Vinesh Phogat | ఆసియా గేమ్స్ ట్రయల్స్ వివాదం.. రెజ్లింగ్ ఫెడరేషన్‌పై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం..
Vinesh Phogat | భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ చుట్టూ నెలకొన్న వివాదం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. రాబోయే ఆసియా గేమ్స్‌కు సంబంధించిన సెలక్షన్స్ నేపథ్యంలో రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా తీసుకున్న నిర్ణయంపై ఢిల్లీ హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.
Vinesh Phogat | భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ చుట్టూ నెలకొన్న వివాదం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. రాబోయే ఆసియా గేమ్స్‌కు సంబంధించిన సెలక్షన్స్ ట్రయల్స్ నేపథ్యంలో రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా తీసుకున్న నిర్ణయంపై ఢిల్లీ హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. గొండాలో నిర్వహించే నేషనల్ ఓపెన్ ర్యాంకింగ్ టోర్నమెంట్‌లో పాల్గొనేందుకు వినేశ్ ఫొగాట్‌కు డబ్ల్యూఎఫ్‌ఐ అనుమతి నిరాకరించింది. రిటైర్మెంట్ అనంతరం తిరిగి బరిలోకి దిగే క్రీడాకారులకు వర్తించే యాంటీ డోపింగ్ నిబంధనల ప్రకారం.. ఆరు నెలల నోటీస్ వ్యవధి తప్పనిసరి అని పేర్కొంటూ.. వినేశ్‌ను జూన్ 26 వరకు పోటీల్లో పాల్గొనకుండా అనర్హురాలిగా ప్రకటించింది.
ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ వినేశ్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ సందర్భంగా విచారణ చేపట్టిన ప్రధాన న్యాయమూర్తి డీకే ఉపాధ్యాయ, జస్టిస్ తేజస్ కారియా ధర్మాసనం డబ్ల్యూఎఫ్‌ఐ తీరుపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అంతర్జాతీయ స్థాయిలో దేశానికి పేరు తీసుకొచ్చిన క్రీడాకారిణిని పోటీలకు దూరంగా ఉంచడం సరైన విధానం కాదని కోర్టు అభిప్రాయపడింది. ప్రముఖ క్రీడాకారులకు అవకాశాలు నిరాకరించడం అనేక సందేహాలకు తావిస్తోందని వ్యాఖ్యానించింది. ఆసియా గేమ్స్ సెలక్షన్ ట్రయల్స్‌లో వినేశ్ ఫొగాట్‌కు అవకాశం కల్పించాలని డబ్ల్యూఎఫ్‌ఐను కోర్టు ఆదేశించింది. అదే సమయంలో ప్రత్యేక నిపుణుల కమిటీని ఏర్పాటు చేసి వినేశ్ ఫిట్‌నెస్, అర్హతలపై సమీక్ష చేయాలని సూచించింది. ప్రత్యేక సందర్భాల్లో అర్హత ప్రమాణాల్లో సడలింపులు ఇవ్వొచ్చని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నిబంధనలు అనుమతిస్తున్నాయని వినేశ్ తరఫు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.
విచారణ సందర్భంగా కోర్టు చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. “వినేశ్ 2025 జూలైలో తల్లైంది. ఇప్పుడు మే 2026లో ఆమెను అనర్హురాలిగా ప్రకటిస్తున్నారు. ఈ దేశంలో మాతృత్వాన్ని గౌరవంగా చూస్తాం. అది ఒక క్రీడాకారిణికి నష్టంగా మారకూడదు. వ్యక్తిగత విభేదాలు ఏవైనా ఉన్నా, వాటితో క్రీడలకు నష్టం జరుగకూడదు” అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. డబ్ల్యూఎఫ్‌ఐ తీసుకున్న నిర్ణయంపై క్రీడా వర్గాల్లోనూ చర్చ సాగుతోంది. దేశానికి పతకాలు అందించిన రెజ్లర్‌కు మరో అవకాశం ఇవ్వాల్సిందేనని పలువురు మాజీ క్రీడాకారులు సైతం అభిప్రాయపడుతున్నారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●UPI Transaction Charges 2026 | నాడు 'జీరో'.. నేడు ఫీజు బాదుడు.. ఉచితం అంటూ అలవాటు చేసి.. ఇప్పుడు యూపీఐకీ రుసుమా?
- ●T20 Cricket | స్మృతి మంధాన సరికొత్త రికార్డు.. టీ20ల్లో చరిత్ర
- ●Kavitha | రాజకీయం అంటే బూతులేనా..? కోస్గి సభలో కాంగ్రెస్ ప్రభుత్వంపై కవిత ఫైర్..
- ●Maithili Thakur | రోల్స్ రాయిస్‌లో ఎమ్మెల్యే.. ట్రోలింగ్‌పై కంగనా ఫైర్..
- ●Ukraine Biggest Attack | మాస్కోపై 1,600కుపైగా డ్రోన్లతో విరుచుకుపడిన ఉక్రెయిన్..!
- ●Delhi SIR | ఎస్ఐఆర్లో ప్రముఖులకూ షాక్.. అద్వానీ, కేజ్రీవాల్ సహా పలువురికి నోటీసులు..!

UPI Transaction Charges 2026 | నాడు 'జీరో'.. నేడు ఫీజు బాదుడు.. ఉచితం అంటూ అలవాటు చేసి.. ఇప్పుడు యూపీఐకీ రుసుమా?

T20 Cricket | స్మృతి మంధాన సరికొత్త రికార్డు.. టీ20ల్లో చరిత్ర

Kavitha | రాజకీయం అంటే బూతులేనా..? కోస్గి సభలో కాంగ్రెస్ ప్రభుత్వంపై కవిత ఫైర్..

Maithili Thakur | రోల్స్ రాయిస్‌లో ఎమ్మెల్యే.. ట్రోలింగ్‌పై కంగనా ఫైర్..



