Wedding Season | 25 రోజుల్లో 52 లక్షల పెళ్లిళ్లు.. రూ.7.5 లక్షల కోట్ల వ్యాపారంతో ఆర్థిక వ్యవస్థకు సరికొత్త జోష్
Wedding Season | నవంబర్ 21 నుంచి డిసెంబర్ 15 మధ్య కేవలం 25 రోజుల వ్యవధిలోనే దేశవ్యాప్తంగా సుమారు 52 లక్షల వివాహాలు జరగనున్నాయని అఖిల భారత వర్తకుల సమాఖ్య (CAIT) అంచనా వేసింది. తద్వారా ఏకంగా రూ.7.5 లక్షల కోట్ల మేర వ్యాపారం జరిగే అవకాశం ఉందని పేర్కొంది.
Wedding Season | త్రినేత్ర న్యూస్ : దేశంలో మరో రెండు రోజుల్లో గ్రాండ్ వెడ్డింగ్ సీజన్ (Wedding Season | ) ప్రారంభం కాబోతోంది. ఈ పెళ్లిళ్ల సీజన్ దేశ ఆర్థిక వ్యవస్థకు సరికొత్త జోష్‌ను నింపనుంది. నవంబర్ 21 నుంచి డిసెంబర్ 15 మధ్య కేవలం 25 రోజుల వ్యవధిలోనే దేశవ్యాప్తంగా సుమారు 52 లక్షల వివాహాలు జరగనున్నాయని అఖిల భారత వర్తకుల సమాఖ్య (CAIT) అంచనా వేసింది. తద్వారా ఏకంగా రూ.7.5 లక్షల కోట్ల మేర వ్యాపారం జరిగే అవకాశం ఉందని పేర్కొంది.
సీజన్ రిటైల్, తయారీ, ఆతిథ్యం, రవాణా, ఫుడ్ ప్రాసెసింగ్, ఈవెంట్ మేనేజ్‌మెంట్ వంటి పలు రంగాల వ్యాపారాలకు ఈ పెళ్లిళ్ల సీజన్ అతిపెద్ద చోదక శక్తిగా మారనుందని వ్యాపారుల సమాఖ్య వెల్లడించింది. ఈ మేరకు అధికారిక అంచనాలను విడుదల చేసింది. CAIT పరిశోధన విభాగం 'కైట్ రీసెర్చ్ అండ్ ట్రేడ్ డెవలప్‌మెంట్ సొసైటీ' దేశంలోని 25 రాష్ట్రాల్లో 300 మందికి పైగా వ్యాపార ప్రముఖులు, 550 వాణిజ్య సంస్థలతో సర్వే జరిపి ఈ అంచనాలను రూపొందించింది. ఆ అంచనాల ప్రకారం.. మొత్తం రూ. 7.50 లక్షల కోట్ల వ్యాపారంలో ప్రధానంగా రెండు విభాగాలు కీలక పాత్ర పోషించనున్నాయి. అంచనా వేసిన మొత్తం వ్యాపారంలో వస్తువులు, రిటైల్ కొనుగోళ్ల వాటా రూ. 4.05 లక్షల కోట్లు (54 శాతం) కాగా, సేవల రంగం వాటా రూ. 3.45 లక్షల కోట్లు (46 శాతం) ఉంటుందని నివేదిక తెలిపింది.
బంగారం కొనుగోళ్లకే రూ.1.20 లక్షల కోట్లు
వస్తువుల విభాగంలో బంగారం, ఆభరణాల కొనుగోళ్లు రూ.1.20 లక్షల కోట్లతో అగ్రస్థానంలో ఉండగా.. ఆ తర్వాత దుస్తులు, చీరలు, ఇతర వస్త్రాల విక్రయాల వాటా రూ.90,000 కోట్లుగా ఉంటుందని అంచనా వేసింది. ఇక సేవల రంగంలో క్యాటరింగ్ ద్వారా రూ.75,000 కోట్లు, ఫంక్షన్ హాల్స్, హోటల్స్ ద్వారా రూ.60,000 కోట్ల వ్యాపారం జరిగే అవకాశం ఉందని తెలిపింది. ఒక్క ఢిల్లీ-ఎన్సీఆర్ (Delhi-NCR) ప్రాంతంలోనే దాదాపు ఐదు లక్షల వివాహాలు జరిగే అవకాశం ఉందని సదరు నివేదిక తెలిపింది. దీని ద్వారా సుమారు రూ. 2.5 లక్షల కోట్ల వ్యాపారం జరిగే అవకాశం ఉందని వెల్లడించింది.
1.25 కోట్ల తాత్కాలిక, సీజనల్ ఉపాధి అవకాశాలు
ఈ పెళ్లిళ్ల సీజన్ దేశీయ వినియోగానికి భారీ ఊతమివ్వడంతో పాటు.. సుమారు 1.25 కోట్ల తాత్కాలిక, సీజనల్ ఉపాధి అవకాశాలను కల్పిస్తుందని CAIT తెలిపింది. ఈ 25 రోజుల సీజన్‌లో క్యాటరింగ్, డెకరేషన్, ఫోటోగ్రఫీ, రవాణా, ఈవెంట్ మేనేజ్‌మెంట్ తదితర రంగాల్లో తాత్కాలిక, సీజనల్, పార్ట్‌టైమ్ ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనా వేసింది. పెళ్లిళ్ల సీజన్ కేవలం సామాజిక, సాంస్కృతిక వేడుక మాత్రమే కాదని, లక్షలాది మంది వినియోగదారులు, వ్యాపారులు, ఎంఎస్ఎంఈలు (MSMEs), హస్తకళాకారులను ఏకం చేసే ఒక శక్తివంతమైన ఆర్థిక వేదిక అని కైట్ సెక్రటరీ జనరల్ ప్రవీణ్ ఖండేల్వాల్ అభిప్రాయపడ్డారు. పెళ్లి కుటుంబాలు స్వదేశీ ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇస్తే.. ఈ సీజన్ స్థానిక తయారీదారులు, వ్యాపారులు, కళాకారులకు మరింత అండగా నిలుస్తుందని వ్యాపార సంఘం సూచించింది.
గత ఐదేళ్లలో 100% వృద్ధి
భారత వివాహ ఆర్థిక వ్యవస్థ గత ఐదేళ్లలో (2022–2026) 100% వృద్ధిని నమోదు చేసి రెట్టింపు స్థాయికి చేరుకుంది. పలు నివేదికల ప్రకారం.. భారతీయ వివాహ ఆర్థిక వ్యవస్థ 2022లో రూ.3.75 లక్షల కోట్లుగా ఉండగా, 2023లో రూ.4.74 లక్షల కోట్లు, 2024లో రూ.5.90 లక్షల కోట్లు, 2025లో రూ.6.50 లక్షల కోట్లకు చేరి.. ఈ ఏడాది అంటే 2026లో రికార్డు స్థాయిలో రూ.7.50 లక్షల కోట్లకు అంచనా వేయడం విశేషం.
Also Read..
NSA అజిత్ దోవల్‌కు అమెరికా కోర్టు సమన్లు
దలాల్ స్ట్రీట్‌లో భారీ జోష్.. 990 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్..
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Delhi Air Quality | దీపావళి ఎఫెక్ట్.. పటాకుల మోతతో కాలుష్య కోరల్లో ఢిల్లీ
నవంబర్ 9, 2026

