Air Pollution | WFH నిబంధనలు పాటించలేదని.. రెండు సంస్థలకు నోటీసులు
Air Pollution | కాలుష్య నియంత్రణ నియమాలను ఉల్లంఘించినందుకు గురుగ్రామ్ (Gurugram) యంత్రాంగం చర్యలకు ఉపక్రమించింది. 50 శాతం వర్క్ ఫ్రమ్ హోమ్ (WFH) నిబంధనను పాటించనందుకు గానూ రెండు ప్రముఖ కార్పొరేట్ సంస్థలకు అధికారులు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.
Air Pollution | త్రినేత్ర న్యూస్ : ఢిల్లీ-ఎన్‌సీఆర్ (Delhi-NCR) ప్రాంతంలో గాలి నాణ్యత రోజురోజుకూ క్షీణిస్తోంది. ఈ నేపథ్యంలో కాలుష్య నియంత్రణ నియమాలను ఉల్లంఘించినందుకు గురుగ్రామ్ (Gurugram) యంత్రాంగం చర్యలకు ఉపక్రమించింది. 50 శాతం వర్క్ ఫ్రమ్ హోమ్ (WFH) నిబంధనను పాటించనందుకు గానూ సెక్టార్ 42 లోని గోద్రేజ్ జీసీఆర్ కాంప్లెక్స్‌లో ఉన్న జెఎస్ఏ అడ్వొకేట్స్ అండ్ సొలిసిటర్స్ (JSA Advocates & Solicitors), ట్రైలీగల్ (Trilegal) అనే రెండు ప్రముఖ కార్పొరేట్ సంస్థలకు అధికారులు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.
రాజధాని పరిధిలో పెరుగుతున్న వాయు కాలుష్యాన్ని, వాహనాల రాకపోకలను తగ్గించే లక్ష్యంతో గురుగ్రామ్ అధికారులు కీలక చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగానే కాలుష్య నియంత్రణకు నవంబర్ 5 నుంచి నవంబర్ 20 వరకు అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లో 50 శాతం మంది సిబ్బందికి వర్క్ ఫ్రమ్ హోమ్ (WFH) నిబంధన తప్పనిసరిగా అమలు చేయాలని ఆదేశించారు. ఈ నిబంధనలు అమలుపై అధికారులు ఆకస్మిక తనిఖీలు కూడా చేపడుతున్నారు.
బాద్‌షాపూర్ సబ్-డివిజనల్ మేజిస్ట్రేట్ (SDM) నేతృత్వంలోని బృందం ఈ రెండు కార్యాలయాలపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిబంధనలు ఉల్లంఘించినట్లు అధికారులు గుర్తించారు. జెఎస్ఏ సంస్థలో మొత్తం 117 మంది ఉద్యోగులు ఉండగా.. తనిఖీల సమయంలో ఆఫీసులో 87 మంది ఉన్నట్లు తేలింది. నిబంధనల ప్రకారం అక్కడ 58 మంది మాత్రమే ఉండాల్సి ఉంటుంది. అటు ట్రిలీగల్ సంస్థలో మొత్తం 262 మంది ఉద్యోగులు ఉండగా.. తనిఖీల సమయంలో సుమారు 160 మంది విధులకు హాజరయ్యారు. దీంతో నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలడంతో సదరు సంస్థలకు అధికారులు నోటీసులు జారీ చేశారు. 24 గంటల్లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించారు.
Also Read..
ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన శరద్ పవార్
లడఖ్‌లో చరిత్ర సృష్టించిన ఐఏఎఫ్..
"రామాయణ"లో కాజల్ రోల్‌పై విమర్శలు - క్లారిటీ ఇచ్చిన చందమామ
సంబంధిత వార్తలు

Supreme Court | ఢిల్లీ వెదర్‌ను ఆస్వాదిస్తున్నారని అనుకుంటున్నా.. కాలుష్య సంక్షోభంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
నవంబర్ 6, 2026

Supreme Court | గ్రీన్ క్రాకర్స్‌కు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్..
నవంబర్ 2, 2026

Delhi Pollution Curbs | ఢిల్లీలో వాయు కాలుష్యం.. వాహనదారులపై కొరడా ఝుళిపించిన అధికారులు.. తొలిరోజే రూ.68 లక్షల ఫైన్ వసూలు
నవంబర్ 2, 2026
తాజావార్తలు
- ●Kajal Aggarwal | "రామాయణ"లో కాజల్ రోల్‌పై విమర్శలు - క్లారిటీ ఇచ్చిన చందమామ
- ●దీపావళి స్వీట్లలో ఆరోగ్యానికి ఏది మేలు? ఏవి పరిమితంగా తినాలి?
- ●Priyanka Chopra | నేషనల్ అవార్డ్ విన్నింగ్ మూవీకి సీక్వెల్ - ప్రొడ్యూసర్‌గా ప్రియాంక చోప్రా
- ●CID Rides | ధరణి పోర్టల్ అక్రమాల్లో కీలక సమాచారం లభ్యం.. కేసు నమోదు చేసిన సీఐడీ
- ●Sharad Pawar | ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన శరద్ పవార్
- ●హైదరాబాద్‌లో రాహుల్ గ్లోబల్ స్కెచ్! భారత్ సమ్మిట్ వెనుక అసలు వ్యూహమేంటి?

Kajal Aggarwal | "రామాయణ"లో కాజల్ రోల్‌పై విమర్శలు - క్లారిటీ ఇచ్చిన చందమామ

దీపావళి స్వీట్లలో ఆరోగ్యానికి ఏది మేలు? ఏవి పరిమితంగా తినాలి?

Priyanka Chopra | నేషనల్ అవార్డ్ విన్నింగ్ మూవీకి సీక్వెల్ - ప్రొడ్యూసర్‌గా ప్రియాంక చోప్రా

CID Rides | ధరణి పోర్టల్ అక్రమాల్లో కీలక సమాచారం లభ్యం.. కేసు నమోదు చేసిన సీఐడీ



