Nepal-India | నేపాల్‌కు రూ. 15,000 కోట్ల భారీ అభివృద్ధి ప్యాకేజీ ప్రకటించిన ప్రధాని మోదీ
Nepal-India | నేపాల్ ప్రధాని (Nepal PM) బాలేంద్ర షా (Balendra Shah) భారత్ పర్యటన సందర్భంగా హిమాలయ దేశ అభివృద్ధి కోసం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) 24,000 కోట్ల నేపాలీ రూపాయల ప్యాకేజీని ప్రకటించారు. ఈ సందర్భంగా శ్రీరాముడి జన్మస్థలమైన అయోధ్యను, సీతాదేవి జన్మస్థలమైన జనక్‌పుర్ ధామ్‌ను కలుపుతూ కొత్త వీక్లీ రైలు 'సరయూ-కమలా ఎక్స్‌ప్రెస్'ను ఇరువురు నేతలు ప్రారంభించారు.
- నేపాల్ లేకుండా మన రాముడు అసంపూర్ణం
- అయోధ్య-జనక్‌పూర్ రైలు ప్రారంభం
- హిమాలయాలంత దృఢంగా ఇరుదేశాల మధ్య సంబంధాలు : బాలేంద్ర షా
Nepal-India | త్రినేత్ర న్యూస్ : నేపాల్ ప్రధాని (Nepal PM) బాలేంద్ర షా (Balendra Shah)తో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హిమాలయ దేశమైన (Himalayan nation) నేపాల్ అభివృద్ధి కోసం 24,000 కోట్ల నేపాలీ రూపాయల (భారత కరెన్సీలో రూ.15 వేల కోట్లు) ప్యాకేజీని (Rs 15,000 Crore Package) ప్రధాని ప్రకటించారు. ద్వైపాక్షిక చర్చల అనంతరం జరిగిన సంయుక్త మీడియా సమావేశంలో ప్రధాని మోదీ ఈ మేరకు ప్రకటించారు. నేపాల్ అభివృద్ధికి భారత్ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా శ్రీరాముడి జన్మస్థలమైన అయోధ్యను, సీతాదేవి జన్మస్థలమైన జనక్‌పుర్ ధామ్‌ను కలుపుతూ కొత్త వీక్లీ రైలు 'సరయూ-కమలా ఎక్స్‌ప్రెస్'ను ఇరువురు నేతలు ప్రారంభించారు.
VIDEO | UP: Saryu-Kamala Express departs from Ayodhya railway station after PM Modi and Nepal PM virtually flag off the train.
The train has a 17-coach Linke-Hofmann-Busch (LHB) rake with a total passenger capacity of 1,158, including eight air-conditioned coaches, seven sleeper coaches, a seating coach and a power car.
— Press Trust of India (@PTI_News) November 23, 2026
ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. భారత్, నేపాల్ (Nepal-India) సంబంధాలు ఉమ్మడి చరిత్ర, విశ్వాసం, సంస్కృతి, ప్రజల మధ్య ఉన్న లోతైన అనుబంధంతో ముడిపడి ఉన్నాయని పేర్కొన్నారు. శ్రీరాముడు, సీతాదేవి ఇరు దేశాల ఉమ్మడి నాగరికతకు ప్రతీకలని చెప్పారు. 2018లో తాను జనక్‌పూర్‌లో పర్యటించినప్పుడు చేసిన వ్యాఖ్యలను గుర్తుచేసుకుంటూ "నేపాల్ లేకుండా మన ధామ్‌లు, మన రాముడు అసంపూర్ణం" అని మోదీ పునరుద్ఘాటించారు. "భారత్, నేపాల్ కేవలం పొరుగు దేశాలు మాత్రమే కాదు. లోతైన నమ్మకం, స్నేహబంధంతో పెనవేసుకున్న దేశాలు. మా ఆకాంక్షలు, సవాళ్లు ఒకే విధంగా ఉంటాయి. కష్టకాలంలో ఒకరికొకరు అండగా నిలుస్తాము. నేపాల్‌లో ఇటీవలే సంభవించిన వరదల వల్ల ప్రాణాలు కోల్పోయిన వారికి మా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాము. నేపాల్ పునర్నిర్మాణం, అభివృద్ధికి మద్దతుగా 24,000 కోట్ల నేపాలీ రూపాయల విలువైన అభివృద్ధి సహకార ప్యాకేజీని ప్రకటిస్తున్నాము" అని మోదీ తెలిపారు.
కొన్ని నెలల క్రితం ప్రపంచంలోనే అత్యంత పిన్న వయస్కుడైన ప్రధానిగా ఐక్యరాజ్యసమితిలో ప్రసంగించినప్పుడే ఆయన దార్శనికత, ముందుచూపు స్పష్టంగా కనిపించిందని మోదీ కొనియాడారు. భారత్-నేపాల్ సంబంధాల పట్ల ఆయనకున్న నిబద్ధతను తాను స్వయంగా గమనించినట్లు చెప్పారు. ఈ ఏడాది నేపాల్ ప్రజలు ఆయనకు అందించిన చారిత్రాత్మక తీర్పు ఆ దేశ కొత్త తరం ఆశలు, ఆకాంక్షలకు అద్దం పడుతోందని పేర్కొన్నారు. ఎన్నో ఏళ్లుగా నేపాల్‌కు భారత్ ఓ నమ్మకమైన సరఫరాదారుగా ఉందని ప్రధాని గుర్తు చేశారు. ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరాలో తీవ్ర సవాళ్లు ఎదురైనప్పటికీ.. 'నైబర్‌హుడ్ ఫస్ట్' (పొరుగు దేశాలకు తొలి ప్రాధాన్యం) విధానం కింద నేపాల్‌కు ఇంధనం, ఎరువులు, ఇతర నిత్యావసర వస్తువుల సరఫరాకు కొనసాగించినట్లు చెప్పారు.
హిమాలయాలంత దృఢంగా..
అనంతరం నేపాల్ ప్రధాని బాలేంద్ర షా మాట్లాడుతూ.. తన రెండు రోజుల అధికారిక పర్యటనలో భారత్ అందించిన ఆత్మీయ ఆతిథ్యాన్ని కొనియాడారు. నేపాల్‌లో పర్యటించాల్సిందిగా ప్రధాని మోదీని ఆయన ఆహ్వానించారు. భారత్-నేపాల్ మధ్య ఉన్న లోతైన అనుబంధాన్ని ప్రస్తావిస్తూ.. ఇరు దేశాల మధ్య ఉన్న హృదయపూర్వక సంబంధాలను మాటల్లో వర్ణించలేమన్నారు. విపత్తు సమయాల్లో, కష్టకాలంలో భారత్ అందించిన సహాయానికి కృతజ్ఞతలు తెలిపారు.
"నేపాల్, భారత్ మధ్య సంబంధాలు హిమాలయాలంత దృఢంగా, సముద్రమంత విశాలంగా ఉన్నాయి. మా సాన్నిహిత్యం ఎంత లోతైనదంటే కేవలం మాటల్లో వర్ణించలేం. నమ్మకమైన పొరుగు దేశంగా, ప్రకృతి వైపరీత్యాలు, కష్ట సమయాల్లో భారత్ ఎల్లప్పుడూ ముందుండి ఆదుకుంటోంది. ఇందుకు భారత ప్రభుత్వానికి, ప్రజలకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను" అని బాలేంద్ర షా పేర్కొన్నారు.
ఇరు దేశాల మధ్య ఎనిమిది అవగాహన ఒప్పందాలు
ఈ పర్యటన సందర్భంగా భారత్, నేపాల్ మధ్య ఎనిమిది అవగాహన ఒప్పందాలు (MoUs) కుదిరాయి. వీటిలో సివిల్ సర్వీస్ సామర్థ్య శిక్షణ, అంతరిక్ష పరిశోధన, ఆరోగ్యం, వైద్యం, పట్టణాభివృద్ధి, ఆయుర్వేదం, సంప్రదాయ వైద్య రంగాలు ఉన్నాయి. అలాగే ఇరు దేశాల నేతలు కీలకమైన కనెక్టివిటీ, ఇంధన ప్రాజెక్టులను సంయుక్తంగా ప్రారంభించడంతో పాటు, భారత్-నేపాల్ సహకారాన్ని మరింత బలోపేతం చేసే పలు కొత్త ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు.
Also Read..
ఆసియాలో మూడో అత్యంత శక్తివంతమైన దేశంగా భారత్.. 2026 ఆసియా పవర్ ఇండెక్స్‌లో 40.5 పాయింట్లతో సత్తా
డిసెంబర్ 10న నల్లగొండలో లక్షలాది మంది రైతులతో బీఆర్ఎస్ బహిరంగ సభ
ఐదురోజుల నష్టాలకు బ్రేక్.. మళ్లీ పుంజుకున్న పసిడి, వెండి..!
సంబంధిత వార్తలు

