త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Delhi Air Quality | దీపావళి ఎఫెక్ట్.. పటాకుల మోత‌తో కాలుష్య కోరల్లో ఢిల్లీ

Delhi Air Quality | దేశ‌రాజ‌ధాని ఢిల్లీ కాలుష్య కోర‌ల్లో చిక్కుకుంది. దీపావ‌ళి (Deepavali) పండుగ నేప‌థ్యంలో ఆదివారం రాత్రి ప్ర‌జ‌లు ప‌టాకులు కాల్చడంతో న‌గ‌ర‌మంతా పొగ క‌మ్మేసింది. రాత్రి కాలుష్యం పెర‌గ‌డంతో సోమ‌వారం ఉద‌యం గాలి నాణ్యత మరింత (Delhi Air Quality) దిగజారింది.

G

National | Published On Nov 9, 2026, 9.41 am IST

Delhi Air Quality | దీపావళి ఎఫెక్ట్.. పటాకుల మోత‌తో కాలుష్య కోరల్లో ఢిల్లీ
Advertisement

Delhi Air Quality | త్రినేత్ర న్యూస్‌: దేశ‌రాజ‌ధాని ఢిల్లీ కాలుష్య కోర‌ల్లో చిక్కుకుంది. దీపావ‌ళి (Deepavali) పండుగ నేప‌థ్యంలో ఆదివారం రాత్రి ప్ర‌జ‌లు ప‌టాకులు కాల్చడంతో న‌గ‌ర‌మంతా పొగ క‌మ్మేసింది. రాత్రి కాలుష్యం పెర‌గ‌డంతో సోమ‌వారం ఉద‌యం గాలి నాణ్యత మరింత (Delhi Air Quality) దిగజారింది. ఆదివారం రాత్రి 7 గంటలకు 371గా గాలి నాణ్యత సూచీ (ఏక్యూఐ).. ఉద‌యం 8.01 గంట‌ల స‌మ‌యానికి 483కు పెరిగింది. దీంతో గాలి నాణ్యత ‘తీవ్ర‌మైన‌’ కేటగిరీలోకి వెళ్లిపోయింది. న‌గరంలోని మొత్తం 59 కాలుష్య పర్యవేక్షణ కేంద్రాల్లో 19 చోట్ల ఏక్యూఐ ‘సీవియర్’ స్థాయికి చేరింది. మరో ఏడు కేంద్రాల్లో ‘పూర్’, మిగిలిన 33 కేంద్రాల్లో ‘వెరీ పూర్’ స్థాయిలో నమోదైంది.

దిల్లీ-ఎన్సీఆర్ (Delhi NCR) ప్రాంతంలో కాలుష్యాన్ని నియంత్రించేందుకు ప్రభుత్వం ఇప్పటికే చర్యలు చేపట్టింది. గాలి నాణ్యత మరింత దిగజారే అవకాశం ఉందన్న అంచనాలతో దీపావళికి రెండు రోజుల ముందే వాయు నాణ్యత నిర్వహణ కమిషన్ (CAQM) గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (GRAP)లో మూడో దశ ఆంక్షలను అమల్లోకి తెచ్చింది. అయినప్పటికీ దీపావళి రాత్రి టపాసుల వినియోగాన్ని పూర్తిగా నియంత్రించలేకపోయారు.

న‌వంబ‌ర్ 6 నుంచి ప్రభుత్వం ఢిల్లీ-ఎన్‌సీఆర్ పరిధిలో గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (గ్రాప్‌) మూడో దశను అమల్లోకి తెచ్చింది. ఏక్యూఐ 401-500 మధ్య నమోదైనప్పుడు ఈ దశను అమలు చేస్తారు. ఇందులో భాగంగా నిర్మాణ, కూల్చివేత పనులపై నిషేధం విధించారు. బీఎస్‌-3 పెట్రోల్, బీఎస్‌-4 డీజిల్ నాలుగు చక్రాల వాహనాల రాకపోకలపైనా ఆంక్షలు విధించారు. అయిన‌ప్ప‌టికీ కాలుష్యాన్ని మాత్రం నియంత్రించ‌లేక‌పోయారు.

Advertisement
Advertisement