Supreme Court | ఢిల్లీ వెదర్‌ను ఆస్వాదిస్తున్నారని అనుకుంటున్నా.. కాలుష్య సంక్షోభంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
Supreme Court | దేశ రాజధాని ఢిల్లీ-ఎన్సీఆర్ (Delhi-NCR) పరిధిలో రోజురోజుకూ తీవ్రమవుతున్న వాయు కాలుష్యంపై (Air Pollution) భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు (Supreme Court) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. "మనం ఎన్ని ఎక్కువ ఆంక్షలు విధిస్తే.. ఉల్లంఘనలు అంతగా పెరుగుతాయి. ఇది మానవ నైజం. కేవలం ఆంక్షలు విధించడం కంటే ప్రజల్లో పర్యావరణ బాధ్యత, అవగాహన పెంచడం ముఖ్యం" అని సీజేఐ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా "మీరందరూ ఢిల్లీ వెదర్‌ను ఆస్వాదిస్తున్నారని ఆశిస్తున్నాను" అంటూ సీజేఐ వ్యాఖ్యానించారు.
Supreme Court | త్రినేత్ర న్యూస్ : దేశ రాజధాని ఢిల్లీ-ఎన్సీఆర్ (Delhi-NCR) పరిధిలో రోజురోజుకూ తీవ్రమవుతున్న వాయు కాలుష్యంపై (Air Pollution) భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు (Supreme Court) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు ప్రత్యామ్నాయాలు, వాహనాల ఉద్గారాలపై కీలక వ్యాఖ్యలు చేసింది. రాజధాని ప్రాంతంలో కాలుష్య సంక్షోభానికి సంబంధించి దాఖలైన పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ (CJI Surya Kant), జస్టిస్ జాయ్‌మాల్య బాగ్చి, జస్టిస్ వి.మోహనాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది.
ఈ సందర్భంగా పంట వ్యర్థాల నిర్వహణకు సంబంధించిన యంత్రాంగాన్ని, వ్యవస్థను నేరుగా గ్రామ పంచాయతీలకే అందించాలని కోర్టు స్పష్టం చేసింది. అదేవిధంగా రైతులు పంట వ్యర్థాలను తగలబెట్టకుండా నిరోధించడానికి ఆ వ్యర్థాల సేకరణకు సంబంధించిన కొనుగోలు మద్దతు ధరను (Procurement Price) సీజన్‌కు ముందే ప్రకటించాలని అధికారులను ఆదేశించింది. "మనం ఎన్ని ఎక్కువ ఆంక్షలు విధిస్తే.. ఉల్లంఘనలు అంతగా పెరుగుతాయి. ఇది మానవ నైజం. కేవలం ఆంక్షలు విధించడం కంటే ప్రజల్లో పర్యావరణ బాధ్యత, అవగాహన పెంచడం ముఖ్యం" అని సీజేఐ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా "మీరందరూ ఢిల్లీ వెదర్‌ను ఆస్వాదిస్తున్నారని ఆశిస్తున్నాను" అంటూ సీజేఐ వ్యాఖ్యానించారు.
30 సిగరెట్లు కాల్చడంతో సమానం
విచారణ సందర్భంగా సీనియర్ న్యాయవాది అపరాజిత సింగ్ (Aparajita Singh) మాట్లాడుతూ.. ఢిల్లీలో వాయు కాలుష్య స్థాయి తీవ్రమైన కేటగిరీలోనే కొనసాగుతోందన్నారు. తన గొంతుపై కాలుష్య ప్రభావం తీవ్రంగా పడిందని తెలిపారు. రాజధాని ప్రాంతంలో గాలి పీల్చడం అంటే ఒక వ్యక్తి ప్రతిరోజూ 30 సిగరెట్లు కాల్చడంతో సమానమని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఢిల్లీలో ఇప్పటికే తీవ్ర కాలుష్యం కొనసాగుతోందన్న ఆమె.. పంట పొలాల దహనం పరిస్థితిని మరింత దిగజార్చుతున్నాయని వ్యాఖ్యానించారు. ఢిల్లీ కాలుష్య స్థాయిల్లో పంట వ్యర్థాల దహనం వాటా 14 శాతంగా ఉందని తెలిపారు. వ్యర్థాల దహనం, కాలుష్యాన్ని అరికట్టడానికి అత్యవసర జోక్యం అవసరమని అభిప్రాయపడ్డారు.
హై-ఎండ్ కార్ల పరిస్థితి ఏంటి..?
స్పందించిన సీజేఐ ధర్మాసనం.. కాలుష్యానికి కేవలం రైతుల పంట వ్యర్థాల దహనాన్ని మాత్రమే నిందించలేమని స్పష్టం చేసింది. విలాసవంతమైన వాహనాలు, ఢిల్లీ రోడ్లపై బంపర్-టు-బంపర్ సాగే విపరీతమైన ట్రాఫిక్ ఉద్గారాలు దీనికి ప్రధాన కారణాలని కోర్టు ఎత్తిచూపింది. "మనం వ్యర్థాల గురించే మాట్లాడుకుంటున్నాం. మరి ఉన్నత వర్గాల పరిస్థితి ఏమిటి..? సంపన్నుల వాహనాలు, హై-ఎండ్ కార్లు అన్నీ రోడ్లపై తిరుగుతున్నాయి కదా..?" అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఇటీవలే కురిసిన వర్షాల వల్ల కాలుష్య స్థాయిలు తగ్గాయని గుర్తు చేసిన సుప్రీం ధర్మాసనం.. రైతులు తదుపరి సాగుకు సన్నద్ధమవుతున్న తరుణంలో వ్యర్థాల దహనం ఆగిపోయి ఉంటాయని ఆశాభావం వ్యక్తం చేసింది.
కాలుష్య కట్టడికి తీసుకుంటన్న చర్యలను వివరించిన కేంద్రం
కేంద్ర ప్రభుత్వం తరఫున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటి మాట్లాడుతూ.. వాయు కాలుష్య నివారణ కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను కోర్టుకు వివరించారు. పంట వ్యర్థాల దహనాన్ని అరికట్టడానికి వివిధ రాష్ట్రాలు/ప్రాంతాల భౌగోళిక, క్షేత్రస్థాయి పరిస్థితులకు అనుగుణంగా (Tailor-made) రూపొందించిన ఒక సమగ్ర కార్యాచరణ ప్రణాళికను కేంద్రం కోర్టుకు సమర్పించిన విషయాన్ని గుర్తు చేశారు. అదేవిధంగా వాహనాల ఉద్గారాల వల్ల వెలువడుతున్న వాయు కాలుష్య సమస్యను పరిష్కరించేందుకు భారత్ స్టేజ్ 6 నిబంధనలకు అనుగుణంగా లేని ఏ వాహనాన్ని కూడా ఢిల్లీలోకి అనుమతించకుండా ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. అలాగే డీజిల్‌తో నడిచే రిక్షాలను దశలవారీగా తొలగించడం, ఇతర నగరాల నుంచి ఢిల్లీలోకి ప్రవేశించే బస్సులకు తప్పనిసరి నిబంధనలు అమలు చేస్తున్నట్లు వివరించారు.
Also Read..
విద్యార్థులకు అలర్ట్.. పరీక్ష తేదీలను ప్రకటించిన సీబీఎస్ఈ బోర్డు
దీపావళి ముహూరత్ ట్రేడింగ్‌లో నిఫ్టీ.. 11 ఏళ్లలో 9 సార్లు లాభాలే..
క్రాప్ హాలిడే ఇస్తే.. కాంగ్రెస్‌కు కూడా ప్రజలు సెలవిస్తారు
సంబంధిత వార్తలు

