Digital Arrest Scam | సీబీఐ అధికారులమంటూ.. వ్యాపారి నుంచి రూ.15 కోట్లు కాజేసిన నేరగాళ్లు
Digital Arrest Scam | సీబీఐ అధికారులమని చెప్పి నేరగాళ్లు ఓ వ్యాపారవేత్తను డిజిటల్ అరెస్ట్ చేశారు. అతన్ని అరెస్ట్ చేస్తామని బెదిరించి ఏకంగా కోట్ల రూపాయలు (Businessman Loses Over Rs 15 Cr) దోచుకున్నారు. ఈ ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది.
Digital Arrest Scam | దేశవ్యాప్తంగా సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోయాయి. రోజుకో తరహా స్కామ్‌తో సైబర్ నేరగాళ్లు చెలరేగిపోతున్నారు. డిజిటల్ అరెస్టు వంటి సైబర్ నేరాలపై ప్రభుత్వాలు ఎంతగా అవగాహన కల్పిస్తున్నా ప్రజలు పదేపదే మోసపోతూనే ఉన్నారు. తాజాగా సీబీఐ అధికారులమని చెప్పి నేరగాళ్లు ఓ వ్యాపారవేత్తను డిజిటల్ అరెస్ట్ చేశారు. అతన్ని అరెస్ట్ చేస్తామని బెదిరించి ఏకంగా కోట్ల రూపాయలు (Businessman Loses Over Rs 15 Cr) దోచుకున్నారు. ఈ ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బెళగావికి చెందిన 81 ఏళ్ల వృద్ధ వ్యాపారిని కొందరు డిజిటల్ అరెస్ట్ చేశారు. సీబీఐ అధికారులమని చెప్పి దాదాపు ఆరు వారాలుగా అతన్ని బెదిరిస్తూ వస్తున్నారు. తనపై అక్రమ ఆర్థిక కార్యకలాపాలకు పాల్పడినట్లు ఫిర్యాదు వచ్చిందని అతన్ని భయపెట్టారు. రూ.25 లక్షల మనీలాండరింగ్‌కు పాల్పడ్డారని.. రూ.5 లక్షలు కమీషన్ తీసుకున్నట్లు ఫిర్యాదు అందిందంటూ అతన్ని నమ్మబలికారు. మనీలాండరింగ్ కేసులో అరెస్టు చేస్తామని బెదిరించి.. వ్యాపారి బ్యాంక్ ఖాతా, ఇతర ఆర్థిక వివరాలను సేకరించారు.
విచారణ పేరుతో తన వద్ద ఉన్న డబ్బును పలు బ్యాంకు ఖాతాలకు బదిలీ చేయాల్సిందిగా సూచించారు. విచారణ పూర్తయ్యాక ఆ డబ్బు తిరిగి ఇచ్చేస్తామని హామీ ఇచ్చారు. వారి మాటలను నమ్మిన బాధితుడు విడతల వారీగా డబ్బు బదిలీ చేశాడు. అలా బాధితుడి నుంచి నేరగాళ్లు దాదాపు రూ.15 కోట్లకుపైగానే కాజేశారు. ఆ తర్వాత ఎన్నిసార్లు ఫోన్ చేసినా అటువైపు నుంచి స్పందన రాకపోవడంతో మోసపోయానని గ్రహించిన బాధిత వ్యాపారవేత్త.. స్థానిక పోలీసులను ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
పోలీసుల హెచ్చరికలు..
ఈ కేసును దర్యాప్తు చేసిన సైబర్, ఎకనామిక్ అండ్ నార్కోటిక్స్ (CEN) పోలీసు అధికారులు.. డబ్బు బదిలీ అయిన ఖాతాను గుర్తించి కేవలం రూ. 90 లక్షలను తిరిగి స్వాధీనం చేసుకున్నారు. నిందితులను పట్టుకోవడానికి బెళగావి పోలీస్ కమిషనర్ ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. డిజిటల్ అరెస్ట్ పేరుతో ఏ ప్రభుత్వ అధికారి కూడా ఫోన్ ద్వారా విచారణ చేయరని పోలీసులు హెచ్చరించారు. తెలియని వ్యక్తులతో బ్యాంక్ లేదా వ్యక్తిగత వివరాలను పంచుకోవద్దని సూచించారు. సైబర్ మోసాలు, డిజిటల్ అరెస్ట్‌ల పేరుతో వచ్చే కాల్స్‌తో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. మోసాలకు గురైన వారు వెంటనే జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్ 1930కి కాల్ చేయాలని లేదా అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఫిర్యాదు చేయాలని సూచించారు.
Also Read..
రూ.8 లక్షల కోట్ల సంపద ఆవిరి.. స్టాక్ మార్కెట్లకు బ్లాక్ మండే..
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Instagram | మెటాకు కేంద్రం నోటీసులు.. ఇన్‌స్టా యాడ్స్‌పై వివరణ కోరిన ఐటీశాఖ..!
జులై 3, 2026

SIM Swapping | సిమ్ స్వాపింగ్ మోసాలతో జాగ్రత్త.. నిర్లక్ష్యం చేస్తే బ్యాంకు ఖాతాలు ఖాళీ అవుతాయి..
జూన్ 23, 2026

Supreme Court | సైబర్ నేరగాళ్లు పరాన్నజీవులు.. వారిని ఉపేక్షించొద్దు : సుప్రీంకోర్టు
జూన్ 17, 2026
తాజావార్తలు
- ●BSNL | సరికొత్త శాటిలైట్ లాంచ్ చేసిన బీఎస్ఎన్ఎల్.. రూ.1.34లక్షల ఫోన్ ఎవరి కోసం.. ప్రత్యేకతలు ఏంటంటే..?
- ●Minister Ponnam | సమస్యల పరిష్కారం కోసం కొండా సురేఖను కలిసిన మంత్రి పొన్నం..
- ●The Furious Review | ది ఫ్యూరియస్ రివ్యూ - లోకేష్ కనగరాజ్ ఖైదీతో కంపేరిజన్స్ - యాక్షన్ లవర్స్ మిస్సవ్వొద్దు
- ●Medigadda Barrage | మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల.. ఆ మూడు లిఫ్టులు వాడితేనే సేఫ్ : రిటైర్డ్ ఇంజనీర్ల సంఘం కీలక సలహా
- ●JP Nadda | దేశానికే ఆదర్శంగా బీబీనగర్ ఎయిమ్స్ : కేంద్రమంత్రి జేపీ నడ్డా
- ●Jana Nayagan | దళపతి విజయ్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్ - జననాయగన్ సెన్సార్ కంప్లీట్ - మూడు గంటల రన్టైమ్తో రిలీజ్

BSNL | సరికొత్త శాటిలైట్ లాంచ్ చేసిన బీఎస్ఎన్ఎల్.. రూ.1.34లక్షల ఫోన్ ఎవరి కోసం.. ప్రత్యేకతలు ఏంటంటే..?

Minister Ponnam | సమస్యల పరిష్కారం కోసం కొండా సురేఖను కలిసిన మంత్రి పొన్నం..

The Furious Review | ది ఫ్యూరియస్ రివ్యూ - లోకేష్ కనగరాజ్ ఖైదీతో కంపేరిజన్స్ - యాక్షన్ లవర్స్ మిస్సవ్వొద్దు

Medigadda Barrage | మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల.. ఆ మూడు లిఫ్టులు వాడితేనే సేఫ్ : రిటైర్డ్ ఇంజనీర్ల సంఘం కీలక సలహా



