త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

BSNL | స‌రికొత్త శాటిలైట్ లాంచ్ చేసిన బీఎస్ఎన్ఎల్‌.. రూ.1.34ల‌క్ష‌ల ఫోన్ ఎవ‌రి కోసం.. ప్ర‌త్యేక‌త‌లు ఏంటంటే..?

BSNL | ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ స‌రికొత్త శాటిలైట్ ఫోన్‌ను ప‌రిచ‌యం చేసింది. ఫోన్ ధ‌ర రూ.1,34,166 గా నిర్ణ‌యించింది. సాధారణంగా ఈ ధరలో ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌లు వ‌స్తాయి. అయితే, బీఎస్‌ఎన్‌ఎల్‌ తీసుకొచ్చిన ఈ ఫోన్ సాధారణ స్మార్ట్‌ఫోన్ కాదు. మొబైల్ నెట్‌వర్క్ అందుబాటులో లేని ప్రాంతాల్లోనూ పనిచేసే శాటిలైట్ ఫోన్ కావడం విశేషం.

P

Business | Published On Jul 9, 2026, 10.10 pm IST

BSNL | స‌రికొత్త శాటిలైట్ లాంచ్ చేసిన బీఎస్ఎన్ఎల్‌.. రూ.1.34ల‌క్ష‌ల ఫోన్ ఎవ‌రి కోసం.. ప్ర‌త్యేక‌త‌లు ఏంటంటే..?
Advertisement

BSNL | ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ స‌రికొత్త శాటిలైట్ ఫోన్‌ను ప‌రిచ‌యం చేసింది. ఫోన్ ధ‌ర రూ.1,34,166 గా నిర్ణ‌యించింది. సాధారణంగా ఈ ధరలో ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌లు వ‌స్తాయి. అయితే, బీఎస్‌ఎన్‌ఎల్‌ తీసుకొచ్చిన ఈ ఫోన్ సాధారణ స్మార్ట్‌ఫోన్ కాదు. మొబైల్ నెట్‌వర్క్ అందుబాటులో లేని ప్రాంతాల్లోనూ పనిచేసే శాటిలైట్ ఫోన్ కావడం విశేషం. అంతేకాకుండా ఈ ఫోన్‌ను సాధారణ మొబైల్ దుకాణాలు, ఈ-కామర్స్ వెబ్‌సైట్లలో కొనుగోలు చేసే అవకాశమే లేదు. ఇది ఇన్‌మార్సాట్ (Inmarsat) శాటిలైట్ సాంకేతికత ఆధారంగా పనిచేసే శాటిలైట్ ఫోన్. మొబైల్ టవర్లు లేని ప్రాంతాల్లో కమ్యూనికేషన్ కోసం ప్రత్యేకంగా రూపొందించారు.

కీల‌క ఫీచ‌ర్స్ ఇవే..

స్పేస్‌లోని శాటిలైట్‌లతో నేరుగా కనెక్ట్ అయ్యే సదుపాయం, మొబైల్ నెట్‌వర్క్ లేకున్నా వాయిస్ కాల్స్ చేసుకునే వీలుంటుంది. అత్యవసర పరిస్థితుల్లో ఎస్‌ఓఎస్‌ (SOS) అలర్ట్ పంపే అవ‌కాశం ఉంది. తీవ్ర వాతావరణ పరిస్థితులు, కఠినమైన పరిసరాల్లోనూ పనిచేసేలా, మారుమూల ప్రాంతాల్లో ఛార్జింగ్ సమస్యలను దృష్టిలో పెట్టుకుని అద‌నంగా బ్యాటరీ బ్యాకప్ వ‌చ్చేలా రూపొందించారు. ప్రస్తుతం యాపిల్, గూగుల్ వంటి సంస్థల ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ల్లో కూడా శాటిలైట్ కనెక్టివిటీ అందుబాటులో ఉంది. అయితే, వాటితో అత్యవసర సందేశాలు (SOS) మాత్రమే పంపే వీలుఉంది. బీఎస్‌ఎన్‌ఎల్‌ తీసుకొచ్చిన ఈ శాటిలైట్ ఫోన్‌తో మాత్రం నేరుగా వాయిస్ కాల్స్ చేసుకునే అవకాశం ఉంది.

ఎవ‌రైనా కొనుగోలు చేయొచ్చా?

ఈ ఫోన్ సాధారణ మార్కెట్‌లో అమ్మ‌కాలు జ‌రుప‌రు. కొనుగోలు చేయాలనుకునే వారు నేరుగా బీఎస్‌ఎన్‌ఎల్‌ను సంప్రదించి, శాటిలైట్ ఫోన్ అవసరం ఎందుకు ఉందో సరైన కారణాన్ని వివరించాల్సి ఉంటుంది. ఆ తర్వాతే అనుమతి లభించే అవకాశం ఉంటుంది. ప్ర‌ధానంగా వీటిని భార‌త సైన్యం, జాతీయ, రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థలు (ఎన్‌డీఆర్‌ఎఫ్‌, ఎస్‌డీఆర్‌ఎఫ్‌, సరిహద్దు భద్రతా దళాలు, ఇప్పటికీ మొబైల్ నెట్‌వర్క్ అందని మారుమూల గ్రామాలు, పంచాయతీలకు విక్ర‌యించే అవ‌కాశం ఉంది. ఈ ఫోన్‌కు సంబంధించిన రీచార్జ్ ప్లాన్ల వివరాలను బీఎస్‌ఎన్‌ఎల్ ఇంకా వెల్ల‌డించ‌లేదు. శాటిలైట్ ఫోన్‌ను తీసుకురావ‌డం ఇదే తొలిసారేం కాదు. గతంలో బీఎస్‌ఎన్‌ఎల్‌ ‘ఐశాట్‌ఫోన్–2’ (IsatPhone 2) పేరుతో శాటిలైట్ ఫోన్‌ను విడుదల చేసింది. దాని ధర సుమారు రూ.90వేల వరకు ఉంది.

జియో, స్టార్‌లింక్ కంటే ముందే మరో అడుగు..

శాటిలైట్ ఫోన్ సేవలతో పాటు బీఎస్‌ఎన్‌ఎల్‌ ఇప్పటికే ‘డైరెక్ట్ టు డివైస్ (D2D) శాటిలైట్ సర్వీస్’ను కూడా ప్రారంభించింది. అమెరికాకు చెందిన వియాసాట్ (Viasat) సంస్థతో కలిసి 2024 నవంబర్‌లో ఈ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం శాటిలైట్ ఇంటర్నెట్ రంగంలో జియో, స్టార్‌లింక్ మధ్య పోటీ కొనసాగుతున్న వేళ, బీఎస్‌ఎన్‌ఎల్‌ ఇప్పటికే ఈ విభాగంలో అడుగుపెట్టడం గమనార్హం. మొబైల్ నెట్‌వర్క్, వై-ఫై సదుపాయం లేని మారుమూల ప్రాంతాల ప్రజలకు, అడవులు, ఎత్త‌యిన కొండ ప్రాంతాల్లో నివసించే వారికి, ట్రెక్కింగ్, అడ్వెంచర్ టూరిజం చేసే ప్రయాణికులకు, అత్యవసర పరిస్థితుల్లో కమ్యూనికేషన్ అవసరమయ్యే విపత్తు నిర్వహణ బృందాలకు డీటూడీ సేవ‌ల‌తో ప్ర‌యోజ‌నం క‌లుగ‌నుంది.

Advertisement
Advertisement