Jana Nayagan | దళపతి విజయ్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్ – జననాయగన్ సెన్సార్ కంప్లీట్ – మూడు గంటల రన్‌టైమ్‌తో రిలీజ్
జననాయగన్ సెన్సార్ కష్టాలకు ఎట్టకేలకు శుభం కార్డు పడింది. ఈ సినిమాకు సీబీఎఫ్‌సీ "ఏ" సర్టిఫికెట్ ఇచ్చింది. ఈ సినిమా రన్‌టైమ్ కూడా రివీలైంది. దళపతి విజయ్ చివరి మూవీగా జననాయగన్ ఈ నెలలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
Entertainment | Published On Jul 9, 2026, 7.32 pm IST
Jana Nayagan |దళపతి విజయ్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్ వచ్చేసింది. ఎట్టకేలకు జననాయగన్ సెన్సార్ పూర్తయ్యింది. ఈ విషయాన్ని మేకర్స్ అఫీషియల్‌గా ప్రకటించారు. ఈ సినిమా రన్‌టైమ్‌ను రివీల్ చేశారు. జననాయగన్‌కు సీబీఎఫ్‌సీ "ఏ" సర్టిఫికెట్ ఇచ్చింది. మూడు గంటల మూడు నిమిషాల పదకొండు సెకండ్ల రన్‌టైమ్‌తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ప్రకటించారు. రిలీజ్ డేట్‌ను మాత్రం వెల్లడించలేదు. త్వరలోనే జననాయగన్ థియేటర్లలోకి రానున్నట్లు సమాచారం.
జూలై 24న రిలీజ్....
జూలై 24న జననాయగన్ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. మరో ఒకటి రెండు రోజుల్లో రిలీజ్ డేట్‌పై క్లారిటీ రానున్నట్లు చెబుతున్నారు. ఈ ఏడాది సంక్రాంతికే జననాయగన్ ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. సినిమాలోని పొలిటికల్ డైలాగ్స్, యాక్షన్ సీక్వెన్స్‌లపై సెన్సార్ బోర్డు అభ్యంతరం వ్యక్తం చేసింది. సీబీఎఫ్‌సీపై న్యాయ పోరాటానికి జననాయగన్ మేకర్స్ సిద్ధమయ్యారు. చెన్నై హైకోర్టుతో పాటు సుప్రీంకోర్టులో కేసు వేశారు. ఆరు నెలల పోరాటానికి ఎట్టకేలకు గురువారం నాటితో పుల్‌స్టాప్ పడింది.
చివరి మూవీ.....
జననాయగన్ తన చివరి మూవీ అంటూ పొలిటికల్ ఎంట్రీకి ముందే విజయ్ ప్రకటించాడు. అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ ఘన విజయం సాధించి తమిళనాడు సీఎంగా పదవి చేపట్టారు. అతడు ముఖ్యమంత్రిగా మారిన తర్వాత రిలీజ్ అవుతుండటంతో జననాయగన్ బాక్సాఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేయడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. వెయ్యి కోట్లకుపైనే ఈ సినిమా వసూళ్లను రాబట్టవచ్చని ప్రచారం జరుగుతోంది. తమిళంతో పాటు తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నారు.
పొలిటికల్ థ్రిల్లర్...
జననాయగన్ మూవీకి హెచ్ వినోథ్ దర్శకత్వం వహించాడు. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో మమితా బైజు ఓ కీలక పాత్రలో నటించింది. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ విలన్‌గా నటించాడు. బాలకృష్ణ హీరోగా నటించిన తెలుగు మూవీ భగవంత్ కేసరికి రీమేక్‌గా జననాయగన్ రూపొందుతోంది. తమన్ మ్యూజిక్ అందించాడు. తొలుత ఈ రీమేక్‌కు దర్శకత్వం వహించే అవకాశం అనిల్ రావిపూడికి వచ్చింది. రీమేక్ సినిమా చేయడం ఇష్టం లేక అనిల్ రావిపూడి ఈ అవకాశాన్ని వదులుకున్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

OTT | ట్విస్ట్‌లతో సాగే వంద కోట్ల బ్లాక్‌బస్టర్ మూవీ – తెలుగులో ఫ్రీ స్ట్రీమింగ్ – ఏ ఓటీటీలో చూడాలంటే?
జులై 7, 2026

Jana Nayagan | జన నాయగన్‌కు సర్టిఫికెట్ ఇచ్చిన సెన్సార్ బోర్డు – 13 కట్స్ – రన్‌టైమ్ రివీల్ – అసలు ట్విస్ట్ తెలిస్తే మైండ్ బ్లాక్
జులై 6, 2026

Thalapathy Vijay | దళపతి విజయ్ వర్సెస్ జాసన్ సంజయ్ – తండ్రీకొడుకుల బాక్సాఫీస్ ఫైట్
జులై 3, 2026
తాజావార్తలు
- ●Hyderabad | ఎగ్జామ్ ప్యాడ్‌ను విసిరేసిన టీచర్.. తెగిపోయిన విద్యార్థిని చెవి
- ●White Cobra | నిర్మల్ జిల్లాలో అరుదైన శ్వేతనాగు ప్రత్యక్షం..
- ●Hyderabad | కలిసి మద్యం సేవించారు.. స్నేహితుడిని హత్య చేశారు..
- ●Sreeleela | లెనిన్ రిలీజ్ వేళ - శ్రీలీలను ట్రోల్ చేస్తున్న నెటిజన్లు - ఎందుకంటే?
- ●Nora Fatehi | ఫుట్‌బాల్ వరల్డ్ కప్‌లో మొరాకో ఓటమి - కన్నీళ్లు పెట్టుకున్న నోరా ఫతేహి - కారణం ఇదే!
- ●Khushi Kapoor | రెడ్ డ్రెస్‌లో జాన్వీ చెల్లెలి సోయగాలు - నెక్స్ట్ టార్గెట్ టాలీవుడ్

Hyderabad | ఎగ్జామ్ ప్యాడ్‌ను విసిరేసిన టీచర్.. తెగిపోయిన విద్యార్థిని చెవి

White Cobra | నిర్మల్ జిల్లాలో అరుదైన శ్వేతనాగు ప్రత్యక్షం..

Hyderabad | కలిసి మద్యం సేవించారు.. స్నేహితుడిని హత్య చేశారు..

Sreeleela | లెనిన్ రిలీజ్ వేళ - శ్రీలీలను ట్రోల్ చేస్తున్న నెటిజన్లు - ఎందుకంటే?



