Petrol Price | అక్కడ లీటర్ పెట్రోల్ రూ.321.. డీజిల్ ధర ఎంతంటే?
Petrol Price | ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధంతో (Iran Israel War) ప్రపంచ వ్యాప్తంగా ఇంధన కొరత ఏర్పడింది. హర్మూజ్ జలసంధిని (Strait of Hormuz) ఇరాన్ మూసివేయడంతో ఎక్కడికక్కడ చమురు రవాణా నిలిచిపోయింది.
International | Published On Mar 23, 2026, 9.39 am IST
Petrol Price | త్రినేత్ర.న్యూస్: ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధంతో (Iran Israel War) ప్రపంచ వ్యాప్తంగా ఇంధన కొరత ఏర్పడింది. హర్మూజ్ జలసంధిని (Strait of Hormuz) ఇరాన్ మూసివేయడంతో ఎక్కడికక్కడ చమురు రవాణా నిలిచిపోయింది. దీంతో చాలా దేశాలకు గ్యాస్, పెట్రోల్, డీజీల్ సరఫరా ఆగిపోయింది. ఇప్పటికే తీవ్ర ఆర్థిక సమస్యల్లో కూరుకుపోయిన పాకిస్థాన్ (Pakistan) పరిస్థితి.. మూలిగే నక్క మీద తాటిపండు పడిన చందంగా మారింది. రోజురోజుకు ఇంధన ధరలు భారీగా పెరుగుతుండటంతో ప్రజలకు మోయలేని భారంగా మారుతున్నది. ఇటీవల లీటరుకు ఒక్కసారిగా రూ.55 పెరగడంతో పెట్రోల్ ధర (Petrol Price) రూ.321 దాటింది. సాధారణంగా పెట్రోల్ కంటే తక్కువగా ఉండే డీజిల్ ధర దానిని దాటేసింది. ప్రస్తుతం అక్కడ లీటర్ డీజిల్ కొనాలంటే రూ.335.86 చెల్లించాల్సిందే. పాక్‌లో ఒకే నెలలో రెండుసార్లు ఇంధన ధరలు పెరగడం గమనార్హం.
కాగా, సాధారణ ప్రజలపై నేరుగా భారం పడకుండా విలాసవంతమైన వాహనాలను ఉపయోగించే వారిని మాత్రమే లక్ష్యంగా చేసుకుని పెట్రో ధరలు పెంచినట్లు ప్రభుత్వం తెలిపింది. అయితే ఇంధన ధరల పెరుగుదల పరోక్షంగా అన్ని రంగాలపై ప్రభావం చూసే అవకాశం ఉంటుంది.
మరోవైపు శ్రీలంకలో కూడా పెట్రో ధరలు పెరిగాయి. ప్రస్తుతం అక్కడ ఆక్టేన్ 92 పెట్రోల్ ధర లీటర్ రూ.398కి చేరింది. అదేవిధంగా ఆక్టేన్ 95 పెట్రోల్ రూ.455గా ఉంది. ఇక డీజిల్ లీటర్ రూ.382, సూపర్ డీజిల్ రూ.443, కిరోసిన్ ధర లీటరుకు రూ.255కు చేరింది.
సంబంధిత వార్తలు

Donald Trump Iran Deal | ఆ ఒప్పందం ఇక ముగిసినట్లే.. ఎలాంటి డీల్ లేదన్న ట్రంప్.. తగ్గేదే లే అంటున్న ఇరాన్
జులై 8, 2026

Strait of Hormuz | మరోసారి భగ్గుమన్న హర్మూజ్.. నౌకలపై ఇరాన్ క్షిపణి దాడులు
జులై 7, 2026

Suicide attack on Pak Coast Guard | పాక్ కోస్ట్‌గార్డ్‌పై ఆత్మాహుతి దాడి.. 30 మంది దుర్మరణం!
జులై 4, 2026
తాజావార్తలు
- ●BSNL | సరికొత్త శాటిలైట్ లాంచ్ చేసిన బీఎస్ఎన్ఎల్.. రూ.1.34లక్షల ఫోన్ ఎవరి కోసం.. ప్రత్యేకతలు ఏంటంటే..?
- ●Minister Ponnam | సమస్యల పరిష్కారం కోసం కొండా సురేఖను కలిసిన మంత్రి పొన్నం..
- ●The Furious Review | ది ఫ్యూరియస్ రివ్యూ - లోకేష్ కనగరాజ్ ఖైదీతో కంపేరిజన్స్ - యాక్షన్ లవర్స్ మిస్సవ్వొద్దు
- ●Medigadda Barrage | మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల.. ఆ మూడు లిఫ్టులు వాడితేనే సేఫ్ : రిటైర్డ్ ఇంజనీర్ల సంఘం కీలక సలహా
- ●JP Nadda | దేశానికే ఆదర్శంగా బీబీనగర్ ఎయిమ్స్ : కేంద్రమంత్రి జేపీ నడ్డా
- ●Jana Nayagan | దళపతి విజయ్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్ - జననాయగన్ సెన్సార్ కంప్లీట్ - మూడు గంటల రన్టైమ్తో రిలీజ్

BSNL | సరికొత్త శాటిలైట్ లాంచ్ చేసిన బీఎస్ఎన్ఎల్.. రూ.1.34లక్షల ఫోన్ ఎవరి కోసం.. ప్రత్యేకతలు ఏంటంటే..?

Minister Ponnam | సమస్యల పరిష్కారం కోసం కొండా సురేఖను కలిసిన మంత్రి పొన్నం..

The Furious Review | ది ఫ్యూరియస్ రివ్యూ - లోకేష్ కనగరాజ్ ఖైదీతో కంపేరిజన్స్ - యాక్షన్ లవర్స్ మిస్సవ్వొద్దు

Medigadda Barrage | మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల.. ఆ మూడు లిఫ్టులు వాడితేనే సేఫ్ : రిటైర్డ్ ఇంజనీర్ల సంఘం కీలక సలహా



