త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Balapur | బాలాపూర్‌లో భారీ అగ్నిప్ర‌మాదం.. పేలిన కెమిక‌ల్ డ్ర‌మ్ములు

Balapur | హైద‌రాబాద్ బాలాపూర్‌లోని (Balapur) న‌బిల్ కాల‌నీలో భారీ అగ్నిప్ర‌మాదం జ‌రిగింది. సోమ‌వారం తెల్ల‌వారుజామున నబిల్ కాలనీలోని ప్లాస్టిక్ గోదాంలో (Plastic Godown) ఒక్క‌సారిగా మంట‌లు అంటుకున్నాయి.

G

Hyderabad | Published On Oct 5, 2026, 7.37 am IST

Balapur | బాలాపూర్‌లో భారీ అగ్నిప్ర‌మాదం.. పేలిన కెమిక‌ల్ డ్ర‌మ్ములు
Advertisement

Balapur | త్రినేత్ర న్యూస్‌: హైద‌రాబాద్ బాలాపూర్‌లోని (Balapur) న‌బిల్ కాల‌నీలో భారీ అగ్నిప్ర‌మాదం జ‌రిగింది. సోమ‌వారం తెల్ల‌వారుజామున నబిల్ కాలనీలోని ప్లాస్టిక్ గోదాంలో (Plastic Godown) ఒక్క‌సారిగా మంట‌లు అంటుకున్నాయి. దీంతో భారీగా అగ్నికీల‌లు ఎగిసిపడ్డాయి. గోదాంలో నిల్వ ఉంచిన కెమికల్ డ్రమ్ములు (Camical Drums) భారీ శబ్ధంతో ఒక్కసారిగా పేల‌డంతో మంట‌ల ఉధృతి మ‌రింత పెరిగింది. ఈ ప్రాంతంలో ద‌ట్టంగా పొగ క‌మ్ముకున్న‌ది. స‌మాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్నారు. ఫైర్ ఇంజన్‌లతో అదుపు చేశారు.

కాగా,ఈ ప్ర‌మాదం వ‌ల్ల‌ ప్రాణన‌ష్టం జ‌రుగ‌లేద‌ని పోలీసులు తెలిపారు. ప్ర‌మాదానికి గ‌ల కార‌ణాలు ఇంకా తెలియ‌రాలేదు. అయితే షార్ట్ సర్క్యూట్ (Short Circuit) కారణంగా ఈ అగ్ని ప్రమాదం జరిగి ఉండవచ్చని చెప్పారు. ఈ అగ్ని ప్రమాదం కారణంగా కోట్లాది రూపాయిల నష్టం వాటిల్లిందని ప్లాస్టిక్ గోదాం యజమానులు వెల్లడించారు.

Advertisement
Advertisement