, పెట్టుబడుల విషయంలో పకడ్బందీగా ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. త్వరలోనే ఏర్పాట్లను పరిశీలిస్తానని స్పష్టం చేశారు.

ఈ సమావేశంలో ఎంపీ వేం నరేందర్ రెడ్డి గారు, ప్రభుత్వ సలహాదారు కె రామకృష్ణారావురు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్‌తో పాటు సీఎంవో ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement