HPV vaccination | దేశవ్యాప్తంగా హెచ్‌పీవీ టీకా కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ
HPV vaccination | దేశ వ్యాప్తంగా 14 ఏండ్లు దాటిన బాలికలకు ఉచితంగా హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ను (HPV Vaccine) అందించే కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. రాజస్థాన్ అజ్మేర్ (Ajmer)లో ఈ టీకా పంపిణీ కార్యక్రమాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ప్రారంభించారు.
HPV vaccination | మహిళల్లో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ (cervical cancer)ను నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా దేశ వ్యాప్తంగా 14 ఏండ్లు దాటిన బాలికలకు ఉచితంగా హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ను (HPV Vaccine) అందించే కార్యక్రమాన్ని ఇవాళ ప్రారంభించింది. రాజస్థాన్ అజ్మేర్ (Ajmer)లో ఈ టీకా పంపిణీ కార్యక్రమాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ప్రారంభించారు. ఇవాళ ఉదయం 11:30 గంటలకు లాంఛ్ చేశారు.
ఇక ఈ కార్యక్రమంలో భాగంగా 14 సంవత్సరాల బాలికలకు గార్డాసిస్ అనే టీకాను ఉచితంగా ఇవ్వనున్నారు. ఈ వ్యాక్సిన్ నాలుగు రకాల గర్భాశయ క్యాన్సర్‌లను నిరోధిస్తుంది. ఈ క్యాన్సర్‌కు కారణమయ్యే హెచ్‌పీవీ టైప్ 16, 18 తోపాటు టైప్ 6, 11 రకాల నుంచి ఇది రక్షణ కల్పిస్తుందని ఆరోగ్యశాఖ వర్గాలు వెల్లడించాయి. ఒక డోసుతో బాలికలకు సంబంధిత వైరస్‌ల నుంచి దీర్ఘకాల రక్షణ లభిస్తుందని పలు పరిశోధనల్లో తేలింది. అందుకే తల్లిదండ్రులు తప్పనిసరిగా తమ కుమార్తెలకు ఈ వ్యాక్సిన్‌ను ఇప్పించాలని కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులు సూచిస్తున్నారు.
https://x.com/ANI/status/2027629630476406788
ప్రతి 8 నిమిషాలకు ఓ మహిళ బలి
మన దేశంలోని మహిళల్లో అత్యధికంగా కనిపించే క్యాన్సర్ల (Cancers)లో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ (Cervical Cancer) రెండో స్థానంలో ఉంది. దేశంలో ఏటా దాదాపు 80,000 కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఈ క్యాన్సర్ కారణంగా ఏటా దాదాపు 42 వేల కంటే ఎక్కువ మంది మహిళలు మరణిస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. అంటే దాదాపు ప్రతి ఎనిమిది నిమిషాలకు ఓ మహిళ చనిపోతోంది. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు ఈ క్యాన్సర్ ఎంత ప్రమాదకరమో. అందుకే వ్యాక్సిన్, ముందస్తు పరీక్షలతోనే ఈ క్యాన్సర్‌ను నివారించొచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంటోంది. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం ఈ క్యాన్సర్‌ని అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఉచితంగా వ్యాక్సిన్ ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
15ఏళ్ల లోపు బాలికల కోసం గార్డాసిల్-4 టీకా ప్రస్తుతం మార్కెట్‌లో అందుబాటులో ఉంది. ఈ టీకా రెండు డోసుల్లో తీసుకోవాల్సి ఉంటుంది. దీని ఒక్కో డోసు ధర రూ.3,927గా ఉంది. అదే 15 ఏళ్లు పైబడిన బాలికలు మాత్రం మూడు డోసుల్లో ఈ టీకాను తీసుకోవాల్సి ఉంటుంది. ఈ వ్యాక్సిన్ 2006లో అందుబాటులోకి వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకూ 50 కోట్ల డోసులను పంపిణీ చేశారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 160 దేశాల్లో ఇప్పటికే ఈ టీకా పంపిణీ కార్యక్రమం అమల్లో ఉంది. వీటిలో 90 దేశాలు సింగిల్ డోసులో అందిస్తున్నాయి. ఈ టీకా వల్ల అనేక దేశాల్లో సర్వైకల్ క్యాన్సర్లు గణనీయంగా తగ్గినట్లు నివేదికలు సూచిస్తున్నాయి. అందుకే తల్లిదండ్రులు తప్పనిసరిగా తమ కుమార్తెలకు ఈ వ్యాక్సిన్‌ను ఇప్పించాలని కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులు సూచిస్తున్నారు.
Also Read..
Virosh Wedding | పెళ్లి ఫొటోలతో చరిత్ర సృష్టించిన విరోష్ జోడీ.. కోహ్లీ రికార్డు కూడా బద్దలే
E20 Petrol India | ఏప్రిల్ 1 నుంచి ఇథనాల్ పెట్రోల్.. పాత కార్ల ఓనర్లకు షాక్..!
తాజావార్తలు
- ●Beware of Frauds| మేం అడిగినంత ఇవ్వండి..మీకు ఇందిరమ్మ ఇల్లు గ్యారంటీ
- ●Telugu OTT | ఓటీటీలోకి షాకింగ్ ట్విస్ట్‌లతో సాగే తెలుగు లవ్‌స్టోరీ - చెప్పిన డేట్ కంటే ఓ రోజు ముందే స్ట్రీమింగ్
- ●Hyderabad | ఇన్‌స్టాలో మైనర్ బాలికలే టార్గెట్.. ప్రేమ పేరుతో ఐదుగురు యువతులతో వ్యవహారం..
- ●Chiranjeevi | మరోసారి మంచి మనసు చాటుకున్న మెగాస్టార్ - గబ్బర్‌సింగ్ నటుడికి ఆర్థిక సాయం
- ●Smart Ration Cards | వచ్చే నెలలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ..!
- ●Rashmika Mandanna | కామన్వెల్త్ గేమ్స్ ముగింపు వేడుకల్లో రష్మిక మందన్న - తొలి తెలుగు హీరోయిన్గా అరుదైన ఘనత

Beware of Frauds| మేం అడిగినంత ఇవ్వండి..మీకు ఇందిరమ్మ ఇల్లు గ్యారంటీ

Telugu OTT | ఓటీటీలోకి షాకింగ్ ట్విస్ట్‌లతో సాగే తెలుగు లవ్‌స్టోరీ - చెప్పిన డేట్ కంటే ఓ రోజు ముందే స్ట్రీమింగ్

Hyderabad | ఇన్‌స్టాలో మైనర్ బాలికలే టార్గెట్.. ప్రేమ పేరుతో ఐదుగురు యువతులతో వ్యవహారం..

Chiranjeevi | మరోసారి మంచి మనసు చాటుకున్న మెగాస్టార్ - గబ్బర్‌సింగ్ నటుడికి ఆర్థిక సాయం






