Sikkim | సిక్కింలో విపరీతంగా మంచు.. చిక్కుకుపోయిన 2,700 మంది పర్యాటకులు
Sikkim | సిక్కిం (Sikkim)లో విపరీతంగా మంచు (Snow) పడుతోంది. దీంతో పర్యాటకులు (Tourists) ఎక్కడికక్కడ నిలిచిపోయారు. సుమారు 2,736 మంది పర్యాటకులను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
Sikkim | సిక్కిం (Sikkim)లో అతిశీతల వాతావరణం నెలకొంది. అక్కడ విపరీతంగా మంచు (Snow) పడుతోంది. ఈ మంచు కారణంగా జనజీవనం స్తంభించిపోయింది. రాకపోకలు కూడా నిలిచిపోయాయి. దీంతో పర్యాటకులు (Tourists) ఎక్కడికక్కడ నిలిచిపోయారు. పెరాథాంగ్ ఎగువ ప్రాంతాలు, సోమ్గో సరస్సు (Tsomgo Lake) పరిసరాల్లో మంగళవారం భారీ హిమపాతం కురిసింది. ఈ కారణంగా 15వ మైలు, సోమ్గో మధ్య పెద్ద సంఖ్యలో పర్యాటక వాహనాలు నిలిచిపోయాయి.
భారీ హిమపాతం కారణంగా రోడ్లు బ్లాక్ అయ్యాయని.. ఫలితంగా సుమారు 2,736 మంది పర్యాటకులతో ఉన్న మొత్తం 541 వాహనాలు అక్కడ నిలిచిపోయినట్లు సిక్కిం పర్యాటక శాఖ అధికారులు తెలిపారు. ఎస్‌హెచ్‌వో, చెక్‌పోస్టు అధికారులు, టూరిజం పర్మిట్ సెల్ అధికారులు సహా పలు శాఖ అధికారుల ఆధ్వర్యంలో సహాయక చర్యలు చేపట్టినట్లు తెలిపారు. అన్ని విభాగాల సమన్వయంతో మంచు పరిస్థితుల్లో చిక్కుకుపోయిన పర్యాటకులందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు పేర్కొంది.
Also Read..
Shashi Tharoor | 'కేరళం'తో ఒరిగేదేంటి..? ప్రాజెక్టులు ముఖ్యం.. కేంద్ర ప్రభుత్వంపై శశి థరూర్ ఫైర్
Stress | స్మోకింగ్, డ్రింకింగే కాదు.. దీన్ని కూడా వదిలించుకోవాలి.. వైద్యుల సూచన..
సంబంధిత వార్తలు

Bogatha Waterfall | పాలసంద్రంలా ఉప్పొంగుతున్న బొగత జలపాతం.. పర్యాటకులకు కనువిందు
జులై 21, 2026

Saptha Gundala Waterfalls | జాలువారుతున్న సప్తగుండాల జలపాతం.. ప్రకృతి ప్రేమికుల గుండెల్లో జలసవ్వడి
జులై 21, 2026

Reverse Waterfall | రివర్స్ వాటర్‌ఫాల్.. ఆ అద్భుత దృశ్యం చూస్తే పులకించిపోవాల్సిందే..
జులై 10, 2026
తాజావార్తలు
- ●Beware of Frauds| మేం అడిగినంత ఇవ్వండి..మీకు ఇందిరమ్మ ఇల్లు గ్యారంటీ
- ●Telugu OTT | ఓటీటీలోకి షాకింగ్ ట్విస్ట్‌లతో సాగే తెలుగు లవ్‌స్టోరీ - చెప్పిన డేట్ కంటే ఓ రోజు ముందే స్ట్రీమింగ్
- ●Hyderabad | ఇన్‌స్టాలో మైనర్ బాలికలే టార్గెట్.. ప్రేమ పేరుతో ఐదుగురు యువతులతో వ్యవహారం..
- ●Chiranjeevi | మరోసారి మంచి మనసు చాటుకున్న మెగాస్టార్ - గబ్బర్‌సింగ్ నటుడికి ఆర్థిక సాయం
- ●Smart Ration Cards | వచ్చే నెలలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ..!
- ●Rashmika Mandanna | కామన్వెల్త్ గేమ్స్ ముగింపు వేడుకల్లో రష్మిక మందన్న - తొలి తెలుగు హీరోయిన్గా అరుదైన ఘనత

Beware of Frauds| మేం అడిగినంత ఇవ్వండి..మీకు ఇందిరమ్మ ఇల్లు గ్యారంటీ

Telugu OTT | ఓటీటీలోకి షాకింగ్ ట్విస్ట్‌లతో సాగే తెలుగు లవ్‌స్టోరీ - చెప్పిన డేట్ కంటే ఓ రోజు ముందే స్ట్రీమింగ్

Hyderabad | ఇన్‌స్టాలో మైనర్ బాలికలే టార్గెట్.. ప్రేమ పేరుతో ఐదుగురు యువతులతో వ్యవహారం..

Chiranjeevi | మరోసారి మంచి మనసు చాటుకున్న మెగాస్టార్ - గబ్బర్‌సింగ్ నటుడికి ఆర్థిక సాయం



