HPV Vaccine | గర్భాశయ క్యాన్సర్ టీకాలకు మరో 3 నెలల గడువు
HPV Vaccine | మహిళల్లో సర్వసాధారణంగా వచ్చే గర్భాశయ క్యాన్సర్‌ను నివారించేందుకు కేంద్రం చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో హెచ్‌పీవీ టీకాలను కేంద్రం ఉచితంగా అందజేసింది.
HPV Vaccine | త్రినేత్ర.న్యూస్ : మహిళల్లో సర్వసాధారణంగా వచ్చే గర్భాశయ క్యాన్సర్‌ను నివారించేందుకు కేంద్రం చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో హెచ్‌పీవీ టీకాలను కేంద్రం ఉచితంగా అందజేసింది. ఈ కార్యక్రమం ప్రారంభమై మూడు నెలలు అవుతున్నప్పటికీ.. అనుకున్న లక్ష్యంలో సగం కూడా పూర్తి కాలేదు. దీంతో గర్భాశయ క్యాన్సర్ టీకాలకు మరో 3 నెలల గడువు పొడిగిస్తూ.. కేంద్రం రాష్ట్రాలకు సమాచారం అందించింది.
అయితే ఈ టీకాను 14 నుంచి 15 ఏళ్ల మధ్య ఉన్న అమ్మాయిలకు ఇవ్వాలని కేంద్రం ప్రతిపాదించింది. రాష్ట్రంలో ఈ వయసు మధ్య 3,51,343 మంది ఉండగా, అందుకు తగ్గట్టు వ్యాక్సిన్ పూర్తి చేయాలని లక్ష్యం నిర్దేశించుకున్నారు. కానీ ఇప్పటి వరకు కేవలం 77,272 మంది మాత్రమే ఈ టీకా తీసుకున్నారు.
తాజాగా మరో నెలల గడువు పొడిగించడంతో ఆగస్టు నెలాఖరు వరకు ఈ కార్యక్రమం కొనసాగనుంది. ఇప్పటి వరకు 14-15 ఏళ్ల లోపు బాలికలకు టీకాలను ఉచితంగా వేస్తున్నారు. వచ్చే మూడు నెలల్లో.. 15 సంవత్సరాల 90 రోజులు పూర్తయినా వేస్తారు. టీకాలను ప్రభుత్వ జనరల్ ఆసుపత్రులు(బోధనాసుపత్రులు), జిల్లా, ఏరియా ఆసుపత్రులు, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, 24 గంటల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఇస్తున్నారు.
తాజావార్తలు
- ●Beware of Frauds| మేం అడిగినంత ఇవ్వండి..మీకు ఇందిరమ్మ ఇల్లు గ్యారంటీ
- ●Telugu OTT | ఓటీటీలోకి షాకింగ్ ట్విస్ట్‌లతో సాగే తెలుగు లవ్‌స్టోరీ - చెప్పిన డేట్ కంటే ఓ రోజు ముందే స్ట్రీమింగ్
- ●Hyderabad | ఇన్‌స్టాలో మైనర్ బాలికలే టార్గెట్.. ప్రేమ పేరుతో ఐదుగురు యువతులతో వ్యవహారం..
- ●Chiranjeevi | మరోసారి మంచి మనసు చాటుకున్న మెగాస్టార్ - గబ్బర్‌సింగ్ నటుడికి ఆర్థిక సాయం
- ●Smart Ration Cards | వచ్చే నెలలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ..!
- ●Rashmika Mandanna | కామన్వెల్త్ గేమ్స్ ముగింపు వేడుకల్లో రష్మిక మందన్న - తొలి తెలుగు హీరోయిన్గా అరుదైన ఘనత

Beware of Frauds| మేం అడిగినంత ఇవ్వండి..మీకు ఇందిరమ్మ ఇల్లు గ్యారంటీ

Telugu OTT | ఓటీటీలోకి షాకింగ్ ట్విస్ట్‌లతో సాగే తెలుగు లవ్‌స్టోరీ - చెప్పిన డేట్ కంటే ఓ రోజు ముందే స్ట్రీమింగ్

Hyderabad | ఇన్‌స్టాలో మైనర్ బాలికలే టార్గెట్.. ప్రేమ పేరుతో ఐదుగురు యువతులతో వ్యవహారం..

Chiranjeevi | మరోసారి మంచి మనసు చాటుకున్న మెగాస్టార్ - గబ్బర్‌సింగ్ నటుడికి ఆర్థిక సాయం





