HPV Vaccine | 14 ఏండ్లు దాటిన బాలికలకు ఉచితంగా హెచ్‌పీవీ టీకా
HPV Vaccine | దేశ వ్యాప్తంగా 14 ఏండ్లు దాటిన బాలికలను ఉచితంగా హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ను (HPV Vaccine) అందించనున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ అధికారులు తెలిపారు. ఇందులో భాగంగా గార్డాసిల్ ఇంజెక్షన్ (Gardasil)ను ఆరోగ్య కేంద్రాల్లో ఉచితంగా ఇవ్వనున్నారు.
HPV Vaccine | మహిళల్లో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ (cervical cancer)ను నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగానే త్వరలో దేశ వ్యాప్తంగా 14 ఏండ్లు దాటిన బాలికలను ఉచితంగా హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ను (HPV Vaccine) అందించనున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ అధికారులు తెలిపారు. ఇందులో భాగంగా గార్డాసిల్ ఇంజెక్షన్ (Gardasil)ను ఆరోగ్య కేంద్రాల్లో ఉచితంగా ఇవ్వనున్నారు. దాదాపు 1.15 కోట్ల మంది బాలికలకు ఈ టీకాను అందించనున్నారు. ఈ వ్యాక్సిన్ నాలుగు రకాల గర్భాశయ క్యాన్సర్‌లను నిరోధిస్తుంది. ఈ క్యాన్సర్‌కు కారణమయ్యే హెచ్‌పీవీ టైప్ 16, 18 తోపాటు టైప్ 6, 11 రకాల నుంచి ఇది రక్షణ కల్పిస్తుందని ఆరోగ్యశాఖ వర్గాలు వెల్లడించాయి. ఒక డోసుతో బాలికలకు సంబంధిత వైరస్‌ల నుంచి దీర్ఘకాల రక్షణ లభిస్తుందని పలు పరిశోధనల్లో తేలింది.
15ఏళ్ల లోపు బాలికల కోసం గార్డాసిల్-4 టీకా ప్రస్తుతం మార్కెట్‌లో అందుబాటులో ఉంది. ఈ టీకా రెండు డోసుల్లో తీసుకోవాల్సి ఉంటుంది. దీని ఒక్కో డోసు ధర రూ.3,927గా ఉంది. అదే 15 ఏళ్లు పైబడిన బాలికలు మాత్రం మూడు డోసుల్లో ఈ టీకాను తీసుకోవాల్సి ఉంటుంది. ఈ వ్యాక్సిన్ 2006లో అందుబాటులోకి వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకూ 50 కోట్ల డోసులను పంపిణీ చేశారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 160 దేశాల్లో ఇప్పటికే ఈ టీకా పంపిణీ కార్యక్రమం అమల్లో ఉంది. వీటిలో 90 దేశాలు సింగిల్ డోసులో అందిస్తున్నాయి. ఈ టీకా వల్ల అనేక దేశాల్లో సర్వైకల్ క్యాన్సర్లు గణనీయంగా తగ్గినట్లు నివేదికలు సూచిస్తున్నాయి. అందుకే తల్లిదండ్రులు తప్పనిసరిగా తమ కుమార్తెలకు ఈ వ్యాక్సిన్‌ను ఇప్పించాలని కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులు సూచిస్తున్నారు.
Also Read..
Sikkim | సిక్కింలో విపరీతంగా మంచు.. చిక్కుకుపోయిన 2,700 మంది పర్యాటకులు
Shashi Tharoor | 'కేరళం'తో ఒరిగేదేంటి..? ప్రాజెక్టులు ముఖ్యం.. కేంద్ర ప్రభుత్వంపై శశి థరూర్ ఫైర్
Stress | స్మోకింగ్, డ్రింకింగే కాదు.. దీన్ని కూడా వదిలించుకోవాలి.. వైద్యుల సూచన..
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Smart Ration Cards | వచ్చే నెలలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ..!
- ●Rashmika Mandanna | కామన్వెల్త్ గేమ్స్ ముగింపు వేడుకల్లో రష్మిక మందన్న - తొలి తెలుగు హీరోయిన్గా అరుదైన ఘనత
- ●Peddi Sudarshan Reddy | బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి హఠాన్మరణం
- ●Kukatpally | క్రికెట్ ఆడటానికి వెళ్తూ.. కానరాని లోకాలకు..
- ●Komuravelli Railway Station | సాకారమైన దశాబ్దాల కల.. నేడు కొమురెల్లి మల్లన్న రైల్వే స్టేషన్ ప్రారంభం..
- ●Jurala Project | జూరాలను తాకిన కృష్ణమ్మ.. కాలువలకు నీరు విడుదల చేస్తారా?

Smart Ration Cards | వచ్చే నెలలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ..!

Rashmika Mandanna | కామన్వెల్త్ గేమ్స్ ముగింపు వేడుకల్లో రష్మిక మందన్న - తొలి తెలుగు హీరోయిన్గా అరుదైన ఘనత

Peddi Sudarshan Reddy | బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి హఠాన్మరణం

Kukatpally | క్రికెట్ ఆడటానికి వెళ్తూ.. కానరాని లోకాలకు..






