Stock Markets | రూ.8 లక్షల కోట్ల సంపద ఆవిరి.. స్టాక్ మార్కెట్లకు బ్లాక్ మండే..
Stock Markets | పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రతరం కావడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు ఇప్పటికే భారీ నష్టాల్లో ఉన్నాయి. సోమవారం ట్రేడింగ్ సెషన్‌లోనూ ఈ నష్టాలు కొనసాగుతున్నాయి. ప్రధాన సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ50 భారీగా పతనం అయ్యాయి. ఆరంభంలోనే గ్యాప్ డౌన్‌తో ఓపెన్ అవగా సెన్సెక్స్ 1300 పాయింట్లు (1.77 శాతం) నష్టపోయి 73,200 వద్ద కొనసాగుతోంది.
Stock Markets | పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రతరం కావడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు ఇప్పటికే భారీ నష్టాల్లో ఉన్నాయి. సోమవారం ట్రేడింగ్ సెషన్‌లోనూ ఈ నష్టాలు కొనసాగుతున్నాయి. ప్రధాన సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ50 భారీగా పతనం అయ్యాయి. ఆరంభంలోనే గ్యాప్ డౌన్‌తో ఓపెన్ అవగా సెన్సెక్స్ 1300 పాయింట్లు (1.77 శాతం) నష్టపోయి 73,200 వద్ద కొనసాగుతోంది. మరోవైపు నిఫ్టీ50 సూచీ 400 పాయింట్లు (1.78 శాతం) పతనం అయి 22,700 వద్ద ట్రేడ్ అవుతోంది. బీఎస్ఈ150 మిడ్‌క్యాప్, బీఎస్ఈ250 స్మాల్ క్యాప్ సూచీలు, నిఫ్టీలోని ఇతర ప్రధాన సూచీలు సైతం 2 శాతం చొప్పున పతనం అయ్యాయి. శుక్రవారం నాటి సెషన్ ముగింపు వరకు బీఎస్ఈలో లిస్ట్ అయి ఉన్న కంపెనీల మార్కెట్ విలువ రూ.429 లక్షల కోట్లు ఉండగా, అదిప్పుడు రూ.421 లక్షల కోట్లకు తగ్గింది. దీంతో సోమవారం ఒక్క సెషన్‌లోనే పెట్టుబడిదారులు రూ.8 లక్షల కోట్ల సంపదను నష్టపోయారు.
ఆసియా మార్కెట్లు భారీగా పతనం..
అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధం తీవ్రతరం కావడంతో అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు పెరిగాయి. ఇజ్రాయెల్, ఇరాన్ దేశాలు పరస్పరం ఇంధన స్థావరాలపై దాడులు చేసుకుంటుండడం మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపించింది. గత శుక్రవారం అమెరికన్ మార్కెట్లు సైతం భారీగా పతనం అయ్యాయి. ఈ క్రమంలోనే సోమవారం నాడు ఆ ప్రభావం దేశీయ మార్కెట్లపై పడింది. అమెరికా సూచీల్లో ఒకటైన డౌజోన్స్ 443 పాయింట్లు (0.96 శాతం) పతనం అవగా, నాస్‌డాక్ కంపోజిట్ 457 పాయింట్లు (1.88 శాతం) తగ్గింది. మరో సూచీ ఎస్ అండ్ పీ 500 సైతం 99 పాయింట్లు (1.51 శాతం) నష్టపోయింది. సోమవారం ఉదయం ఆసియా మార్కెట్లు కూడా నష్టాల్లోనే మొదలయ్యాయి. జపాన్ నిక్కీ 131 పాయింట్లు (0.26 శాతం) పతనం అయి 51,178 వద్ద కొనసాగుతుండగా, షాంగై సూచీ 98 పాయింట్లు (2.50 శాతం) నష్టపోయి 3,858 వద్ద ట్రేడ్ అవుతోంది. హాంగ్ సెంగ్ 871 పాయింట్లు (3.45 శాతం) పతనం అయి 24,406 వద్ద కొనసాగుతోంది.
పెరిగిన చమురు ధరలు, బలపడ్డ డాలర్..
ముడి చమురు ధరలు సైతం సోమవారం సెషన్‌లో భారీగా పెరిగాయి. ఎంసీఎక్స్‌లో క్రూడ్ ధర 110 పాయింట్లు (1.16 శాతం) పెరిగి 9,368 వద్ద కొనసాగుతుండగా, అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 108 డాలర్లకు పైన ట్రేడ్ అవుతోంది. క్రితం సెషన్‌తో పోలిస్తే దీని ధర 0.87 డాలర్లు (0.81 శాతం) పెరిగింది. అలాగే డబ్ల్యూటీఐ క్రూడ్ ధర బ్యారెల్‌కు 1.10 డాలర్లు (1.13 శాతం) పెరిగి 98 డాలర్ల పైన కొనసాగుతోంది. ఇక అమెరికా డాలర్ తో పోలిస్తే భారత రూపాయి విలువ మరింత పతనం అయింది. క్రితం సెషన్‌తో పోలిస్తే రూపాయి 0.22 పైసలు (0.24 శాతం) తగ్గి 93.87 ఆల్ టైం గరిష్ట స్థాయిని తాకింది. అయితే డాలర్ బలపడుతుండడంతో బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. ఎంసీఎక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ కాంట్రాక్టు 6,568 పాయింట్లు (4.52 శాతం) పతనం అయి 1,37,961 వద్ద కొనసాగుతుండగా, సిల్వర్ ఫ్యూచర్స్ కాంట్రాక్టు 12,868 పాయింట్లు (5.62 శాతం) తగ్గి 2,14,043 వద్ద ట్రేడ్ అవుతోంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Stock Markets | భారీ పతనం అనంతరం.. కాస్త కోలుకున్న స్టాక్ మార్కెట్లు, తగ్గిన చమురు ధరలు..
జులై 9, 2026