Asia Power Index | ఆసియాలో మూడో అత్యంత శక్తివంతమైన దేశంగా భారత్.. 2026 ఆసియా పవర్ ఇండెక్స్‌లో 40.5 పాయింట్లతో సత్తా
నవంబర్ 23, 2026

Balen Shah India Visit | సరిహద్దు వివాదం తర్వాత తొలిసారి ఢిల్లీకి నేపాల్ ప్రధాని
నవంబర్ 22, 2026

Vladimir Putin on India | “అది నిజంగా అద్భుతం!”.. భారత వైవిధ్యంపై పుతిన్ ప్రశంసల జల్లు
నవంబర్ 22, 2026
తాజావార్తలు
- ●BRS Party | డిసెంబర్ 10న నల్లగొండలో లక్షలాది మంది రైతులతో బీఆర్ఎస్ బహిరంగ సభ
- ●Tummala Nageshwar Rao | కాంగ్రెస్‌ను మళ్లీ అధికారంలోకి తీసుకువస్తాం
- ●Trisha | త్రిష పేరుతో తమిళనాడులో కొత్త అసోసియేషన్ - రాజకీయ అరంగేట్రానికి సన్నాహాలు షురూ?
- ●Mahesh Kumar Goud | 26న సంవిధాన్ రక్షక్ ర్యాలీ చేపట్టబోతున్నం
- ●Adi Srinivas | 500 కాదు.. 5000 రోజులైనా కేసీఆర్ సీఎం కాలేరు
- ●Vishnu Manchu | బర్త్‌డే సర్ప్రైజ్ - కొత్త సినిమాను అనౌన్స్‌చేసిన మంచు విష్ణు - డైరెక్టర్‌గా పాపులర్ కొరియోగ్రాఫర్

BRS Party | డిసెంబర్ 10న నల్లగొండలో లక్షలాది మంది రైతులతో బీఆర్ఎస్ బహిరంగ సభ

Tummala Nageshwar Rao | కాంగ్రెస్‌ను మళ్లీ అధికారంలోకి తీసుకువస్తాం

Trisha | త్రిష పేరుతో తమిళనాడులో కొత్త అసోసియేషన్ - రాజకీయ అరంగేట్రానికి సన్నాహాలు షురూ?

Mahesh Kumar Goud | 26న సంవిధాన్ రక్షక్ ర్యాలీ చేపట్టబోతున్నం



