త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Instagram | మెటాకు కేంద్రం నోటీసులు.. ఇన్‌స్టా యాడ్స్‌పై వివ‌ర‌ణ కోరిన ఐటీశాఖ‌..!

Instagram | సోషల్ మీడియా దిగ్గజం మెటాకు కేంద్ర ప్రభుత్వం మరోసారి షాక్ ఇచ్చింది. ఇన్‌స్టాగ్రామ్‌లో చిన్నారులపై లైంగిక వేధింపులకు సంబంధించిన అక్రమ కంటెంట్‌ను ప్రోత్సహించేలా ప్రకటనలు కనిపిస్తున్నాయన్న ఆరోపణలపై కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తీవ్రంగా స్పందించారు.

P

National | Published On Jul 3, 2026, 9.05 pm IST

Instagram | మెటాకు కేంద్రం నోటీసులు.. ఇన్‌స్టా యాడ్స్‌పై వివ‌ర‌ణ కోరిన ఐటీశాఖ‌..!
Advertisement

Instagram | సోషల్ మీడియా దిగ్గజం మెటాకు కేంద్ర ప్రభుత్వం మరోసారి షాక్ ఇచ్చింది. ఇన్‌స్టాగ్రామ్‌లో చిన్నారులపై లైంగిక వేధింపులకు సంబంధించిన అక్రమ కంటెంట్‌ను ప్రోత్సహించేలా ప్రకటనలు కనిపిస్తున్నాయన్న ఆరోపణలపై కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తీవ్రంగా స్పందించారు. ఈ వ్యవహారంపై మెటాకు వెంటనే నోటీసులు జారీ చేసి వివరణ కోరాలని అధికారులను ఆదేశించారు. మీడియా కథనాల ప్రకారం.. ఇన్‌స్టాగ్రామ్‌లో కనిపిస్తున్న కొన్ని చెల్లింపు ప్రకటనలు వినియోగదారులను టెలిగ్రామ్ వంటి ఇతర సోషల్ మీడియా వేదికలకు మళ్లిస్తున్నాయి. అక్కడ చిన్నారులపై లైంగిక వేధింపులకు సంబంధించిన అక్రమ కంటెంట్ అందుబాటులో ఉందని కథనాలు వెల్లడించాయి.

ఈ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం అత్యంత తీవ్రంగా పరిగణించింది. వారం రోజుల వ్యవధిలో మెటాకు కేంద్ర ప్రభుత్వం నోటీసులు జారీ చేయడం ఇది రెండోసారి. ఇటీవల వాట్సాప్‌లో తీసుకురానున్న 'యూజర్‌నేమ్' ఫీచర్‌పైనా కేంద్రం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ ఫీచర్ వల్ల డిజిటల్ అరెస్ట్ తరహా మోసాలు, ఆన్‌లైన్ మోసాలు, గుర్తింపు చౌర్యం వంటి సైబర్ నేరాలు పెరిగే అవకాశం ఉందని పేర్కొంటూ ఇప్పటికే మెటాకు నోటీసులు జారీ చేసింది. తాజా పరిణామాలతో మెటా నిర్వహిస్తున్న సోషల్ మీడియా వేదికల్లో చిన్నారుల భద్రత, సైబర్ భద్రతా ప్రమాణాల అమలుపై కేంద్ర ప్రభుత్వం మరింత నిఘా పెంచింద‌ని సంబంధిత వ‌ర్గాలు పేర్కొంటున్నాయి.

 

Advertisement
Advertisement