త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Priyanka Chopra | ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా న‌టించిన ఒకే ఒక‌ త‌మిళ మూవీ – ద‌ళ‌ప‌తి విజ‌య్ హీరో – యూట్యూబ్‌లో ఫ్రీ స్ట్రీమింగ్‌

ద‌ళ‌ప‌తి విజ‌య్‌, ప్రియాంక చోప్రా హీరోహీరోయిన్లుగా న‌టించిన కోలీవుడ్ మూవీ త‌మిళ‌న్ యూట్యూబ్‌లో రిలీజైంది. ఫ్రీగా స్ట్రీమింగ్ అవుతోంది. త‌మిళ‌న్‌తోనే హీరోయిన్‌గా ప్రియాంక చోప్రా సినీ ప్ర‌యాణం ప్రారంభ‌మైంది. ప్రియాంక చోప్రా క‌థానాయిక‌గా న‌టించిన ఒకే ఒక త‌మిళ మూవీ ఇదే కావ‌డం గ‌మ‌నార్హం.

N

Entertainment | Published On Oct 3, 2026, 7.12 pm IST

Priyanka Chopra | ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా న‌టించిన ఒకే ఒక‌ త‌మిళ మూవీ – ద‌ళ‌ప‌తి విజ‌య్ హీరో – యూట్యూబ్‌లో ఫ్రీ స్ట్రీమింగ్‌
Advertisement

Priyanka Chopra |  హీరోయిన్‌గా గ్లోబ‌ల్ స్టార్ ప్రియాంక చోప్రా కెరీర్ త‌మిళ సినిమాల‌తోనే మొద‌లైంది. కోలీవుడ్ మూవీ త‌మిళ‌న్‌తో మొద‌టిసారి కెమెరా ముందుకొచ్చింది. డెబ్యూ మూవీ కోసం ద‌ళ‌ప‌తి విజ‌య్‌తో జోడీక‌ట్టింది. 2022లో రిలీజైన త‌మిళ‌న్ పెద్ద విజ‌యాన్ని సాధించింది. త‌మిళ‌న్ త‌ర్వాత బాలీవుడ్‌లో బిజీ అయిన ఈ బ్యూటీ మ‌ళ్లీ ద‌క్షిణాదిలో సినిమాలు చేయ‌లేదు. ప్రియాంక చోప్రా క‌థానాయిక‌గా న‌టించిన ఒకే ఒక త‌మిళ మూవీ ఇదే కావ‌డం గ‌మ‌నార్హం.

యూట్యూబ్‌లో ఫ్రీ స్ట్రీమింగ్‌...

తాజాగా త‌మిళ‌న్ మూవీ యూట్యూబ్‌లో రిలీజైంది. స‌న్ నెక్స్ట్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌కు చెందిన స‌న్ నెక్స్ట్ ఫ్రీ మూవీస్ ద్వారా ఈ కోలీవుడ్ మూవీ ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. ఎలాంటి స‌బ్‌స్క్రిప్ష‌న్ ఛార్జీలు లేకుండా ఉచితంగా ఈ సినిమాను చూడొచ్చ‌ని స‌న్ నెక్స్ట్ వెల్ల‌డించింది. కేవ‌లం త‌మిళ వెర్ష‌న్ మాత్ర‌మే అందుబాటులో ఉంది.

విజ‌య్ తండ్రి...

త‌మిళ‌న్ సినిమాకు మ‌జిత్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ద‌ళ‌ప‌తి విజ‌య్ తండ్రి ఎస్ఏ చంద్ర‌శేఖ‌ర్ స్క్రీన్‌ప్లే స‌మ‌కూర్చారు. త‌మిళ‌న్ సినిమా కోసం సింగ‌ర్‌గా కూడా మారింది ప్రియాంక చోప్రా. ఇందులోని ఉల్లాత్తై కిల్లాత్తే అనే పాట‌ను ద‌ళ‌ప‌తి విజ‌య్‌తో క‌లిసి పాడింది. ఈ పాట అప్ప‌ట్లో ట్రెండ్ సెట్ట‌ర్‌గా నిలిచింది.తెలుగులోనూ ద‌మ్ముంటే కాస్కో పేరుతో రిలీజైంది.

అన్యాయంపై పోరాటం...

త‌న కుటుంబానికి జ‌రిగిన అన్యాయంపై ఓ లాయ‌ర్ ఎలాంటి పోరాటం సాగించాడ‌నే అంశాల‌తో ఈ మూవీ రూపొందింది.
త‌మిళ‌న్ త‌ర్వాత దాదాపు ఇర‌వై నాలుగేళ్ల గ్యాప్ అనంత‌రం మ‌హేష్‌బాబు వార‌ణాసితో ద‌క్షిణాదిలోకీ రీఎంట్రీ ఇస్తోంది ప్రియాంక చోప్రా. రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమా వ‌చ్చే ఏడాది ఏప్రిల్‌లో థియేట‌ర్ల‌లోకి రాబోతుంది. యాక్ష‌న్ అడ్వెంచ‌ర్ థ్రిల్ల‌ర్‌గా రూపొందుతోన్న వార‌ణాసిపై పాన్ ఇండియ‌న్ వైడ్‌గా భారీగా అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. ఇందులో మందాకిని అనే యాక్ష‌న్ పాత్ర‌లో ప్రియాంక చోప్రా క‌నిపించ‌బోతుంది.

Advertisement
Advertisement