Jayam Ravi | తెలుగు సినిమాలో జయం రవి – వెంకటేశ్వర స్వామిగా కోలీవుడ్ హీరో
కోలీవుడ్ హీరో జయం రవి ఓ స్ట్రెయిట్ తెలుగు సినిమాకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. మంచు మనోజ్ హీరోగా వడ్డీ కాసుల వాడ పేరుతో ఓ ఫన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమాలో వెంకటేశ్వర స్వామి పాత్రలో జయం రవి నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
Entertainment | Published On Aug 4, 2026, 11.45 am IST
Jayam Ravi | విడాకుల, వ్యక్తిగత జీవితంలోని వివాదాలతో గత కొద్ది రోజులుగా ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు జయం రవి. విడాకులు ప్రక్రియ పూర్తయ్యే వరకు తాను సినిమాలకు దూరంగా ఉండబోతున్నట్లు ఇటీవల ప్రకటించాడు. ఎమోషనల్‌గా తీసుకున్న నిర్ణయమంటూ బ్రేక్‌పై కొద్ది రోజుల్లోనే యూటర్న్ తీసుకున్నాడు. ప్రస్తుతం తమిళంలో హీరోగా ఓ మూడు సినిమాలు చేస్తోన్న జయం రవి ఓ స్ట్రెయిట్ తెలుగు మూవీకి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.
వడ్డీ కాసులవాడ...
మంచు మనోజ్ హీరోగా వడ్డీకాసులవాడ పేరుతో ఫన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మూవీ రాబోతుంది. మంచు మనోజ్ బర్త్‌డే సందర్భంగా ఇటీవల ఈ మూవీని అఫీషియల్‌గా అనౌన్స్‌చేశారు. తేజ్ ఉప్పలపాటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు అనిల్ సుంకర ప్రొడ్యూస్ చేస్తున్నారు. త్వరలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానున్నట్లు సమాచారం.
వెంకటేశ్వర స్వామి...
వడ్డీ కాసులవాడ సినిమాలో వెంకటేశ్వర స్వామి పాత్ర కీలకంగా ఉండబోతున్నట్లు తెలిసింది ఈ పాత్ర కోసం పలువురు స్టార్ హీరోల పేర్లను పరిశీలించిన మేకర్స్ చివరకు జయం రవిని ఫైనల్ చేసినట్లు సమాచారం. త్వరలోనే జయం రవి లుక్‌ను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు చెబుతున్నారు. మంచు మనోజ్, జయం రవి కాంబినేషన్‌లో వచ్చే సీన్లు అదిరిపోతాయని టాక్ వినిపిస్తోంది. ఈ ఏడాది చివరలో వడ్డీ కాసులవాడ రిలీజ్ కానున్నట్లు సమాచారం.
చైల్డ్ యాక్టర్...
సుమన్, కృష్ణంరాజు హీరోలుగా నటించిన బావబావమరిది సినిమాతో చైల్డ్ యాక్టర్‌గా జయం రవి కెరీర్ మొదలైంది. ఈ సినిమాను జయం రవి తండ్రి ఎడిటర్ మోహన్ నిర్మించారు. ఇందులో చిన్ననాటి సుమన్ పాత్రలో జయం రవి కనిపించాడు. లాంగ్ గ్యాప్ తర్వాత మళ్లీ వడ్డీ కాసులవాడతో టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు.
ఫస్ట్ టైమ్ మెగా ఫోన్
ప్రస్తుతం జీనీ, కరాటే బాబు సినిమాల్లో హీరోగా నటిస్తున్నాడు జయం రవి. ఆర్డినరీ మ్యాన్ సినిమాతో ఫస్ట్ టైమ్ మెగా ఫోన్ పట్టబోతున్నాడు. ఈ సినిమాలో యోగిబాబు కీలక పాత్రలో కనిపించబోతున్నాడు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Meghamsh Srihari | మిస్టరీ డెత్ కేసుతో శ్రీహరి కొడుకు మూవీ – ట్రెండింగ్‌లో ఆస్మాన్ టీజర్
సెప్టెంబర్ 17, 2026

Ramya Krishnan | కమల రెడ్డిగా శివగామి – మంచు మనోజ్ సినిమాలో పవర్ఫుల్ రోల్
సెప్టెంబర్ 15, 2026

Jayam Ravi | వెంకటేశ్వరస్వామిగా జయం రవి – మంచు మనోజ్ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ
సెప్టెంబర్ 10, 2026
తాజావార్తలు
- ●Janhvi Kapoor | ఆమె శరీరం...ఆమె నిర్ణయం...డీప్‌ఫేక్ వీడియోలపై జాన్వీకపూర్ రియాక్షన్ - తెలుగు డైరెక్టర్లపై సెటైర్స్!
- ●Kavitha | సింగరేణి లాభాల్లో కార్మికులకు వాటా వెంటనే ప్రకటించాలి: కవిత
- ●Stock Markets | స్టాక్ మార్కెట్లకు జోష్.. సెన్సెక్స్ 490 పాయింట్లు జంప్..
- ●Hostel Welfare Officer | హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ రిక్రూట్మెంట్.. 9 నుంచి దరఖాస్తులు షురూ
- ●Bars Shutdown | మద్యం ప్రియులకు అలర్ట్.. రాష్ట్ర వ్యాప్తంగా బార్లు, రెస్టారెంట్లు బంద్
- ●TTD | అలిపిరి మెట్ల మార్గంలో చిరుత సంచారం.. భక్తులు అప్రమత్తంగా ఉండాలన్న టీటీడీ

Janhvi Kapoor | ఆమె శరీరం...ఆమె నిర్ణయం...డీప్‌ఫేక్ వీడియోలపై జాన్వీకపూర్ రియాక్షన్ - తెలుగు డైరెక్టర్లపై సెటైర్స్!

Kavitha | సింగరేణి లాభాల్లో కార్మికులకు వాటా వెంటనే ప్రకటించాలి: కవిత

Stock Markets | స్టాక్ మార్కెట్లకు జోష్.. సెన్సెక్స్ 490 పాయింట్లు జంప్..

Hostel Welfare Officer | హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ రిక్రూట్మెంట్.. 9 నుంచి దరఖాస్తులు షురూ