Air Pollution | WFH నిబంధనలు పాటించలేదని.. రెండు సంస్థలకు నోటీసులు
నవంబర్ 7, 2026

Supreme Court | ఢిల్లీ వెదర్‌ను ఆస్వాదిస్తున్నారని అనుకుంటున్నా.. కాలుష్య సంక్షోభంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
నవంబర్ 6, 2026
తాజావార్తలు
- ●Nasha Mukt Bharat | హైదరాబాద్‌లో ‘నషా ముక్త్ భారత్’పై భారీ అవగాహన కార్యక్రమం
- ●HYDRAA | అహ్మదాబాద్ కంకారియా లేక్ తరహాలో అంబీర్ చెరువు..!
- ●Damodar Rajanarasimha | వైద్య రంగంలో తెలంగాణను గ్లోబల్ హబ్‌గా తీర్చిదిద్దుతం
- ●AC Bus | అయ్యప్ప భక్తులకు సర్కార్ గుడ్‌న్యూస్.. పంబకు ఏసీ బస్సులు..!
- ●Kishan Reddy | తెలంగాణలో ఇక బీజేపీ ఆట షురూ.. కిషన్‌రెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!
- ●Nagarguna Sagar | నాగార్జునసాగర్ బ్యాక్‌వాటర్‌లో నిర్మాణాలపై ఇంజినీర్ల బృందం ఆరా

Nasha Mukt Bharat | హైదరాబాద్‌లో ‘నషా ముక్త్ భారత్’పై భారీ అవగాహన కార్యక్రమం

HYDRAA | అహ్మదాబాద్ కంకారియా లేక్ తరహాలో అంబీర్ చెరువు..!

Damodar Rajanarasimha | వైద్య రంగంలో తెలంగాణను గ్లోబల్ హబ్‌గా తీర్చిదిద్దుతం

AC Bus | అయ్యప్ప భక్తులకు సర్కార్ గుడ్‌న్యూస్.. పంబకు ఏసీ బస్సులు..!



