DGCA | రూ.2.5 లక్షల లంచం కేసు.. డీజీసీఏ డిప్యూటీ డైరెక్టర్, విమానయాన సంస్థ డైరెక్టర్ అరెస్ట్
DGCA | ఓ ప్రైవేట్ కంపెనీ నిర్వహించే విమానం సరైన స్థితిలోనే ఉందంటూ సర్టిఫికెట్ ఇచ్చేందుకు లంచం తీసుకుంటుండగా డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) డిప్యూటీ డైరెక్టర్ సుశీల్ కుమార్ గర్గ్‌ను సీబీఐ (CBI) అధికారులు అరెస్టు చేశారు.
DGCA | త్రినేత్ర న్యూస్: ఓ ప్రైవేట్ కంపెనీ నిర్వహించే విమానం సరైన స్థితిలోనే ఉందంటూ సర్టిఫికెట్ ఇచ్చేందుకు లంచం తీసుకుంటుండగా డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) డిప్యూటీ డైరెక్టర్ సుశీల్ కుమార్ గర్గ్‌ను సీబీఐ (CBI) అధికారులు అరెస్టు చేశారు. చెన్నైలోని (Chennai) కార్యాలయంలో రూ.2.5 లక్షలు లంచం తీసుకుంటుండగా రెడ్‌హాండెడ్‌గా పట్టుకున్నారు. ఆయనతోపాటు లంచం ఇచ్చినందుకు ఈక్వి ఎయిర్ ట్రెయినింగ్ ఆర్గనైజేషన్ ప్రైవేట్‌లిమిటెడ్ డైరెక్టర్ సచిన్ కేశవ్ భానెను కూడా అదుపులోకి తీసుకున్నారు.
ఈ సంస్థ నడిపే విమానాలకు `ఎయిర్‌వర్దినెస్ సర్టిఫికేషన్` (విమాన అర్హత ధృవీకరణ) జారీ చేయడంలో లబ్ధి చేకూర్చేందుకు సునీల్ కుమార్ నగదు డిమాండ్ చేయడంతోపాటు, ఆ మొత్తాన్ని స్వీకరించారనే ఆరోపణలతో సీబీఐ కేసు నమోదుచేసింది. దీని ప్రకారం మెసర్స్ ఈక్వి ఎయిర్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన విమానాల సర్టిఫికేషన్ (Airworthiness Certification) ప్రక్రియ కోసం సుశీల్ కుమార్ లంచం డిమాండ్ చేశారు. ఇందులో భాగంగానే ఆయన రూ. 2.5 లక్షల నగదు తీసుకున్నారు. ఈ వ్యవహారంలో గార్గ్‌తోపాటు సచిన్ కేశవ్‌ను సీబీఐ అరెస్ట్ చేసింది.
గతంలో కూడా..
గతంలోనూ ఇలాంటి ఆరోపణలో మరో డీజీసీఏ సీనియర్ అధికారిని సీబీఐ అరెస్ట్ చేసింది. డ్రోన్ల దిగుమతి అనుమతులకు సంబంధించి రూ. 2.5 లక్షల లంచం తీసుకుంటూ డీజీసీఏ ఎయిర్‌వర్దినెస్ డైరెక్టరేట్‌లో డిప్యూటీ డైరెక్టర్ జనరల్‌గా పనిచేసిన ముదవత్ దేవులా, అలాగే ఒక ప్రముఖ కార్పొరేట్ గ్రూప్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ భరత్ మాథుర్‌ను అదుపులోకి తీసుకుంది. ఈ వ్యవహారంపై ఈ ఏడాది ఏప్రిల్ 18న కేసు నమోదుచేసింది. అనంతరం ఢిల్లీలోని ఆ అధికారి, ఇతరుల నివాసాల్లో నిర్వహించిన సోదాల్లో రూ.37 లక్షల నగదు, బంగారం, వెండి నాణేలు, పలు డిజిటల్ పరికరాలను సీబీఐ అధికారులు స్వాధీనం చేసుకుంది.
తాజావార్తలు
- ●Bars Shutdown | మద్యం ప్రియులకు అలర్ట్.. రాష్ట్ర వ్యాప్తంగా బార్లు, రెస్టారెంట్లు బంద్
- ●TTD | అలిపిరి మెట్ల మార్గంలో చిరుత సంచారం.. భక్తులు అప్రమత్తంగా ఉండాలన్న టీటీడీ
- ●Balapur | బాలాపూర్‌లో భారీ అగ్నిప్రమాదం.. పేలిన కెమికల్ డ్రమ్ములు
- ●Separate Food | జాతరలో కుల వివక్ష.. దళితులకు విడిగా భోజనాలు
- ●Horoscope | అక్టోబర్ 5 రాశిఫలాలు.. సహోద్యోగులతో ఇబ్బందులు ఎదురవుతాయి!
- ●Asaduddin Owaisi Jail Allegations | చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌పై ఆరోపణలు అవాస్తవం: స్పష్టతనిచ్చిన తెలంగాణ జైళ్ల శాఖ

Bars Shutdown | మద్యం ప్రియులకు అలర్ట్.. రాష్ట్ర వ్యాప్తంగా బార్లు, రెస్టారెంట్లు బంద్

TTD | అలిపిరి మెట్ల మార్గంలో చిరుత సంచారం.. భక్తులు అప్రమత్తంగా ఉండాలన్న టీటీడీ

Balapur | బాలాపూర్‌లో భారీ అగ్నిప్రమాదం.. పేలిన కెమికల్ డ్రమ్ములు

Separate Food | జాతరలో కుల వివక్ష.. దళితులకు విడిగా భోజనాలు






