త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

TTD | అలిపిరి మెట్ల మార్గంలో చిరుత సంచారం.. భక్తులు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌న్న టీటీడీ

TTD | అలిపిరి మెట్ల మార్గంలో మ‌రోసారి చిరుత (Leopard) క‌ల‌క‌లం సృష్టించింది. సోమ‌వారం తెల్ల‌వారుజామున న‌డ‌క మార్గంలో చిరుత క‌నిపించింది. దీంతో క‌లియుగ ప్ర‌త్య‌క్ష‌దైవం తిరుమ‌ల శ్రీవెంకేట‌శ్వ‌ర స్వామివారి ద‌ర్శ‌నానికి వెళ్లే భ‌క్తుల‌కు టీటీడీ (TTD) హెచ్చ‌రిక‌లు జారీచేసింది.

G

National | Published On Oct 5, 2026, 9.14 am IST

TTD | అలిపిరి మెట్ల మార్గంలో చిరుత సంచారం.. భక్తులు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌న్న టీటీడీ
Advertisement

TTD | త్రినేత్ర న్యూస్‌: అలిపిరి మెట్ల మార్గంలో మ‌రోసారి చిరుత (Leopard) క‌ల‌క‌లం సృష్టించింది. సోమ‌వారం తెల్ల‌వారుజామున న‌డ‌క మార్గంలో చిరుత క‌నిపించింది. దీంతో క‌లియుగ ప్ర‌త్య‌క్ష‌దైవం తిరుమ‌ల శ్రీవెంకేట‌శ్వ‌ర స్వామివారి ద‌ర్శ‌నానికి వెళ్లే భ‌క్తుల‌కు టీటీడీ (TTD) హెచ్చ‌రిక‌లు జారీచేసింది. అలిపిరి (Alipiri) నుంచి తిరుమ‌ల వెళ్లే మెట్ల మార్గంలో చిరుత పులి సంచ‌రిస్తుండడంతో అప్రమత్తంగా ఉండాలని కోరింది.

సోమవారం తెల్లవారుజామున సుమారు 2 గంటల స‌మ‌యంలో అలిపిరి నడక మార్గంలోని మెకాలిమిట్ట ప్రాంతంలో మెట్ల పక్కన కనిపించింది. ఆ సమయంలో భక్తుల రాకపోకలు తక్కువగా ఉండటంతో పెను ప్రమాదం తప్పింది. ఆ దృశ్యాలు అధికారుల చేతికి చిక్కాయి. దాని కదలికలను గుర్తించిన అధికారులు అప్రమత్తమయ్యారు. నడక మార్గంలో వెళ్లే భక్తులు మరింత జాగ్రత్తగా ఉండాలని, గుంపులుగా వెళ్లాలని సూచించారు.

శ్రీవారిని దర్శించుకున్న శిఖ‌ర్ ధావ‌న్‌, ద‌ర్శ‌కుడు బోయ‌పాటి

టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్, టాలీవుడ్ ద‌ర్శ‌కుడు బోయ‌పాటి శ్రీనివాస్ తిరుమ‌ల‌ శ్రీవారిని ద‌ర్శించుకున్నారు. సోమ‌వారం ఉద‌యం వీఐపీ బ్రేక్ స‌మ‌యంలో శిఖ‌ర్‌ ధావ‌న్ త‌న‌ సతీమణి సోఫీ షైన్‌తో క‌లిసి వేంక‌టేశ్వ‌రుడిని దర్శించుకున్నారు. అనంతరం వారు సుప్రభాతసేవలో పాల్గొన్నారు.

అదేవిధంగా ద‌ర్శ‌కుడు బోయ‌పాటి శ్రీను కూడా శ్రీవారిని ద‌ర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ.. ఈ నెలాఖరు లోగా నూతన ప్రాజెక్ట్‌ని ప్రకటిస్తాని చెప్పారు. ప్రాజెక్ట్ ప్రారంభానికీ ముందు శ్రీవారి ఆశీస్సులు పొందాన‌ని, అఖండా 3 కూడా ఉంటుందని తెలిపారు. దీనికి సంబంధించి స‌రైన సమయంలో బాలకృష్ణతో కలిసి వివరాలు ప్రకటిస్తామ‌ని వెల్ల‌డించారు. అవకాశం వస్తే చిరంజీవి, బాలకృష్ణతో మల్టీ స్టారర్ సినిమా కచ్చితంగా చేస్తాన‌న్నారు.

Advertisement
Advertisement