Stray Dogs | వీధికుక్కల సమస్యపై వినూత్న నిరసన.. కుక్క ముఖంతో ప్రజావాణికి వచ్చిన వ్యక్తి
Stray Dogs | వీధి కుక్కల (Stray Dogs) సమస్యలపై ఓ వ్యక్తి వినూత్న రీతిలో నిరసన తెలిపాడు. కలెక్టరేట్‌లో జరిగిన ప్రజావాణి కార్యక్రమానికి కుక్క ముఖంతో మాస్క్ ధరించి వచ్చాడు. ఆ వ్యక్తిని చూసి కలెక్టరేట్‌లోని ప్రజలు, అధికారులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇదేంటి అంటూ నవ్వుకున్నారు.
Stray Dogs | త్రినేత్ర.న్యూస్ : మధ్యప్రదేశ్ (Madhya Pradesh)లోని ఖాండ్వా (Khandwa) కలెక్టరేట్‌లో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో వీధికుక్కల (Stray Dogs) సమస్యపై ఓ వ్యక్తి వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశాడు. మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న వీధి కుక్కల స్టెరిలైజేషన్ డ్రైవ్‌లో (dog sterilisation drive) అవకతవకలు జరుగుతున్నాయంటూ కుక్క ముఖంతో మాస్క్ ధరించి విభిన్న రీతిలో నిరసన చేపట్టాడు.
ఖండ్వా మున్సిపల్ కార్పొరేషన్ ప్రతిపక్ష నాయకుడు దీపక్ రాథోర్ నగరంలోని వీధి కుక్కల సమస్యను విభిన్న రీతిలో అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఓ వ్యక్తికి కుక్క ముఖంతో కూడిన మాస్క్‌ను వేసి అధికారుల ముందుకు తీసుకెళ్లాడు. ఖండ్వాలో గత నాలుగేళ్లలోనే 13,225 మంది కుక్క కాట్లకు గురయ్యారని రాథోడ్ తెలిపారు. వీధి కుక్కల సంఖ్య పెరుగుతూనే ఉందని ఆందోళన వ్యక్తం చేశాడు. కుక్కలకు స్టెరిలైజేషన్ పేరుతో మున్సిపల్ అధికారులు రూ.40 లక్షలకు పైగా ఖర్చు చేశారని ఆరోపించారు. అయినా కుక్కల సంతానోత్సత్తి ఆగడం లేదని వివరించాడు. అధికారులు స్టెరిలైజేషన్ పేరుతో నిధులను దుర్వినియోగం చేశారని ఆరోపించాడు.
రాథోర్ సమస్యను విన్న అధికారులు ఈ విషయంపై విచారణ జరిపి చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. ఇందుకోసం ఓ కమిటీని ఏర్పాటు చేస్తామని అధికారులు తెలిపారు. మరోవైపు కుక్క మాస్క్‌తో అక్కడికి వచ్చిన వ్యక్తిని చూసి కలెక్టరేట్‌లోని ప్రజలు, అధికారులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇదేంటి అంటూ నవ్వుకున్నారు.
📺WATCH | Man dressed as dog appeared at a public hearing in Madhya Pradesh's Khandwa to protest the growing stray dog population and the problems caused by them pic.twitter.com/aLxizQDwa5
— The Tatva (@thetatvaindia) August 19, 2026
Also Read..
పెట్టుబడిదారులకు గుడ్ న్యూస్.. రూ.5వేల కోట్లకు బీపీసీఎల్ డిబెంచర్లు..
కొత్త కారు, ఖర్చుల కోసం నెలకు రూ.లక్ష.. ఎమ్మెల్యేలపై సీఎం విజయ్ వరాల జల్లు
సంబంధిత వార్తలు

Garba | మీ అక్కాచెల్లెళ్లను తీసుకురండి.. గర్భా వేడుకలపై బీజేపీ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు
సెప్టెంబర్ 22, 2026

Cheetah | విజయవంతంగా ప్రాజెక్టు చీతా.. 71 ఏండ్ల తర్వాత భారత గడ్డపై చీతాల సందడి
సెప్టెంబర్ 21, 2026

KUNO | కునోలో 56కి చేరిన చిరుతల సంఖ్య.. నాలుగు పిల్లలకు జన్మనిచ్చిన కేజీపీ12
సెప్టెంబర్ 18, 2026
తాజావార్తలు
- ●TG Weather | తెలంగాణకు ఐఎండీ తీపి కబురు.. మళ్లీ జోరందుకోనున్న వానలు..!
- ●Kayadu Lohar | రెట్రో లుక్‌లో కయదు - క్యూట్ ఫాటోలతో మాయ చేసిన ప్యారడైజ్ హీరోయిన్
- ●Hyderabad Police Overstaying Foreigners | వీసా గడువు ముగిసినా హైదరాబాద్‌లోనే అక్రమంగా ఉంటూ విదేశీయులు ఏం చేస్తున్నారంటే?
- ●Priyanka Chopra | ప్రియాంక చోప్రా హీరోయిన్గా నటించిన ఒకే ఒక తమిళ మూవీ - దళపతి విజయ్ హీరో - యూట్యూబ్‌లో ఫ్రీ స్ట్రీమింగ్
- ●Akbaruddin Owaisi | నా వయసైపోయింది.. ఇక వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను: అక్బరుద్దీన్ ఓవైసీ ఆసక్తికర వ్యాఖ్యలు
- ●Men's Hockey Team | ఆసియా క్రీడల్లో హాకీ గోల్డ్.. మలేసియాపై భారత్ సూపర్ విక్టరీ.. ఒలింపిక్స్‌కు అర్హత

TG Weather | తెలంగాణకు ఐఎండీ తీపి కబురు.. మళ్లీ జోరందుకోనున్న వానలు..!

Kayadu Lohar | రెట్రో లుక్‌లో కయదు - క్యూట్ ఫాటోలతో మాయ చేసిన ప్యారడైజ్ హీరోయిన్

Hyderabad Police Overstaying Foreigners | వీసా గడువు ముగిసినా హైదరాబాద్‌లోనే అక్రమంగా ఉంటూ విదేశీయులు ఏం చేస్తున్నారంటే?

Priyanka Chopra | ప్రియాంక చోప్రా హీరోయిన్గా నటించిన ఒకే ఒక తమిళ మూవీ - దళపతి విజయ్ హీరో - యూట్యూబ్‌లో ఫ్రీ స్ట్రీమింగ్



