త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

PG Electroplast | ఈ పెన్నీ స్టాక్ లో రూ.1 ల‌క్ష పెట్టి ఉంటే ఇప్పుడు రూ1.18 కోట్లు వ‌చ్చి ఉండేవి.. 7 ఏళ్ల‌లో 118 శాతం లాభం..

PG Electroplast | ఒకప్పుడు చిన్న కంపెనీగా ఉన్న పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ ఏడేళ్లలో అద్భుతమైన వృద్ధిని సాధించింది. 2019లో ఈ కంపెనీలో రూ.1 లక్ష పెట్టుబడి పెట్టిన వారి పెట్టుబడి నవంబర్ నాటికి సుమారు రూ.1.18 కోట్లకు చేరింది. తయారీ సామర్థ్యం విస్తరణ, కొత్త ఉత్పత్తులు, ఆదాయం, లాభాల్లో భారీ వృద్ధి ఈ కంపెనీని మల్టీబ్యాగర్ స్టాక్‌గా నిలిపాయి.

S

Business | Published On Nov 19, 2026, 5.12 pm IST

PG Electroplast | ఈ పెన్నీ స్టాక్ లో రూ.1 ల‌క్ష పెట్టి ఉంటే ఇప్పుడు రూ1.18 కోట్లు వ‌చ్చి ఉండేవి.. 7 ఏళ్ల‌లో 118 శాతం లాభం..
Advertisement

PG Electroplast | ఒకప్పుడు చిన్న కంపెనీగా ఉన్న పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ ఏడేళ్లలో అద్భుతమైన వృద్ధిని సాధించింది. 2019లో ఈ కంపెనీలో రూ.1 లక్ష పెట్టుబడి పెట్టిన వారి పెట్టుబడి నవంబర్ నాటికి సుమారు రూ.1.18 కోట్లకు చేరింది. తయారీ సామర్థ్యం విస్తరణ, కొత్త ఉత్పత్తులు, ఆదాయం, లాభాల్లో భారీ వృద్ధి ఈ కంపెనీని మల్టీబ్యాగర్ స్టాక్‌గా నిలిపాయి.

రూ.1 ల‌క్ష పెట్టుబ‌డికి రూ.1.18 కోట్ల రాబ‌డి..

స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడిదారులకు భారీ రాబడులు అందించిన కంపెనీల్లో పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ ఒకటిగా నిలిచింది. 2019లో ఈ కంపెనీ షేర్లలో రూ.1 లక్ష పెట్టుబడి పెట్టి ఉంటే, ఇప్ప‌టికి దాని విలువ సుమారు రూ.1.18 కోట్లకు చేరేది. అంటే దాదాపు 118 రెట్ల రాబడి లభించేది. ప్రస్తుతం కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.16వేల కోట్లకు పైగా ఉంది. 2003లో స్థాపించిన ఈ సంస్థ ఎలక్ట్రానిక్ తయారీ సేవల రంగంలో కార్యకలాపాలు ప్రారంభించింది. ఒరిజినల్ డిజైన్ మాన్యుఫ్యాక్చరింగ్, ఒరిజినల్ ఎక్విప్‌మెంట్ మాన్యుఫ్యాక్చరింగ్, ప్లాస్టిక్ ఇంజెక్షన్ మోల్డింగ్ సేవలను అందిస్తోంది. క్రమంగా ప్లాస్టిక్ విడిభాగాల తయారీ నుంచి రూమ్ ఏసీలు, వాషింగ్ మెషీన్లు, ఎయిర్ కూలర్ల వంటి పూర్తిస్థాయి వినియోగదారుల ఉత్పత్తుల తయారీలోకి విస్తరించింది. గ్రేటర్ నోయిడా, అహ్మద్‌నగర్, భివాడీ, రూర్కీ ప్రాంతాల్లో మొత్తం 11 తయారీ యూనిట్లను నిర్వహిస్తోంది. 10వేల మందికి పైగా ఉద్యోగులు ఈ సంస్థలో పనిచేస్తుండగా, భారత్‌తోపాటు అంతర్జాతీయంగా 70కి పైగా బ్రాండ్లు ఖాతాదారులుగా ఉన్నాయి.

గ‌ణ‌నీయ‌మైన ఆర్థిక వృద్ధి..

కంపెనీ ఆర్థిక ఫలితాలను పరిశీలిస్తే వృద్ధి స్పష్టంగా కనిపిస్తోంది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో రూ.508.4 కోట్ల నిర్వహణ ఆదాయం, రూ.33.9 కోట్ల ఈబీఐటీడీఏ, రూ.10 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. 2025-26 ఆర్థిక సంవత్సరం నాటికి నిర్వహణ ఆదాయం రూ.5,288 కోట్లకు చేరగా, ఈబీఐటీడీఏ రూ.441.8 కోట్లు, నికర లాభం రూ.193.6 కోట్లకు పెరిగింది. అంటే ఏడేళ్లలో ఆదాయం పది రెట్లకు పైగా, నికర లాభం 19 రెట్లకు పైగా వృద్ధి చెందాయి. 2026-27 ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ త్రైమాసికంలోనూ కంపెనీ మంచి ఫలితాలు సాధించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.655.37 కోట్లతో పోలిస్తే ఆదాయం 42.5 శాతం పెరిగి రూ.933.88 కోట్లకు చేరింది. ఈబీఐటీడీఏ 54.8 శాతం వృద్ధితో రూ.69.14 కోట్లకు చేరగా, నికర లాభం ఏకంగా 395.2 శాతం పెరిగి రూ.13.67 కోట్లుగా నమోదైంది.

మ‌రింత పెరుగుతున్న త‌యారీ సామ‌ర్థ్యం..

భవిష్యత్ వృద్ధిని దృష్టిలో పెట్టుకుని కంపెనీ తయారీ సామర్థ్యాన్ని మరింత పెంచుతోంది. గ్రేటర్ నోయిడాలోని డీఎంఐసీ క్యాంపస్‌లో కొత్త వాషింగ్ మెషీన్ తయారీ కేంద్రాన్ని ప్రారంభించింది. ఈ యూనిట్ ద్వారా ఏడాదికి 18 లక్షల వాషింగ్ మెషీన్లను తయారు చేయవచ్చు. అలాగే భివాడీలోని సలార్‌పూర్‌లో ప్లాస్టిక్ విడిభాగాలు, ఎయిర్ కూలర్ల తయారీ కేంద్రాన్ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ కొత్త కేంద్రం 2026-27 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం నుంచి కంపెనీ ఆదాయానికి తోడ్పడుతుందని అంచనా వేస్తున్నారు. తయారీ సామర్థ్యం పెంపు, అధిక విలువ కలిగిన ఉత్పత్తుల తయారీ, కొత్త మార్కెట్లలో విస్తరణ పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ తదుపరి వృద్ధికి కీలకంగా మారనున్నాయి.

Advertisement
Advertisement