Cancer | తెలంగాణలో ‘క్యాన్సర్’ ప్రమాద ఘంటికలు..! ‘నోటి క్యాన్సర్’ బాధితులే అధికం..!!
Cancer | తెలంగాణలో క్యాన్సర్ ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. ఏడాదికి ఏడాది క్యాన్సర్ కేసులు పెరిగిపోతూనే ఉన్నాయి. ప్రథమ దశలో క్యాన్సర్‌ను గుర్తించకపోవడంతో.. మరణాల సంఖ్య కూడా అధికమవుతుంది. మొత్తంగా క్యాన్సర్ కేసులను గుర్తించడంలో తెలంగాణ నిశ్శబ్ద సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది.
Cancer | త్రినేత్ర.న్యూస్ : తెలంగాణలో క్యాన్సర్ ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. ఏడాదికి ఏడాది క్యాన్సర్ కేసులు పెరిగిపోతూనే ఉన్నాయి. ప్రథమ దశలో క్యాన్సర్‌ను గుర్తించకపోవడంతో.. మరణాల సంఖ్య కూడా అధికమవుతుంది. మొత్తంగా క్యాన్సర్ కేసులను గుర్తించడంలో తెలంగాణ నిశ్శబ్ద సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. ఈ పరిస్థితికి కారణం.. స్క్రీనింగ్ రేటు అత్యంత తక్కువగా ఉండటమే అని నివేదికలు చెబుతున్నాయి. చివరి దశలో క్యాన్సర్ బయటపడడంతో.. అప్పటికే అది ముదిరి ప్రాణాలను బలి తీసుకుంటుంది.
నిమ్స్‌లోని ఐసీఎంఆర్ - నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ ఇన్ఫర్మేటిక్స్ అండ్ రీసెర్చ్ తెలంగాణ క్యాన్సర్ బర్డెన్ ప్రొఫైల్ 2026 నివేదికను శుక్రవారం విడుదల చేసింది. ఈ నివేదికలో ఆందోళనకరమైన విషయాలు వెల్లడి అయ్యాయి. 30 నుంచి 49 ఏండ్ల వయసు గల వ్యక్తుల్లో స్క్రీనింగ్ కొరవడిందని నివేదికలో పేర్కొన్నారు. చాలా మంది ముందుస్తుగా స్క్రీనింగ్ చేయించుకోకపోవడం వల్లే క్యాన్సర్ శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపించి.. ముదిరిన తర్వాత బయటపడుతుంది. దీంతో చికిత్స కష్టంగా మారడంతో పాటు ఖరీదైనదిగా కూడా మారుతోంది. అటు చికిత్స చేయించుకోలేక, ఇటు ఖర్చు భరించలేక.. చివరకు ప్రాణాలను కోల్పోతున్నారు.
రొమ్ము క్యాన్సర్ అత్యంత సాధారణం
పురుషులలో అత్యంత సాధారణమైన క్యాన్సర్ నోటి క్యాన్సర్. ఈ క్యాన్సర్‌ను గుర్తించేందుకు ఉద్దేశించిన పరీక్షను కేవలం 2.6 శాతం మంది పురుషులు మాత్రమే చేయించుకున్నారు. మహిళల విషయానికి వస్తే రొమ్ము క్యాన్సర్ అత్యంత సాధారణంగా మారిపోయింది. 0.3 శాతం మంది మహిళలు మాత్రమే క్లినికల్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ చేయించుకున్నారు. మహిళలో రెండో అత్యంత సాధారణ క్యాన్సర్ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్.. దీన్ని కేవలం 3.3 శాతం మంది మహిళలు మాత్రమే ఇప్పటి వరకు స్క్రీనింగ్ చేయించుకున్నారు.
క్యాన్సర్‌కు అతిపెద్ద కారకం పొగాకు
55 శాతం మంది పురుషుల్లో, 62 శాతం మంది మహిళల్లో స్టేజ్ 4లోనే క్యాన్సర్ నిర్ధారణ అవుతుంది. అయితే అప్పటికే క్యాన్సర్ కారకాలు ఇతర అవయవాలకు వ్యాపించి.. వ్యాధి మరింత ముదురుతుంది. దీంతో ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుంది. తెలంగాణలో క్యాన్సర్‌కు అతిపెద్ద కారకం పొగాకు అని తేలింది. పొగాకు వినియోగం వల్లే పురుషుల్లో 58.8 శాతం మంది, మహిళల్లో 29.7 శాతం మంది క్యాన్సర్ బారిన పడుతున్నారు. 2026 నాటికి పురుషుల్లో 21,252 కొత్త కేసులు నమోదు కాగా, మహిళల్లో 25,510 కొత్త కేసులు నమోదు అయ్యాయి. ఈ ఒక్క ఏడాదిలోనే చిన్నారులు, కౌమారదశలో ఉన్నవారిలో 1,199 కొత్త క్యాన్సర్ కేసులు నమోదవుతాయని నివేదిక అంచనా వేస్తోంది.
