Udhayanidhi Stalin | త్రిషపై అసభ్యకర కామెంట్స్.. ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్
Udhayanidhi Stalin | తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి విజయ్, ప్రముఖ నటి త్రిషను ఉద్దేశించి అసభ్యకర కామెంట్స్ చేసిన ప్రతిపక్షనేత, డీఎంకే నేత, మాజీ మంత్రి ఉదయనిధి స్టాలిన్ (Udhayanidhi Stalin)ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Udhayanidhi Stalin | త్రినేత్ర.న్యూస్ : తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి విజయ్, ప్రముఖ నటి త్రిషను ఉద్దేశించి అసభ్యకర కామెంట్స్ చేసిన ప్రతిపక్షనేత, డీఎంకే నేత, మాజీ మంత్రి ఉదయనిధి స్టాలిన్ (Udhayanidhi Stalin)ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణ నిమిత్తం ఆయన్ని పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఆయన్ని స్టేషన్‌ను తరలించే క్రమంలో స్టాలిన్ నివాసం వద్ద డీఎంకే కార్యకర్తలు, పోలీసుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
కాగా, కావేరీ జలాల వివాదం తమిళనాడులో హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. ఈ అంశంపై (Cauvery protest) సోమవారం తంజావూరులో జరిగిన నిరసన ర్యాలీలో ఉదయనిధి స్టాలిన్ పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి విజయ్‌పై విమర్శలు గుప్పించారు. రైతుల ప్రయోజనాలను కాపాడటంలో టీవీకే ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందంటూ మండిపడ్డారు. ఆ సమయంలో నటి త్రిష (actor Trisha)ను ఉద్దేశించి ద్వంద్వార్థం వచ్చేలా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ సమయంలో డీఎంకే కార్యకర్తలు త్రిష ప్రస్తావన తెచ్చారు. త్రిష, త్రిష అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. వారిని నిలువరించాల్సిన ఉదయనిధి నవ్వుతూ తన ప్రసంగాన్ని కొనసాగించారు.
ఉదయనిధి వ్యాఖ్యలపై టీవీకే నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రతిపక్ష నేత వ్యాఖ్యలు మహిళల గౌరవానికి భంగం కలిగించేలా ఉన్నాయంటూ టీవీకే మహిళా విభాగం తంజావూరు తూర్పు పోలీసు స్టేషన్, జాతీయ మహిళా కమిషన్‌కు అధికారికంగా ఫిర్యాదు చేసింది. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఇవాళ ఉదయం చెన్నైలోని నీలాంకరై నివాసంలో ఉదయనిధిని అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు, ఉదయనిధి ముందస్తు బెయిల్ కోసం మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. మధ్యాహ్నం ఈ పిటిషన్‌పై విచారణ జరగనుంది.
Also Read..
మార్ఫింగ్ చేస్తే జైలుకే - డీప్ ఫేక్ ఫొటోలపై మృణాల్ ఠాకూర్ వార్నింగ్
క్లోజింగ్ వేలం ఎఫెక్ట్.. నిఫ్టీకి భారీ షాక్, ఐటీ షేర్లపై ఒత్తిడి..
ఇస్త్రీ చేస్తుండగా కాలిన షేర్వాణీ.. రూ. 14 వేలు జరిమానా విధించిన కోర్టు
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Janhvi Kapoor | ఆమె శరీరం...ఆమె నిర్ణయం...డీప్‌ఫేక్ వీడియోలపై జాన్వీకపూర్ రియాక్షన్ - తెలుగు డైరెక్టర్లపై సెటైర్స్!
- ●Kavitha | సింగరేణి లాభాల్లో కార్మికులకు వాటా వెంటనే ప్రకటించాలి: కవిత
- ●Stock Markets | స్టాక్ మార్కెట్లకు జోష్.. సెన్సెక్స్ 490 పాయింట్లు జంప్..
- ●Hostel Welfare Officer | హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ రిక్రూట్మెంట్.. 9 నుంచి దరఖాస్తులు షురూ
- ●Bars Shutdown | మద్యం ప్రియులకు అలర్ట్.. రాష్ట్ర వ్యాప్తంగా బార్లు, రెస్టారెంట్లు బంద్
- ●TTD | అలిపిరి మెట్ల మార్గంలో చిరుత సంచారం.. భక్తులు అప్రమత్తంగా ఉండాలన్న టీటీడీ

Janhvi Kapoor | ఆమె శరీరం...ఆమె నిర్ణయం...డీప్‌ఫేక్ వీడియోలపై జాన్వీకపూర్ రియాక్షన్ - తెలుగు డైరెక్టర్లపై సెటైర్స్!

Kavitha | సింగరేణి లాభాల్లో కార్మికులకు వాటా వెంటనే ప్రకటించాలి: కవిత

Stock Markets | స్టాక్ మార్కెట్లకు జోష్.. సెన్సెక్స్ 490 పాయింట్లు జంప్..

Hostel Welfare Officer | హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ రిక్రూట్మెంట్.. 9 నుంచి దరఖాస్తులు షురూ






