Separate Food | జాతరలో కుల వివక్ష.. దళితులకు విడిగా భోజనాలు
Separate Food | ఆలయ జాతరలో దళితులకు (Dalit Community) తీవ్ర అవమానం జరిగింది. దళితులకు విడిగా భోజనాలు (Separate Food) వడ్డించినట్లు వచ్చిన ఆరోపణలు తీవ్ర వివాదానికి దారితీశాయి. అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాడిన మహాత్మా గాంధీ జయంతి (Gandhi Jayanti) రోజునే ఈ ఘటన జరగడం గమనార్హం.
Separate Food | త్రినేత్ర న్యూస్: ఆలయ జాతరలో దళితులకు (Dalit Community) తీవ్ర అవమానం జరిగింది. దళితులకు విడిగా భోజనాలు (Separate Food) వడ్డించినట్లు వచ్చిన ఆరోపణలు తీవ్ర వివాదానికి దారితీశాయి. అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాడిన మహాత్మా గాంధీ జయంతి (Gandhi Jayanti) రోజునే ఈ ఘటన జరగడం గమనార్హం. కర్ణాటకలోని బాగల్‌కోట్ జిల్లా తమదద్ది గ్రామంలోని లక్ష్మీదేవి ఆలయ జాతరలో ఈ కులవివక్ష చోటుచేసుకుంది.
ఈ నెల 2న బాగల్‌కోట్ (Bagalkot) జిల్లా తేరదాల్ తాలూకాలోని తమదద్ది గ్రామంలో ఉన్న లక్ష్మీదేవి ఆలయంలో జారత (Lakshmi Devi Fair) జరిగింది. ఈ సందర్భంగా ఎగువ కులాల వారికి భోజనం పెట్టగా, దళితులకు మాత్రం విడిగా కేవలం 'గంజి' వడ్డించారు. తమకు జరిగిన అవమానంపై గ్రామానికి చెందిన బసప్ప యలదగల్.. స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అక్టోబర్ 2న జరిగిన జాతరలో తమ కమ్యూనిటీ ప్రజల కోసం విడిగా ఏర్పాట్లు చేశారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎగువ కులాల వారికి సాధారణ భోజనం వడ్డించగా, దళిత సమాజానికి చెందిన వారికి మాత్రం విడిగా కేవలం 'గంజి' (Ganji) మాత్రమే వడ్డించారని తెలిపారు. దీంతో అక్టోబర్ 3న పోలీసులు దాదాపు 20 మందిపై కేసు నమోదు చేశారు. గతంలో కూడా ఇదే గ్రామంలో `పంచకల్యాణోత్సవం` అనే ధార్మిక కార్యక్రమం సందర్భంగా ఇలాంటి ఆరోపణలే వచ్చాయి.
తాజావార్తలు
- ●Horoscope | అక్టోబర్ 5 రాశిఫలాలు.. సహోద్యోగులతో ఇబ్బందులు ఎదురవుతాయి!
- ●Asaduddin Owaisi Jail Allegations | చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌పై ఆరోపణలు అవాస్తవం: స్పష్టతనిచ్చిన తెలంగాణ జైళ్ల శాఖ
- ●Congress Govt | ఉత్తుత్తి కమిటీలేనా? 33 నెలల్లో45 కమిటీలు
- ●Harish Rao | సిద్దిపేట జిల్లాకు పదేళ్లు.. కీర్తి ఎల్లలు దాటేలా వేడుకలు చేద్దాం
- ●Ponnam Prabhakar | దేశ వ్యాప్తంగా కులగణన జరగాలి
- ●Mahesh Kumar Goud | తెలంగాణకు బీసీయే గ్యారంటీగా ముఖ్యమంత్రి అవుతాడు

Horoscope | అక్టోబర్ 5 రాశిఫలాలు.. సహోద్యోగులతో ఇబ్బందులు ఎదురవుతాయి!

Asaduddin Owaisi Jail Allegations | చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌పై ఆరోపణలు అవాస్తవం: స్పష్టతనిచ్చిన తెలంగాణ జైళ్ల శాఖ

Congress Govt | ఉత్తుత్తి కమిటీలేనా? 33 నెలల్లో45 కమిటీలు

Harish Rao | సిద్దిపేట జిల్లాకు పదేళ్లు.. కీర్తి ఎల్లలు దాటేలా వేడుకలు చేద్దాం






