త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Tiger | అమ్రాబాద్ టైగ‌ర్ రిజ‌ర్వ్‌లో పెద్ద పులి ద‌ర్శ‌నం..

Tiger | మూడు నెల‌ల విరామం అనంత‌రం అమ్రాబాద్ టైగ‌ర్ రిజ‌ర్వ్‌లో స‌ఫారీ సేవ‌లు మ‌ళ్లీ అందుబాటులోకి వ‌చ్చాయి. స‌ఫారీ ప్రారంభ‌మైన తొలి రోజే ప‌ర్యాట‌కుల‌కు పెద్ద‌ పులి ద‌ర్శ‌న‌మిచ్చింది.

S

Telangana | Published On Oct 3, 2026, 6.25 pm IST

Tiger | అమ్రాబాద్ టైగ‌ర్ రిజ‌ర్వ్‌లో పెద్ద పులి ద‌ర్శ‌నం..
Advertisement

Tiger | త్రినేత్ర న్యూస్ : మూడు నెల‌ల విరామం అనంత‌రం అమ్రాబాద్ టైగ‌ర్ రిజ‌ర్వ్‌లో స‌ఫారీ సేవ‌లు మ‌ళ్లీ అందుబాటులోకి వ‌చ్చాయి. స‌ఫారీ ప్రారంభ‌మైన తొలి రోజే ప‌ర్యాట‌కుల‌కు పెద్ద‌ పులి ద‌ర్శ‌న‌మిచ్చింది. దీంతో ప‌ర్యాట‌కులు ఎంజాయ్ చేశారు. పెద్ద పులిని త‌మ కెమెరాల్లో బంధించారు.

పెద్ద పులి క‌నిపించ‌డంతో.. ప‌ర్యాట‌కుల్లో ఉత్సాహం ఉప్పొంగింద‌ని డీఎఫ్‌వో రేవంత్ పేర్కొన్నారు. ఈ క్ర‌మంలో ప‌ర్యాట‌కుల‌కు సఫారీ, ఎకో టూరిజంపై మరింత ఆసక్తి పెరుగుతుంద‌న్నారు. గత సఫారీ సీజన్ చివర్లోనే సఫారీ జోన్‌లో పులి సంచారాన్ని అటవీ అధికారులు గుర్తించారు. పులుల రక్షణపై మరింత అప్రమత్తంగా ఉండాలని పీసీసీఎఫ్ వినయ్ కుమార్ హెచ్చ‌రించారు. రోజువారీ పెట్రోలింగ్‌తో పాటు అటవీ శాఖ విభాగాల మధ్య సమన్వయం పెంచాలని సూచించారు.

Advertisement
Advertisement