Raju Kumar Singh | వైద్యురాలి మృతి కేసు.. బీజేపీ ఎమ్మెల్యేకి నాలుగేళ్లు జైలు శిక్ష
Raju Kumar Singh | గాల్లోకి కాల్పులు జరిపి ఓ వైద్యురాలి మరణానికి కారణమైన కేసులో బీహార్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే (BJP MLA) రాజు కుమార్ సింగ్ (Raju Kumar Singh)కు ఢిల్లీ కోర్టు నాలుగేళ్లు సాధారణ జైలు శిక్ష విధించింది. శిక్షతోపాటూ రూ.25 లక్షల జరిమానా కూడా విధించింది.
Raju Kumar Singh | బీహార్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే (BJP MLA) రాజు కుమార్ సింగ్ (Raju Kumar Singh)కు ఢిల్లీ కోర్టు షాకిచ్చింది. 2018 న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ సందర్భంగా జరిగిన ఫైరింగ్‌లో (celebratory firing) వైద్యురాలు అర్చనా గుప్తా మృతి చెందిన కేసులో ఆయన్ని దోషిగా తేల్చింది. ఈ మేరకు ఆయనకు నాలుగేళ్లు సాధారణ జైలు శిక్ష విధిస్తూ శనివారం తీర్పు ఇచ్చింది. శిక్షతోపాటూ రూ.25 లక్షల జరిమానా కూడా విధించింది. ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి విశాల్ గొగ్నే ఈ తీర్పు వెలువరించారు. జరిమానా మొత్తాన్ని మృతురాలు అర్చనా గుప్తా కుటుంబానికి పరిహారంగా చెల్లించాలని ఆదేశించారు.
అసలేం జరిగిందంటే..?
2018 డిసెంబరు 31న అర్ధరాత్రి ఢిల్లీలోని ఫతేపూర్ బేరీ (Fatehpur Beri) ప్రాంతంలో ఉన్న రాజు కుమార్ సింగ్ ఫామ్‌హౌస్‌లో నూతన సంవత్సర వేడుకలు (New Year celebration) నిర్వహించారు. ఈ సందర్భంగా రాజు కుమార్ తన లైసెన్స్ గన్‌తో గాల్లోకి కాల్పులు జరిపారు. ఈ పార్టీకి వచ్చిన అతిథుల్లో ఒకరైన అర్చనా గుప్తాకు బుల్లెట్ తగలడంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అర్చనా గుప్తా ప్రాణాలు కోల్పోయారు. లైసెన్స్ నిబంధనలు ఉల్లంఘించడంతోపాటూ ఒకరి మరణానికి కారమైనందుకు రాజు కుమార్ సింగ్‌పై కేసు నమోదైంది.
ఈ కేసుపై ఢిల్లీ కోర్టు విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా రాజు కుమార్ సింగ్ తరఫున న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించారు. ఎమ్మెల్యేకి ఎవరినీ చంపే ఉద్దేశం లేదని.. గతంలోనూ ఆయనపై ఎలాంటి నేరచరిత్ర లేదని పేర్కొంటూ ప్రొబేషన్‌పై విడుదల చేయాలని కోరారు. అయితే నేర తీవ్రతను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం.. ఎమ్మెల్యేకు శిక్ష ఖరారు చేసింది. పండుగలు, వేడుకల సమయంలో హర్షధ్వానాల పేరిట జరిపే కాల్పులు ఒక మహమ్మారి లాంటివని కోర్టు అభిప్రాయపడింది. ఇవి దేశంలో తరచూ ప్రాణనష్టానికి కారణమవుతున్నాయని పేర్కొంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Brij Bhushan Sharan Singh | రెజ్లర్లపై లైంగిక వేధింపుల ఆరోపణలు.. బ్రిజ్ భూషణ్‌కు ఢిల్లీ హైకోర్టు భారీ ఊరట
ఆగస్టు 3, 2026

BJP MLA | బీజేపీ ఎమ్మెల్యేపై కోడిగుడ్లతో దాడి.. పీసీసీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత
జులై 23, 2026

Sukesh Chandrashekhar | ఆర్థిక నేరగాడు సుకేశ్ చంద్రశేఖర్‌కు బెయిల్.. అయినా జైలులోనే..!
ఏప్రిల్ 7, 2026
తాజావార్తలు
- ●Nepal Floods | నేపాల్‌లో వరదలు.. తెలంగాణ వాసులకు హెల్ప్ లైన్ ఏర్పాటు
- ●Khelo India Youth Games | డిసెంబర్లో తెలంగాణలో.. ‘ఖేలో ఇండియా యూత్ గేమ్స్’ 8 వ ఎడిషన్!
- ●CP Sajjanar | సరికొత్త హైబ్రిడ్ సైబర్ ఫ్రాడ్.. సెల్‌ఫోన్ చోరీలతో బ్యాంక్ ఖాతాలు ఖాళీ
- ●MLA Maheshwar Reddy | రెవెన్యూ మంత్రి పొంగులేటిని బర్తరఫ్ చేయండి.. రాహుల్ గాంధీకి బీజేఎల్పీ నేత లేఖ
- ●Oil Palm Hub | సూర్యాపేటలో ఇంటిగ్రేటెడ్ ఆయిల్‌పామ్ హబ్ ఏర్పాటుకు రిలయన్స్ ఆసక్తి
- ●Minister Jupally Krishna Rao | శ్రీలంక - తెలంగాణ మధ్య పర్యాటక బంధానికి మరింత ఊతం

Nepal Floods | నేపాల్‌లో వరదలు.. తెలంగాణ వాసులకు హెల్ప్ లైన్ ఏర్పాటు

Khelo India Youth Games | డిసెంబర్లో తెలంగాణలో.. ‘ఖేలో ఇండియా యూత్ గేమ్స్’ 8 వ ఎడిషన్!

CP Sajjanar | సరికొత్త హైబ్రిడ్ సైబర్ ఫ్రాడ్.. సెల్‌ఫోన్ చోరీలతో బ్యాంక్ ఖాతాలు ఖాళీ

MLA Maheshwar Reddy | రెవెన్యూ మంత్రి పొంగులేటిని బర్తరఫ్ చేయండి.. రాహుల్ గాంధీకి బీజేఎల్పీ నేత లేఖ



