Mallikarjun Kharge | 24 రోజులైంది.. చర్యలేవి..? వేదిక శుద్ధీకరణపై నడ్డాకు ఖర్గే లేఖ
Mallikarjun Kharge | హల్ద్వానీలో వేదిక శుద్ధీకరణ ఘటనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కేంద్ర మంత్రి జేపీ నడ్డాకు (JP Nadda ) కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) లేఖ రాశారు. ఈ ఘటన జరిగి ఇప్పటికి 24 రోజులైందని గుర్తు చేశారు. ఇప్పటికీ చర్యలు తీసుకోకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు.
Mallikarjun Kharge | త్రినేత్ర.న్యూస్ : కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) పాల్గొన్న ఓ వేదికను శుద్ధి చేయడం రాజకీయ దుమారం రేపుతోంది. ఈ ఘటనపై ఖర్గే సహా ప్రతిపక్ష నేత రాహుల్ సైతం ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో శుద్ధీకరణ ఘటనపై కేంద్ర మంత్రి జేపీ నడ్డా (JP Nadda )కు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే తాజాగా లేఖ రాశారు.
ఉత్తరాఖండ్ హల్ద్వానీలో జరిగిన 'శుద్ధీకరణ' ఘటనలో పాల్గొన్న వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ఘటన జరిగి ఇప్పటికి 24 రోజులైందని గుర్తు చేశారు. అయినా, ఇప్పటికే బాధ్యులపై ఎలాంటి చర్యలూ తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సదరు వ్యక్తులపై కనీసం FIR కూడా నమోదు చేయకపోవడం పట్ల ఖర్గే ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
ఈ అంశాన్ని తాను వర్షాకాల సమావేశాల సందర్భంగా రాజ్యసభలో లేవనెత్తినప్పుడు.. శుద్దీకరణ ఘటనపై చర్యలు తీసుకుంటామని నడ్డా హామీ ఇచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా ఖర్గే గుర్తు చేశారు. ఈ అంశం కేవలం తన వ్యక్తిగతమో, కాంగ్రెస్‌కు సంబంధించనదో కాదన్నారు. ఇది కోట్లాది మంది మనోభావాలతో ముడిపడిన అంశమని చెప్పారు. రాజ్యసభలో ఇచ్చిన హామీ ప్రకారం.. హల్ద్వానీలో తన సభ తర్వాత జరిగిన శుద్ధీకరణ కార్యక్రమంలో పాల్గొన్న వ్యక్తులు, సంస్థలపై FIR నమోదు చేసేలా ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిని ఆదేశించాలని నడ్డాను కోరారు.
ఖర్గే పాల్గొన్న వేదిక శుద్ధీకరణ..
కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఇటీవలే ఉత్తరాఖండ్ (Uttarakhand )లోని హల్ద్వానీ (Haldwani)లో రామ్‌లీలా మైదనాం (Ram Lila Ground)లో నిర్వహించిన విజయ్ శంఖనాద్ ర్యాలీకి హాజరై ప్రసంగించారు. అయితే, ఈ కార్యక్రమం అనంతరం రెండు రోజుల తర్వాత శ్రీరామ సేన అనే సంస్థ అక్కడ శుద్ధీకరణ హోమం నిర్వహించింది. ఈ వ్యవహారం రాజకీయంగా దుమారం రేపింది. ఈ ఘటనపై దళిత సంఘాలు, విపక్షాల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి.
ఈ అంశంపై ఖర్గే సైతం పార్లమెంట్ వేదికగా తీవ్రంగా స్పందించారు. "ఈ దేశంలో దళితులకు స్థానం లేదని మేము మొదటి నుంచీ చెబుతూనే ఉన్నాము. వారు (బీజేపీని ఉద్దేశిస్తూ పరోక్షంగా) దేశాన్ని విభజించడానికి ప్రతి ఒక్కరినీ మతాల పేరుతో విడగొడుతున్నారు. అక్కడ శుద్ధి కార్యక్రమం చేయాల్సిన అవసరం ఏముంది?" అని రాజ్యసభలో ఖర్గే ప్రశ్నించారు. ఈ ఘటన తనకు చాలా అవమానకంగా అనిపించిందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇలాంటి చర్యలను బీజేపీ సమర్థించదు.. నడ్డా
ఖర్గే వ్యాఖ్యలు ఎగువసభలో తీవ్రమైన చర్చకు దారి తీశాయి. ఖర్గే ఆరోపణలపై కేంద్ర మంత్రి జేపీ నడ్డా (JP Nadda) తీవ్రంగా స్పందించారు. ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు. ఈ సంఘటన చాలా దురదృష్టకరమని.. ఇలాంటి చర్యలను బీజేపీ ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థించదని స్పష్టం చేశారు. ఈ ఘటనతో బీజేపీ సభ్యులకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. దీనిపై సమగ్ర విచారణ జరిపిస్తామని ఆయన హామీ ఇచ్చారు. తప్పు చేసిన వారు ఎవరైనా సరే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
Also Read..
ఎయిర్‌ఫోర్స్‌కు బాలాకోట్ దాడుల హీరో అభినందన్ వీడ్కోలు.. ప్రైవేట్ పైలట్‌గా కొత్త జర్నీ
పంజాబ్ ఓటరు జాబితా నుంచి రాఘవ్ చద్ధా పేరు మాయం.. ఆప్ ప్రభుత్వంపై ఆరోపణలు
సస్పెండైన డీఎస్పీ భీమ్‌రెడ్డికి ఈడీ షాక్.. మనీలాండరింగ్ కేసు నమోదు
సంబంధిత వార్తలు

