MP Vaddiraju Ravichandra | విమాన ప్రయాణీకుల భద్రతకు ఏం చర్యలు తీసుకుంటున్నారు..? కేంద్రాన్ని ప్రశ్నించిన బీఆర్ఎస్ ఎంపీ
MP Vaddiraju Ravichandra | విమాన ప్రయాణీకుల (Air Passengers) భద్రతపై కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర (MP Vaddiraju Ravichandra) పార్లమెంట్‌లో గళమెత్తారు.
MP Vaddiraju Ravichandra | త్రినేత్ర.న్యూస్ : విమాన ప్రయాణీకుల (Air Passengers) భద్రతపై కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర (MP Vaddiraju Ravichandra) పార్లమెంట్‌లో గళమెత్తారు. తరచూ విమానాలు ఆలస్యం కావడం, రద్దు కావడం వల్ల ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. దేశంలో పెరుగుతున్న విమాన ప్రయాణాలు, సాంకేతిక లోపాలు, ప్రయాణీకుల అసౌకర్యాల నేపథ్యంలో ప్రయాణీకుల భద్రతకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని ప్రశ్నించారు. విమానాల్లో క్రమశిక్షణ, ప్రయాణీకుల భద్రత, ప్రయాణికులతో సిబ్బంది మర్యాదపూర్వకంగా వ్యవహరించేలా ఏం చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలని కోరారు.
ఎంపీ ప్రశ్నకు పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి మురళీధర్ మొహోల్ (Murlidhar Kisan Mohol) స్పందించారు. ప్రయాణీకుల భద్రత, క్రమశిక్షణ కోసం డీజీసీఏ ప్రత్యేక మార్గదర్శకాలు ఉన్నాయని తెలిపారు. విమానాలు, ప్రయాణీకులు, ఆస్తుల భద్రతను నిర్థారించడం, విమానాల్లో క్రమశిక్షణ తదితర అంశాలకు సంబంధించి ప్రత్యేక విభాగాలతో పాటు స్పష్టమైన మార్గదర్శకాలు ఉన్నాయని పేర్కొన్నారు. అదేవిధంగా ప్రత్యేక అవసరాలున్న ప్రయాణీకుల కోసం క్యాబిన్ సేఫ్టీ సర్క్యులర్-01/2016 ప్రకారం మార్గదర్శకాలు అమల్లో ఉన్నట్లు చెప్పారు.
ప్రయాణీకుల నుంచి వచ్చే ఫిర్యాదులను వేగవంతంగా పరిష్కరించేందుకు గాను తమ శాఖ 24 గంటల "ప్యాసింజర్ అసిస్టెన్స్" కంట్రోల్ రూమ్‌ను అనుసంధానం చేసి విమానాల రాకపోకల సమయం, సామాన్ల భద్రత, వాటి చేరవేతలో తలెత్తిన సమస్యలు, రీఫండ్ అంశాలను డీజీసీఏ, ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా విమానయాన సంస్థలతో సమన్వయం చేస్తూ పర్యవేక్షిస్తున్నట్లు ఎంపీ రవిచంద్రకు ఇచ్చిన సమాధానంలో మంత్రి వెల్లడించారు. అదనంగా, ప్రయాణీకుల ఫిర్యాదుల సత్వర పరిష్కారం కోసం ఎయిర్ సేవా పోర్టల్, మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వివరించారు.
Also Read..
తెలుగు సినిమాలో జయం రవి - వెంకటేశ్వర స్వామిగా కోలీవుడ్ హీరో
త్రిషపై అసభ్యకర కామెంట్స్.. ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్
మార్ఫింగ్ చేస్తే జైలుకే - డీప్ ఫేక్ ఫొటోలపై మృణాల్ ఠాకూర్ వార్నింగ్
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Air Passengers | పిడిగుద్దుల వర్షం.. విమానంలో దారుణంగా కొట్టుకున్న ప్రయాణికులు
సెప్టెంబర్ 18, 2026

SpiceJet | స్పైస్‌జెట్ చోర్ హై.. ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ప్రయాణికుల ఆందోళన
సెప్టెంబర్ 15, 2026

Mallikarjun Kharge | 24 రోజులైంది.. చర్యలేవి..? వేదిక శుద్ధీకరణపై నడ్డాకు ఖర్గే లేఖ
సెప్టెంబర్ 3, 2026
తాజావార్తలు
- ●Hostel Welfare Officer | హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ రిక్రూట్మెంట్.. 9 నుంచి దరఖాస్తులు షురూ
- ●Bars Shutdown | మద్యం ప్రియులకు అలర్ట్.. రాష్ట్ర వ్యాప్తంగా బార్లు, రెస్టారెంట్లు బంద్
- ●TTD | అలిపిరి మెట్ల మార్గంలో చిరుత సంచారం.. భక్తులు అప్రమత్తంగా ఉండాలన్న టీటీడీ
- ●DGCA | రూ.2.5 లక్షల లంచం కేసు.. డీజీసీఏ డిప్యూటీ డైరెక్టర్, విమానయాన సంస్థ డైరెక్టర్ అరెస్ట్
- ●Balapur | బాలాపూర్‌లో భారీ అగ్నిప్రమాదం.. పేలిన కెమికల్ డ్రమ్ములు
- ●Separate Food | జాతరలో కుల వివక్ష.. దళితులకు విడిగా భోజనాలు

Hostel Welfare Officer | హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ రిక్రూట్మెంట్.. 9 నుంచి దరఖాస్తులు షురూ

Bars Shutdown | మద్యం ప్రియులకు అలర్ట్.. రాష్ట్ర వ్యాప్తంగా బార్లు, రెస్టారెంట్లు బంద్

TTD | అలిపిరి మెట్ల మార్గంలో చిరుత సంచారం.. భక్తులు అప్రమత్తంగా ఉండాలన్న టీటీడీ

DGCA | రూ.2.5 లక్షల లంచం కేసు.. డీజీసీఏ డిప్యూటీ డైరెక్టర్, విమానయాన సంస్థ డైరెక్టర్ అరెస్ట్



