Ajit Doval | NSA అజిత్ దోవల్‌కు అమెరికా కోర్టు సమన్లు
Ajit Doval | ఖలిస్థానీ వేర్పాటువాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్ (Gurpatwant Singh Pannun) దాఖలు చేసిన కేసులో భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌కు ఢిల్లీ కోర్టు ద్వారా సమన్లు (summons) పంపాలని అమెరికా ఫెడరల్ కోర్టు (US federal court) ఆదేశాలు జారీ చేసింది.
Ajit Doval | త్రినేత్ర న్యూస్ : భారత జాతీయ భద్రతా సలహాదారు (National Security Advisor) అజిత్ దోవల్ (Ajit Doval)కు సంబంధించిన కేసులో అమెరికా కోర్టు కీలక (US federal court) నిర్ణయం తీసుకుంది. దోవల్‌తోపాటూ RAW మాజీ చీఫ్ సామంత్ గోయెల్ (Samant Goel)లకు ఢిల్లీ కోర్టుల (Delhi court) ద్వారా సమన్లు (summons) అందజేయాలని అమెరికా ఫెడరల్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. న్యూయార్క్‌లోని సదరన్ డిస్ట్రిక్ట్ ఫెడరల్ కోర్టు జడ్జి క్యాథరిన్ పోల్క్ ఫైలా ఈ ఉత్తర్వులు జారీ చేశారు. కొరియర్ ద్వారా ఈ సమన్ల పత్రాలను ఢిల్లీలోని మూడు జిల్లా కోర్టులకు పంపాలని కోర్టు క్లర్క్‌ను ఆదేశించారు.
దోవల్‌కు సంబంధించిన సమన్లు, సంబంధిత న్యాయ పత్రాలను పాటియాలా హౌస్ జిల్లా కోర్టుకు, గోయెల్‌కు సంబంధించిన సమన్లను ద్వారకా, తీస్ హజారీ జిల్లా కోర్టులకు పంపాలని ఆదేశించారు. ఈ సమన్లు వారిద్దరికీ అందజేయడంలో సహకరించాలని సదరు కోర్టులను ఫెడరల్ కోర్టు జడ్జి కోరారు. కోర్టు ఆదేశాలతో ఈ సమన్లను ఇప్పటికే భారత కోర్టులకు పంపించారు.
అమెరికాలో తనను హత్య చేసేందుకు కుట్ర పన్నారని ఆరోపిస్తూ ఖలిస్థానీ వేర్పాటువాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్ (Gurpatwant Singh Pannun) ఈ కేసును దాఖలు చేశారు. తనను అమెరికా గడ్డపై హత్య చేసేందుకు కుట్ర జరిగిందని, అందులో భారత ప్రభుత్వానికి చెందిన కొందరు అధికారులు పాత్ర పోషించారని ఆయన ఆరోపించారు. ఈ సివిల్ దావాలో భారత ప్రభుత్వం, అజిత్ దోవల్, మాజీ రా చీఫ్ సామంత్ గోయల్‌తో పాటు మరికొందరి పేర్లను ప్రస్తావించారు. అయితే, పన్నూ దాఖలు చేసిన ఈ దావాను భారత ప్రభుత్వం ఇప్పటికే పూర్తిగా తిరస్కరించింది. ఉన్నత స్థాయి అధికారులపై చేస్తున్నవన్నీ నిరాధారమైన ఆరోపణలేనని భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.
Also Read..
విజయ్ పార్టీలో తీవ్ర విషాదం.. స్టాలిన్‌ను ఓడించిన ఎమ్మెల్యే మృతి
భారతీయులకు షాకిచ్చిన మలేషియా.. వీసా ఫ్రీ ఎంట్రీ రద్దు
దమ్ముంటే రాజీనామా చెయ్.. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి పున్నా కైలాశ్ సవాల్
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Chief Minister | సొంత రాష్ట్రాన్ని పట్టించుకోని ముఖ్యమంత్రి.. హర్యానా సీఎంపై విమర్శలు
- ●Dada Saheb Phalke Awards | ఉత్తమ నటుడిగా రణ్‌వీర్‌సింగ్.. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుల్లో ధురంధర్ హవా..
- ●Horoscope | నవంబర్ 21 రాశిఫలాలు.. మీ పట్టుదల మీకు విజయాన్ని అందిస్తుంది!
- ●Tirumala | ఏడాదికి ఒక్కసారి జరిగే ఉగ్రశ్రీనివాసుడి ఉత్సవం.. సూర్యోదయానికి ముందే తిరుమలలో మహాద్భుతం!
- ●Nasha Mukt Bharat | హైదరాబాద్‌లో ‘నషా ముక్త్ భారత్’పై భారీ అవగాహన కార్యక్రమం
- ●HYDRAA | అహ్మదాబాద్ కంకారియా లేక్ తరహాలో అంబీర్ చెరువు..!

Chief Minister | సొంత రాష్ట్రాన్ని పట్టించుకోని ముఖ్యమంత్రి.. హర్యానా సీఎంపై విమర్శలు

Dada Saheb Phalke Awards | ఉత్తమ నటుడిగా రణ్‌వీర్‌సింగ్.. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుల్లో ధురంధర్ హవా..

Horoscope | నవంబర్ 21 రాశిఫలాలు.. మీ పట్టుదల మీకు విజయాన్ని అందిస్తుంది!

Tirumala | ఏడాదికి ఒక్కసారి జరిగే ఉగ్రశ్రీనివాసుడి ఉత్సవం.. సూర్యోదయానికి ముందే తిరుమలలో మహాద్భుతం!






