Congress | కాంగ్రెస్‌కు కొత్త సమస్య.. అసెంబ్లీలో మాజీ సీఎంకు సీటు ఎక్కడ?
Congress | కర్ణాటకలో (Karnataka) సీఎం డీకే శివకుమార్ నేతృత్వంలోని కాంగ్రెస్ (Congress) సర్కార్ ఇప్పుడిప్పుడే కుదురుకుంటున్నది. రెండు నెలల క్రితమే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆయన కేబినెట్‌లో పలువురు కొత్తవారు మంత్రులుగా ఉన్నారు.
Congress | త్రినేత్ర.న్యూస్: కర్ణాటకలో (Karnataka) సీఎం డీకే శివకుమార్ నేతృత్వంలోని కాంగ్రెస్ (Congress) సర్కార్ ఇప్పుడిప్పుడే కుదురుకుంటున్నది. రెండు నెలల క్రితమే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆయన కేబినెట్‌లో పలువురు కొత్తవారు మంత్రులుగా ఉన్నారు. ఇప్పటికీ తమ మంత్రిత్వశాఖలపై వారు పట్టుసాధించకలేపోయారు. ఈక్రమంలో వచ్చే నెల 13 నుంచి అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు (Assembly Session) ప్రారంభం కానున్నాయి. దీంతో రాష్ట్రంలో బలంగా ఉన్న విపక్ష బీజేపీ-జేడీఎస్ కూటమిని సభలో ఎలా ఎందుర్కొంటారనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. తాజాగా అధికార పార్టీని మరో సమస్య కూడా వేధిస్తున్నది. మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు (Siddaramaiah) అసెంబ్లీలో ఎక్కడ స్థానం కేటాయిస్తారు? అని.
ఇన్నాళ్లు ముందు వరుసలో కూర్చుని ప్రతిపక్షాలను ముప్పుతిప్పలు పెట్టిన ఆయన ఏ సీట్లో కూర్చుంటారని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సందేహం వ్యక్తంచేస్తున్నారు. గంతంలోలానే ముందు వరుసలోనా? లేదా మంత్రుల వెనుక వరుసలోనా? అని చర్చించుకుంటున్నారు. మరో మాజీ సీఎం యడ్యూరప్పలా (BS Yediyurappa) చివరి వరుసకే పరిమితమవుతారా? అని చర్చోపచర్చలు నడుస్తున్నాయి. అయితే ఆయన ధర్పాన్ని ప్రదర్శించే అవకాశం లేదని, సౌకర్యానికే ప్రాధాన్యం ఇస్తారని మాజీ ముఖ్యమంత్రి సన్నిహితులు అంటున్నారు. కాగా, ఏ వరుసలో కూర్చున్నప్పటికీ సాకర్ స్టార్ మెస్సీలా అసెంబ్లీలో ప్రభుత్వం, పార్టీ ఇరుకున పడకుండా సిద్దరామయ్య కూడా కాపడతారని, విపక్షాల దాడులను సమర్ధంగా ఎదుర్కొంటారని వ్యాఖ్యానిస్తున్నారు.
ఇకపై ఎన్నికల్లోనూ పోటీ చేయను..
పార్టీ అధిష్ఠానం ఆదేశం మేరకు కొన్ని నెలల క్రితం కర్ణాటక సీఎం పదవి నుంచి స్వచ్ఛందంగా వైదొలిగిన సిద్ధరామయ్య.. తాను 2028 అసెంబ్లీ ఎన్నికల (2028 Karnataka Assembly Polls)తో పాటు ఇకపై ఏ ఇతర ఎన్నికల్లోనూ పోటీ చేయబోనని ఈ నెల 26న ప్రకటించిన విషయం తెలిసిందే. వయసు పైబడటం, అనారోగ్య కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ప్రస్తుతం తనకు 79ఏండ్లని.. తన పదవీకాలం ఇంకా ఏడాదిన్నర పాటు ఉందని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల నాటికి తన వయసు 81-82 ఏళ్లకు చేరుకుంటుందన్నారు. ఆరోగ్యం బాగాలేకపోవడం వల్ల మునుపటిలా అదే ఉత్సాహంతో పనిచేయడం ఇక సాధ్యం కాదని వెల్లడించారు. 2028 నాటికి తన రాజకీయ ప్రస్థానం 50ఏళ్లకు చేరుకుంటుందని సిద్ధరామయ్య తెలిపారు.
తాజావార్తలు
- ●Vakiti Srihari | ఆసియా క్రీడల్లో తరుణ్ పతకం తేవడం గర్వకారణం: మంత్రి వాకిటి
- ●Asian Games | ఆసియా గేమ్స్‌లో భారత షట్లర్లకు చుక్కెదురు..
- ●Cockroach Janta Party | అస్సాంలో తీవ్ర ఉద్రిక్తత: మీటింగ్‌కు ముందే సీజేపీ నేతల అరెస్ట్.. సీఎం హిమంతపై తీవ్ర ఆరోపణలు
- ●Ramayana | డివైన్ లుక్‌లో సాయిపల్లవి - రామాయణ పోస్టర్ రిలీజ్ - విమర్శలకు చెక్ పెట్టిన నాచురల్ బ్యూటీ
- ●Minister Seethakka | విద్యకు వయసుతో సంబంధం లేదు : మంత్రి సీతక్క
- ●Komati Reddy Rajagopal Reddy | నాకు మంత్రి పదవి ఇవ్వడం రేవంత్ చేతిలో లేదు

Vakiti Srihari | ఆసియా క్రీడల్లో తరుణ్ పతకం తేవడం గర్వకారణం: మంత్రి వాకిటి

Asian Games | ఆసియా గేమ్స్‌లో భారత షట్లర్లకు చుక్కెదురు..

Cockroach Janta Party | అస్సాంలో తీవ్ర ఉద్రిక్తత: మీటింగ్‌కు ముందే సీజేపీ నేతల అరెస్ట్.. సీఎం హిమంతపై తీవ్ర ఆరోపణలు

Ramayana | డివైన్ లుక్‌లో సాయిపల్లవి - రామాయణ పోస్టర్ రిలీజ్ - విమర్శలకు చెక్ పెట్టిన నాచురల్ బ్యూటీ