ఈ నివేదిక విడుదల సందర్భంగా నిమ్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ నాగరి బీరప్ప మాట్లాడారు. క్యాన్సర్‌పై ముందుగానే ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. మొదటి దశలోనే క్యాన్సర్‌ను గుర్తించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. తెలంగాణలో క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయన్న దానికి ఈ నివేదికనే నిదర్శనమని ఆయన స్పష్టం చేశారు.
అనంతరం ఎంఎన్‌జే క్యాన్సర్ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ సదాశివుడు గుండేటి మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవాటు చేసుకోవాలన్నారు. క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలతో పాటు క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులను చేయించుకోవాలని సూచించారు. అప్పుడే క్యాన్సర్‌ను నివారించే అవకాశం ఉంటుందన్నారు.
తెలంగాణలో క్యాన్సర్ కేసులు ఇలా..
- 19 ఏళ్లకు పైబడిన వారిలో 21,252 మంది పురుషులు, 25,510 మంది మహిళలు క్యాన్సర్ బారిన పడ్డారు.
- హైదరాబాద్ నగరంలో 0-74 ఏండ్ల మధ్య వయసు వారిలో 8 మందిలో ఒకరికి క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది.
- పురుషుల్లో 55 శాతం, మహిళల్లో 62 శాతం క్యాన్సర్ కేసులు స్టేజ్4లోనే బయటపడుతున్నాయి.
- పురుషుల్లో వచ్చే మొత్తం క్యాన్సర్ కేసుల్లో 58.8 శాతం కేసులు పొగాకు వల్లే సంభవించాయి.
- 15.3 శాతం మంది నోటి క్యాన్సర్‌తో, 9.7 శాతం లంగ్స్ క్యాన్సర్‌తో, 8.8 శాతం మంది కోలోరెక్టమ్(పెద్దపేగు) క్యాన్సర్‌తో బాధపడుతున్నారు.
- మహిళల్లో 29.7 శాతం క్యాన్సర్లు పొగాకు సంబంధితమైనవే.
- 27.9 శాతం మంది రొమ్ము క్యాన్సర్, 12.7 శాతం మంది గర్భాశయ ముఖద్వార క్యాన్సర్, 6 శాతం మంది పెద్దపేగు క్యాన్సర్‌తో బాధపడుతున్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Beware of Frauds| మేం అడిగినంత ఇవ్వండి..మీకు ఇందిరమ్మ ఇల్లు గ్యారంటీ
- ●Telugu OTT | ఓటీటీలోకి షాకింగ్ ట్విస్ట్‌లతో సాగే తెలుగు లవ్‌స్టోరీ - చెప్పిన డేట్ కంటే ఓ రోజు ముందే స్ట్రీమింగ్
- ●Hyderabad | ఇన్‌స్టాలో మైనర్ బాలికలే టార్గెట్.. ప్రేమ పేరుతో ఐదుగురు యువతులతో వ్యవహారం..
- ●Chiranjeevi | మరోసారి మంచి మనసు చాటుకున్న మెగాస్టార్ - గబ్బర్‌సింగ్ నటుడికి ఆర్థిక సాయం
- ●Smart Ration Cards | వచ్చే నెలలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ..!
- ●Rashmika Mandanna | కామన్వెల్త్ గేమ్స్ ముగింపు వేడుకల్లో రష్మిక మందన్న - తొలి తెలుగు హీరోయిన్గా అరుదైన ఘనత

Beware of Frauds| మేం అడిగినంత ఇవ్వండి..మీకు ఇందిరమ్మ ఇల్లు గ్యారంటీ

Telugu OTT | ఓటీటీలోకి షాకింగ్ ట్విస్ట్‌లతో సాగే తెలుగు లవ్‌స్టోరీ - చెప్పిన డేట్ కంటే ఓ రోజు ముందే స్ట్రీమింగ్

Hyderabad | ఇన్‌స్టాలో మైనర్ బాలికలే టార్గెట్.. ప్రేమ పేరుతో ఐదుగురు యువతులతో వ్యవహారం..

Chiranjeevi | మరోసారి మంచి మనసు చాటుకున్న మెగాస్టార్ - గబ్బర్‌సింగ్ నటుడికి ఆర్థిక సాయం