Konda Surekha | సుశ్మిత వ్యాఖ్యలతో నాకు సంబంధం లేదు.. తెగేసి చెప్పిన మంత్రి కొండా సురేఖ
సెప్టెంబర్ 2, 2026

Char Dham Yatra | చార్ధామ్ Helicopter యాత్రకు ఎలా నమోదు చేసుకోవాలో తెలుసా?
సెప్టెంబర్ 2, 2026

Kharge | లైట్స్.. కెమెరా.. ఇన్‌యాక్షన్‌లా ఆర్థిక వ్యవస్థపై ప్రచారం.. ప్రధాని మోదీపై ఖర్గే సెటైర్లు..!
సెప్టెంబర్ 1, 2026
తాజావార్తలు
- ●Razor Blades | బ్లేడ్లు మింగిన బాలుడు.. తొలగించిన ఉస్మానియా వైద్యులు..
- ●DK Aruna | కొండా సురేఖను తప్పిస్తే చాలా బాధేసింది: బీజేపీ ఎంపీ డీకే అరుణ
- ●Arpitha Nursing Home | గర్భసంచి ఆపరేషన్‌కు వెళ్తే.. మహిళ కిడ్నీ తొలగింపు
- ●Murder Case | చేతబడి అనుమానంతో రియల్ ఎస్టేట్ వ్యాపారి హత్య.. మైనర్ సహా ఏడుగురు నిందితులు అరెస్ట్
- ●Sri Krishnashtami | చిన్ని కృష్ణుడిగా సీఎం విజయ్ - రామ్‌చరణ్ ఇంట కృష్ణాష్టమి వేడుకలు - ఫొటోలపై ఓ లుక్కేయండి...
- ●Congress Party | కేసీఆర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని.. కాంగ్రెస్ పార్టీ మహా ధర్నా

Razor Blades | బ్లేడ్లు మింగిన బాలుడు.. తొలగించిన ఉస్మానియా వైద్యులు..

DK Aruna | కొండా సురేఖను తప్పిస్తే చాలా బాధేసింది: బీజేపీ ఎంపీ డీకే అరుణ

Arpitha Nursing Home | గర్భసంచి ఆపరేషన్‌కు వెళ్తే.. మహిళ కిడ్నీ తొలగింపు

Murder Case | చేతబడి అనుమానంతో రియల్ ఎస్టేట్ వ్యాపారి హత్య.. మైనర్ సహా ఏడుగురు నిందితులు అరెస్ట్