Supreme Court | విద్యార్థులపై పోలీసుల లాఠీఛార్జ్.. నెలాఖరులోపు నివేదిక ఇవ్వండి
నవంబర్ 5, 2026

Supreme Court | UGC నిబంధనలను పునఃపరిశీలిస్తాం.. సుప్రీంకోర్టుకు తెలిపిన కేంద్రం
నవంబర్ 5, 2026

Supreme Court | విచారణ పేరుతో అక్రమ నిర్బంధాలకు అడ్డుకట్ట.. సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు
నవంబర్ 5, 2026
తాజావార్తలు
- ●Nifty 50 | దీపావళి ముహూరత్ ట్రేడింగ్‌లో నిఫ్టీ.. 11 ఏళ్లలో 9 సార్లు లాభాలే..
- ●Bhupalapally | వివాహేతర సంబంధం.. ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య
- ●Ala Venkateshwer Reddy | క్రాప్ హాలిడే ఇస్తే.. కాంగ్రెస్‌కు కూడా ప్రజలు సెలవిస్తారు
- ●TPCC Chief Mahesh Goud | గాంధీ భవన్‌కు పిలిచినా రాలేదు.. అధిష్టానానికి తేల్చి చెప్పిన పీసీసీ చీఫ్
- ●Harish Rao | అధైర్య పడకండి.. రేవంత్ మెడలు వంచుదాం
- ●CBSE | విద్యార్థులకు అలర్ట్.. పరీక్ష తేదీలను ప్రకటించిన సీబీఎస్ఈ బోర్డు

Nifty 50 | దీపావళి ముహూరత్ ట్రేడింగ్‌లో నిఫ్టీ.. 11 ఏళ్లలో 9 సార్లు లాభాలే..

Bhupalapally | వివాహేతర సంబంధం.. ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య

Ala Venkateshwer Reddy | క్రాప్ హాలిడే ఇస్తే.. కాంగ్రెస్‌కు కూడా ప్రజలు సెలవిస్తారు

TPCC Chief Mahesh Goud | గాంధీ భవన్‌కు పిలిచినా రాలేదు.. అధిష్టానానికి తేల్చి చెప్పిన పీసీసీ చీఫ్



