Bars Shutdown | మద్యం ప్రియులకు అలర్ట్.. రాష్ట్ర వ్యాప్తంగా బార్లు, రెస్టారెంట్లు బంద్
Bars Shutdown | మద్యం ప్రియులకు బిగ్ అలర్ట్.. రాష్ట్ర వ్యాప్తంగా బార్ అండ్ రెస్టారెంట్లు (Bars Shutdown) మూతపడనున్నాయి. ప్రభుత్వం కొత్తగా తీసుకొస్తున్న ప్రివిలెజ్ సెస్‌కు (privilege cess) నిరసనగా సోమవారం బార్ అండ్ రెస్టారెంట్లు బంద్ చేయనున్నట్లు ఓనర్స్ అసోసియేషన్ ప్రకటించింది.
Bars Shutdown | త్రినేత్ర న్యూస్: మద్యం ప్రియులకు బిగ్ అలర్ట్.. రాష్ట్ర వ్యాప్తంగా బార్ అండ్ రెస్టారెంట్లు (Bars Shutdown) మూతపడనున్నాయి. ప్రభుత్వం కొత్తగా తీసుకొస్తున్న ప్రివిలెజ్ సెస్‌కు (Privilege Cess) నిరసనగా సోమవారం బార్ అండ్ రెస్టారెంట్లు బంద్ చేయనున్నట్లు బార్ అండ్ రెస్టారెంట్ ఓనర్స్ అసోసియేషన్ (Bar and Restaurant Owners Association) ప్రకటించింది. అవసరమైతే నిరవధిక బంద్‌కు కూడా వెనుకాడేది లేదని స్పష్టం చేసింది. ఇప్పటికే రూ.4 లక్షల మేరకు లైసెన్సు ఫీజు (License Fee Hikes) పెంచిన ప్రభుత్వం మళ్లీ ప్రివిలేజ్ ఫీజు పేరుతో 10 శాతం అదనంగా వసూలు చేయాలని నిర్ణయించిందని, రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తున్న ప్రివిలెజ్ సెస్‌ను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసింది.
ప్రివిలెజ్ సెస్ పేరుతో ఏటా ఒక్కో బార్ నుంచి 8 శాతం నుంచి 20 శాతం వరకు వసూలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ప్రతియేటా సుమారు రూ.30 లక్షల వరకు అదనంగా బార్లపై భారం పడుతుందని, బార్ల వార్షిక లైసెన్స్ ఫీజు పేరుతో ప్రతిఏటా ప్రభుత్వానికి రూ.33 లక్షల నుంచి రూ.56 లక్షలు చెల్లిస్తున్నామని అసోసియేషన్ సభ్యులు వాపోతున్నారు. వైన్స్‌లో పర్మినెంట్ రూమ్‌లకు (Permit Rooms) అనుమతి ఇవ్వడం.. దీనికితోడు బెల్ట్ షాపులతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని చెబుతున్నారు. ప్రభుత్వం కొత్తగా తీసుకొస్తున్న ప్రివిలెజ్ సెస్‌ను వెంటనే రద్దు చేయాలని.. లేదంటే ఎక్సైజ్ కమిషనర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు.
తాజావార్తలు
- ●TTD | అలిపిరి మెట్ల మార్గంలో చిరుత సంచారం.. భక్తులు అప్రమత్తంగా ఉండాలన్న టీటీడీ
- ●DGCA | రూ.2.5 లక్షల లంచం కేసు.. డీజీసీఏ డిప్యూటీ డైరెక్టర్, విమానయాన సంస్థ డైరెక్టర్ అరెస్ట్
- ●Balapur | బాలాపూర్‌లో భారీ అగ్నిప్రమాదం.. పేలిన కెమికల్ డ్రమ్ములు
- ●Separate Food | జాతరలో కుల వివక్ష.. దళితులకు విడిగా భోజనాలు
- ●Horoscope | అక్టోబర్ 5 రాశిఫలాలు.. సహోద్యోగులతో ఇబ్బందులు ఎదురవుతాయి!
- ●Asaduddin Owaisi Jail Allegations | చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌పై ఆరోపణలు అవాస్తవం: స్పష్టతనిచ్చిన తెలంగాణ జైళ్ల శాఖ

TTD | అలిపిరి మెట్ల మార్గంలో చిరుత సంచారం.. భక్తులు అప్రమత్తంగా ఉండాలన్న టీటీడీ

DGCA | రూ.2.5 లక్షల లంచం కేసు.. డీజీసీఏ డిప్యూటీ డైరెక్టర్, విమానయాన సంస్థ డైరెక్టర్ అరెస్ట్

Balapur | బాలాపూర్‌లో భారీ అగ్నిప్రమాదం.. పేలిన కెమికల్ డ్రమ్ములు

Separate Food | జాతరలో కుల వివక్ష.. దళితులకు విడిగా భోజనాలు






