The Furious Review | ది ఫ్యూరియస్ రివ్యూ – లోకేష్ కనగరాజ్ ఖైదీతో కంపేరిజన్స్ – యాక్షన్ లవర్స్ మిస్సవ్వొద్దు
ఇరవై మిలియన్ల బడ్జెట్‌తో రూపొందిన హాంకాంగ్ యాక్షన్ మూవీ ది ఫ్యూరియస్ నలభై మిలియన్లకుపైగా వసూళ్లను రాబట్టి బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. మార్షల్ ఆర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ఈ మూవీలో షి మియావో, జో తస్లిమ్ హీరోలుగా నటించారు.
Entertainment | Published On Jul 9, 2026, 8.38 pm IST
The Furious Review | హాంకాంగ్ యాక్షన్ మూవీ ది ఫ్యూరియస్ ఇటీవలే థియేటర్లలో రిలీజైంది. షి మియావో, జో తస్లిమ్ హీరోలుగా నటించారు. ఇరవై మిలియన్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా 40 మిలియన్లకుపైగా వసూళ్లను రాబట్టి బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. మార్షల్ ఆర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన యాక్షన్ మూవీ ఎలా ఉందంటే?
ఇద్దరూ హీరోల కథ...
మతియా ఓ జర్నలిస్ట్. చైల్డ్ ట్రాఫికింగ్ ముఠాను పట్టుకునే క్రమంలో కనిపించకుండా పోతుంది. భార్య ఆచూకీ ఎలాగైనా కనిపెట్టాలని ఆమె భర్త నవిన్ ప్రయత్నాలు చేస్తుంటాడు. వాంగ్ వెయ్ ఓ మూగ వ్యక్తి. భార్య అతడిని విడాకులు ఇస్తుంది. కూతురిని చూడటానికి హాంగ్‌కాంగ్ వస్తాడు. వాంగ్ కళ్ల ముందే అతడి కూతురిని చైల్డ్ ట్రాఫికింగ్ ముఠా కిడ్నాప్ చేస్తుంది. వారి బారి నుంచి కూతురిని వాంగ్ ఎలా కాపాడుకున్నాడు? అతడికి నవిన్ ఏ విధంగా సాయం చేశారు? చైల్డ్ ట్రాఫికింగ్‌కు కింగ్‌పిన్‌గా ఉన్న పక్లాంగ్‌తో పాటు అతడి గ్యాంగ్‌ను ఎదురించి వాంగ్, నవిన్ నవీన్ చేసిన పోరాటం ఎలాంటి మలుపులు తిరిగింది? వాంగ్ గతం ఏమిటి? అన్నదే మిగిలిన కథ.
రొటీన్ స్టోరీ కానీ...
ది ఫ్యూరియస్ మూవీ కథలో ఎలాంటి కొత్తదనం లేదు. ఎన్నో సినిమాల్లో వచ్చిన పాత పాయింట్‌నే తీసుకొని దర్శకుడు ఈ సినిమాను రూపొందించాడు. ఒకరు భార్య కోసం...మరొకరు కూతురు కోసం భయంకరమైన చైల్డ్ ట్రాఫికింగ్ ముఠాను ఇద్దరు హీరోలు ఎలా ఎదురించారు అన్నదే ఈ మూవీ కథ. స్టోరీ రొటీన్ అయినా టేకింగ్ విషయంలో కొత్తగా అడుగులు వేశాడు. మార్షల్ ఆర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో ప్రతి యాక్షన్ ఎపిసోడ్‌ను ఓ క్లైమాక్స్‌లా తీర్చిదిద్దారు. ఐస్ ఫ్యాక్టరీ ఎపిసోడ్, స్నేక్ బిల్డింగ్ ఫైట్ సీన్, క్లైమాక్స్ తో పాటు ఫైట్ క్లబ్ సీన్లు అదిరిపోతాయి. ఈ ఫైట్ సీక్వెన్స్‌లను స్టైలిష్‌గా డిజైన్ చేశారు.
థ్రిల్లింగ్....
ఎలాంటి క్లూ కూడా లేని ఈ క్రైమ్‌లో ఓ చిక్కుముడిని విప్పుకుంటూ చివరకు విలన్ ఎవరన్నది హీరోలిద్దరూ కలిసి కనిపెట్టడాన్ని థ్రిల్లింగ్‌గా చూపించారు. స్నేక్ బిల్డింగ్ నుంచి చిన్నారులను కాపాడే సన్నివేశాలు బాగున్నాయి.వాంగ్‌కు ఓ పవర్‌ఫుల్ ఫ్లాష్‌బ్యాక్ ఇస్తున్నట్లుగా అప్పుడప్పుడు ఓ హింట్ ఇస్తూ సస్పెన్స్ బిల్డ్ చేశారు. ఆ సీన్లు చూస్తుంటే లోకేష్ కనగరాజ్ ఖైదీ మూవీ గుర్తొస్తుంది.
కథ గురించి పట్టించుకోకుండా యాక్షన్ సీన్ల కోసం చూస్తే ది ఫ్యూరియస్ మంచి కిక్ ఇస్తుంది. యాక్షన్ జానర్ సినిమాలను ఇష్టపడే ఆడియెన్స్ మాత్రం మిస్సవ్వకుండా చూడాల్సిన మూవీ ఇది.
తాజావార్తలు
- ●Hyderabad | అప్పు తీర్చలేదని.. 21 రోజుల చిన్నారిని ఎత్తుకెళ్లారు
- ●Meta Platforms | మెటాకు భారీ నష్టం.. 1.4 ట్రిలియన్ డాలర్ల మేర ఎఫెక్ట్..?
- ●Kangana Ranaut | బొద్దింకలు మురికి కాలువల నుంచేగా వస్తాయి.. నేనన్నదాంట్లో తప్పేముంది..? : కంగన
- ●Indian Bank | ఇండియన్ బ్యాంకులో 700 గ్రాముల బంగారం చోరీ.. సొంతానికి వాడుకున్న అసిస్టెంట్ మేనేజర్
- ●Shakeela | నటి షకీలాకు సర్జరీ - స్మార్ట్‌ఫోన్‌కు బానిసగా మారి.... మెడ నరాలు దెబ్బతిని..
- ●Annavaram | సత్యమే దైవం.. అన్నవరంలో సత్యనారాయణుడి వైభవం

Hyderabad | అప్పు తీర్చలేదని.. 21 రోజుల చిన్నారిని ఎత్తుకెళ్లారు

Meta Platforms | మెటాకు భారీ నష్టం.. 1.4 ట్రిలియన్ డాలర్ల మేర ఎఫెక్ట్..?

Kangana Ranaut | బొద్దింకలు మురికి కాలువల నుంచేగా వస్తాయి.. నేనన్నదాంట్లో తప్పేముంది..? : కంగన

Indian Bank | ఇండియన్ బ్యాంకులో 700 గ్రాముల బంగారం చోరీ.. సొంతానికి వాడుకున్న అసిస్టెంట్ మేనేజర్