Stock Markets | స్టాక్ మార్కెట్లకు ఊరట.. భారీ పతనం తర్వాత సెన్సెక్స్, నిఫ్టీ రికవరీ..
జులై 9, 2026

Stock Markets | అమెరికా-ఇరాన్ యుద్ధం ఎఫెక్ట్.. స్టాక్ మార్కెట్లలో బ్లడ్ బాత్.. భారీగా పతనమైన సూచీలు..
జులై 8, 2026
తాజావార్తలు
- ●BSNL | సరికొత్త శాటిలైట్ లాంచ్ చేసిన బీఎస్ఎన్ఎల్.. రూ.1.34లక్షల ఫోన్ ఎవరి కోసం.. ప్రత్యేకతలు ఏంటంటే..?
- ●Minister Ponnam | సమస్యల పరిష్కారం కోసం కొండా సురేఖను కలిసిన మంత్రి పొన్నం..
- ●The Furious Review | ది ఫ్యూరియస్ రివ్యూ - లోకేష్ కనగరాజ్ ఖైదీతో కంపేరిజన్స్ - యాక్షన్ లవర్స్ మిస్సవ్వొద్దు
- ●Medigadda Barrage | మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల.. ఆ మూడు లిఫ్టులు వాడితేనే సేఫ్ : రిటైర్డ్ ఇంజనీర్ల సంఘం కీలక సలహా
- ●JP Nadda | దేశానికే ఆదర్శంగా బీబీనగర్ ఎయిమ్స్ : కేంద్రమంత్రి జేపీ నడ్డా
- ●Jana Nayagan | దళపతి విజయ్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్ - జననాయగన్ సెన్సార్ కంప్లీట్ - మూడు గంటల రన్టైమ్తో రిలీజ్

BSNL | సరికొత్త శాటిలైట్ లాంచ్ చేసిన బీఎస్ఎన్ఎల్.. రూ.1.34లక్షల ఫోన్ ఎవరి కోసం.. ప్రత్యేకతలు ఏంటంటే..?

Minister Ponnam | సమస్యల పరిష్కారం కోసం కొండా సురేఖను కలిసిన మంత్రి పొన్నం..

The Furious Review | ది ఫ్యూరియస్ రివ్యూ - లోకేష్ కనగరాజ్ ఖైదీతో కంపేరిజన్స్ - యాక్షన్ లవర్స్ మిస్సవ్వొద్దు

Medigadda Barrage | మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల.. ఆ మూడు లిఫ్టులు వాడితేనే సేఫ్ : రిటైర్డ్ ఇంజనీర్ల సంఘం కీలక సలహా



