SpiceJet | స్పైస్‌జెట్ చోర్ హై.. ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ప్రయాణికుల ఆందోళన
SpiceJet | ఢిల్లీ ఎయిర్‌పోర్టులో (Delhi airport) ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. స్పైస్‌జెట్‌కు (SpiceJet) చెందిన రెండు విమానాలు దాదాపు 24 గంటలు ఆలస్యం కావడంతో (Dubai flights delayed) ఆగ్రహించిన ప్రయాణికులు నిరసనకు దిగారు.
SpiceJet | త్రినేత్ర.న్యూస్ : లక్షలాది మంది ప్రయాణికులతో (Passengers) నిత్యం రద్దీగా ఉండే దేశ రాజధాని ఢిల్లీలోని అంతర్జాతీయ విమానాశ్రయం (Delhi airport)లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. స్పైస్‌జెట్‌కు (SpiceJet) చెందిన రెండు విమానాలు దాదాపు 24 గంటలు ఆలస్యం కావడంతో (Dubai flights delayed) ఆగ్రహించిన ప్రయాణికులు నిరసనకు దిగారు. ‘స్పైస్‌జెట్ చోర్ హై’ అంటూ నినాదాలు చేశారు. దీంతో ఎయిర్‌పోర్టులో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది.
ఇంతకీ ఏం జరిగిందంటే..?
స్పైస్‌జెట్ సంస్థకు చెందిన ఎస్‌జీ 5111, ఎస్‌జీ 5105 అనే విమానాలు ఢిల్లీ అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు నుంచి సోమవారం ఉదయం ఒకటి, సాయంత్రం మరొకటి దుబాయ్ వెళ్లాల్సి ఉంది. సోమవారం ఉదయం 7:45 గంటలకు బయల్దేరాల్సిన ఎస్‌జీ 5111 విమానం మొదట మంగళవారం ఉదయం 9:0 గంటలకు రీషెడ్యూల్ చేశారు. ఆ తర్వాత అది మధ్యాహ్నం 2 గంటలకు బయల్దేరింది. అదేవిధంగా సోమవారం సాయంత్రం 6:45 గంటలకు వెళ్లాల్సిన ఎస్‌జీ 5105 విమానాన్ని మంగళవారం మధ్యాహ్నాం 12:30 గంటలకు షెడ్యూల్ చేశారు. ఆ తర్వాత బుధవారం తెల్లవారుజామున 1 గంటలకు రీషెడ్యూల్ చేస్తున్నట్లు సంస్థ ప్రకటించింది.
ఇలా వరుస షెడ్యూల్‌తో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గంటల తరబడి ఎయిర్‌పోర్టులోనే పడిగాపులు కాయాల్సిన పరిస్థితి తలెత్తింది. సమస్యలను పరిష్కరించడానికి చాలా సేపటి వరకు స్పైస్‌జెట్ సిబ్బంది ఎవరూ అందుబాటులో లేకపోవడం ప్రయాణికులను మరింత ఆగ్రహానికి గురి చేసింది. విమానాలు ఎప్పుడు బయలుదేరుతాయనే స్పష్టత లేకపోవడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ప్రయాణికులు నిరసనకు దిగారు. స్పైస్‌జెట్‌కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ప్రయాణికులు ఆందోళన చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
విమానాలు ఆలస్యంపై ఎయిర్‌లైన్స్ క్షమాపణలు
ఢిల్లీ నుంచి దుబాయ్ వెళ్లాల్సిన రెండు విమానాలు ఆపరేషనల్ రీజన్స్ కారణంగా ఆలస్యమైనట్లు సంస్థ తెలిపింది. ఒక విమానాన్ని తాత్కాలికంగా గ్రౌండ్ చేయడం వల్లే ఈ అంతరాయం ఏర్పడిందని ప్రకటనలో స్పష్టం చేసింది. ఈ అంతరాయానికి సంస్థ క్షమాపణలు చెబుతూ.. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి విచారం వ్యక్తం చేసింది. ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చేందుకు ప్రత్యామ్నాయ విమానాలను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించింది.
Also Read..
ఖాళీల కారణంగా ట్రిబ్యునల్స్ మూతపడకూడదు.. కేంద్రానికి సుప్రీంకోర్టు కీలక సూచన
బ్రిక్స్‌లో భారత్ బ్యాలెన్సింగ్ గేమ్.. న్యూఢిల్లీకి దక్కిన దౌత్య విజయం ఇదే!
సంబంధిత వార్తలు

Air India | ఇమ్మిగ్రేషన్ తనిఖీల్లో భారీ వైఫల్యం.. ఎయిర్ ఇండియాకు షోకాజ్ నోటీసు
సెప్టెంబర్ 15, 2026

IndiGo plane hits pole | ల్యాండింగ్ వేళ పోల్‌ను ఢీ కొట్టిన విమానం.. శ్రీనగర్ ఎయిర్‌పోర్టులో ఘటన
సెప్టెంబర్ 4, 2026

Monkey Skull in Bag | ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో కలకలం.. హైదరాబాద్ ఫ్లైట్ ఎక్కే ప్రయాణికుడి బ్యాగ్‌లో ‘కోతి పుర్రె’
ఆగస్టు 12, 2026
తాజావార్తలు
- ●Errolla Srinivas | కుంభం అనిల్ రెడ్డి, ఆంక్షా రెడ్డి, బీర్ల ఐలయ్య ఎస్సీలా?
- ●Vijay Sethupathi | తమిళనాట హీట్ పెంచిన విజయ్ సేతుపతి కామెంట్లు - సీఎం విజయ్ పాలనపై కౌంటర్ అంటోన్న నెటిజన్లు
- ●Wife Drugging Rape Case | భార్యకు తెలియకుండా 20 ఏళ్లుగా డ్రగ్స్ ఇచ్చి అత్యాచారానికి పాల్పడిన భర్త
- ●September 17 | తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించాలి
- ●Crude Oil | ముడి చమురు ముప్పు.. బ్యారెల్ ధర 150 డాలర్లకు..?
- ●Tribunal Reforms | ఖాళీల కారణంగా ట్రిబ్యునల్స్ మూతపడకూడదు.. కేంద్రానికి సుప్రీంకోర్టు కీలక సూచన

Errolla Srinivas | కుంభం అనిల్ రెడ్డి, ఆంక్షా రెడ్డి, బీర్ల ఐలయ్య ఎస్సీలా?

Vijay Sethupathi | తమిళనాట హీట్ పెంచిన విజయ్ సేతుపతి కామెంట్లు - సీఎం విజయ్ పాలనపై కౌంటర్ అంటోన్న నెటిజన్లు

Wife Drugging Rape Case | భార్యకు తెలియకుండా 20 ఏళ్లుగా డ్రగ్స్ ఇచ్చి అత్యాచారానికి పాల్పడిన భర్త

September 17 | తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించాలి



