Terrorists | కశ్మీర్‌లోకి 10,000 మంది ఉగ్రవాదులు..!
Terrorists | జమ్ము కశ్మీర్‌లో (Jammu Kashmir)కి దాదాపు 10 వేల మంది ఉగ్రవాదులు (Terrorists) చొరబడ్డారని పాకిస్థాన్‌కు చెందిన ఓ మతబోధకుడు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. వారిని లష్కరే తోయిబా ఉగ్రసంస్థ చీఫ్ హఫీజ్ సయీద్ పంపినట్లుగా వెల్లడించాడు.
Terrorists | త్రినేత్ర.న్యూస్ : జమ్ము కశ్మీర్ (Jammu Kashmir)లో ఉగ్రకార్యకలాపాలపై ఆందోళనలు కొనసాగుతున్న వేళ పాకిస్థాన్ (Pakistan)కు చెందిన ఓ మతబోధకుడు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. కశ్మీర్‌లోకి దాదాపు 10 వేల మంది ఉగ్రవాదులు (Terrorists) చొరబడ్డారని తెలిపాడు. ఆ టెర్రరిస్ట్‌లను లష్కరే తోయిబా ఉగ్రసంస్థ (Lashkar-e-Taiba) చీఫ్ హఫీజ్ సయీద్ (Hafiz Saeed) పంపినట్లుగా వెల్లడించాడు.
పంజాబ్ ప్రావిన్స్‌లోని బహావల్‌నగర్‌లో (Bahawalnagar) ఆగస్టు 14న జరిగిన సమావేశంలో మతబోధకుడు నసీర్ మద్నీ (Naseer Madni) ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా లష్కరే చీఫ్‌పై ప్రశంసలు కురిపించారు. సయీద్‌ను మాతృభూమి సేవకుడిగా అభివర్ణించాడు. ఆయన కశ్మీర్‌లోకి 10 వేల మంది ఉగ్రవాదులను పంపించినట్లు చెప్పాడు. ఆయన వ్యాఖ్యలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. దీంతో కశ్మీర్‌లో మరోసారి ఉగ్రవాద కార్యకలాపాలపై ఆందోళనలను వ్యక్తమవుతున్నాయి. అంతేకాదు, ఆయన వ్యాఖ్యలతో కశ్మీర్‌లో ఉగ్రవాద కార్యకలాపాల వెనుక హఫీజ్ హస్తం ఉందనే విషయం మరోసారి స్పష్టమవుతోంది.
లష్కరే తోయిబా (Lashkar-e-Taiba) పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థ. హఫీజ్ సయీద్ సారథ్యంలోని ఈ సంస్థ భారత్‌లో అనేక దాడులకు పాల్పడిన విషయం తెలిసిందే. 2008 ముంబై ఉగ్రదాడులు, 2001 భారత పార్లమెంట్ దాడి, గతేడాది జరిగిన పహల్గామ్ ఉగ్రదాడి సహా దేశంలో జరిగిన పలు దాడుల వెనుక ఈ సంస్థ హస్తం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. గతేడాది జరిగిన పహల్గాం ఉగ్రదాడి కేసులో హఫీజ్ సయీద్‌పై జమ్ముకశ్మీర్ న్యాయస్థానం నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఇక భారత్, ఐక్యరాజ్యసమితి, అమెరికా, బ్రిటన్ తదితర దేశాలు లష్కరే సంస్థను ఉగ్రవాద సంస్థగా ప్రకటించాయి.
Also Read..
ముడి చమురు ధరల ఎఫెక్ట్.. బులియన్ మార్కెట్లపై తీవ్ర ప్రభావం..
బెట్టింగ్ యాప్‌ల ప్రచారం.. నేడు ఈడీ ముందుకు రాజా సాబ్ హీరోయిన్
సంబంధిత వార్తలు

Fauzi Musa | బుద్గాంలో ఎన్కౌంటర్.. లష్కరే టాప్ కమాండర్ హతం
సెప్టెంబర్ 30, 2026

S Jaishankar | భారత్-అమెరికా సంబంధాల్లో ఉగ్రవాదం కీలక అంశం : జైశంకర్
సెప్టెంబర్ 29, 2026

UNGA | పగలు ప్రపంచ శాంతి, రాత్రి ఉగ్రవాదం.. ఇదీ దాయాది కపట బుద్ధి.. ఐరాసలో పాక్ పీఎం ప్రసంగంపై భారత్ ఘాటు సమాధానం
సెప్టెంబర్ 26, 2026
తాజావార్తలు
- ●TG Weather | తెలంగాణకు ఐఎండీ తీపి కబురు.. మళ్లీ జోరందుకోనున్న వానలు..!
- ●Kayadu Lohar | రెట్రో లుక్‌లో కయదు - క్యూట్ ఫాటోలతో మాయ చేసిన ప్యారడైజ్ హీరోయిన్
- ●Hyderabad Police Overstaying Foreigners | వీసా గడువు ముగిసినా హైదరాబాద్‌లోనే అక్రమంగా ఉంటూ విదేశీయులు ఏం చేస్తున్నారంటే?
- ●Priyanka Chopra | ప్రియాంక చోప్రా హీరోయిన్గా నటించిన ఒకే ఒక తమిళ మూవీ - దళపతి విజయ్ హీరో - యూట్యూబ్‌లో ఫ్రీ స్ట్రీమింగ్
- ●Akbaruddin Owaisi | నా వయసైపోయింది.. ఇక వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను: అక్బరుద్దీన్ ఓవైసీ ఆసక్తికర వ్యాఖ్యలు
- ●Men's Hockey Team | ఆసియా క్రీడల్లో హాకీ గోల్డ్.. మలేసియాపై భారత్ సూపర్ విక్టరీ.. ఒలింపిక్స్‌కు అర్హత

TG Weather | తెలంగాణకు ఐఎండీ తీపి కబురు.. మళ్లీ జోరందుకోనున్న వానలు..!

Kayadu Lohar | రెట్రో లుక్‌లో కయదు - క్యూట్ ఫాటోలతో మాయ చేసిన ప్యారడైజ్ హీరోయిన్

Hyderabad Police Overstaying Foreigners | వీసా గడువు ముగిసినా హైదరాబాద్‌లోనే అక్రమంగా ఉంటూ విదేశీయులు ఏం చేస్తున్నారంటే?

Priyanka Chopra | ప్రియాంక చోప్రా హీరోయిన్గా నటించిన ఒకే ఒక తమిళ మూవీ - దళపతి విజయ్ హీరో - యూట్యూబ్‌లో ఫ్రీ స్ట్రీమింగ్



