PJTAU | బీఎస్సీ అగ్రికల్చర్‌లో 60 స్పాన్సర్డ్ సీట్లు.. ఈనెల 8 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు..
PJTAU | మహాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ గురుకుల విద్యాసంస్థల సొసైటీ ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం (PJTAU) అనుబంధ కళాశాలల్లో బీఎస్సీ (ఆనర్స్) అగ్రికల్చర్ కోర్సులో 60 స్పాన్సర్డ్ సీట్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సొసైటీ కార్యదర్శి బడుగు సైదులు తెలిపారు.
PJTAU | మహాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ గురుకుల విద్యాసంస్థల సొసైటీ ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం (PJTAU) అనుబంధ కళాశాలల్లో బీఎస్సీ (ఆనర్స్) అగ్రికల్చర్ కోర్సులో 60 స్పాన్సర్డ్ సీట్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సొసైటీ కార్యదర్శి బడుగు సైదులు తెలిపారు. ఈనెల 8వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని, 13వ తేదీతో గడువు ముగుస్తుందని శనివారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.
ఇంటర్మీడియట్‌లో బైపీసీ గ్రూపులో ఉత్తీర్ణత సాధించడంతోపాటు, తెలంగాణ ఈఏపీసెట్–2026 (TG EAPCET–2026)లో అర్హత సాధించిన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు తెలంగాణకు చెందిన బీసీ విద్యార్థులై ఉండాలి. మహాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ బీసీ గురుకుల జూనియర్ కళాశాలల్లో చదివినవారు లేదా బీసీ సంక్షేమ వసతి గృహాల్లో ఉంటూ ఇంటర్మీడియట్ విద్యను అభ్యసించిన విద్యార్థులు మాత్రమే అర్హులని తెలిపారు. అభ్యర్థుల తల్లిదండ్రుల వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షలకు మించకూడదు. దరఖాస్తు రుసుము రూ.200 ఆన్‌లైన్ పేమెంట్ గేట్‌వే ద్వారా చెల్లించాలి. అవసరమైన ధ్రువపత్రాలను దరఖాస్తుతోపాటు అప్‌లోడ్ చేయాలి. అభ్యర్థుల ఎంపిక ఈఏపీసెట్–2026 ర్యాంకుల ఆధారంగా చేపడతారు.
ఆసక్తి గల విద్యార్థులు ప్రాస్పెక్టస్, దరఖాస్తు కోసం https://ug.mjptbcwreis.net లేదంటే https://mjptbcwreis.telangana.gov.in వెబ్‌సైట్లను సందర్శించాలని సైదులు సూచించారు. మరిన్ని వివరాలకు కార్యాలయ పనిదినాల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు 040–23328266 నంబరులో హెల్ప్‌డెస్క్‌ను సంప్రదించవచ్చు. అలాగే mjpadmissioncell@gmail.com కు ఈ-మెయిల్ పంపించి వివరాలు తెలుసుకోవచ్చని కార్యదర్శి సైదులు సూచించారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Surekha Vani | డిలీట్ చేయండి లేదంటే లీగల్ యాక్షన్ - సురేఖా వాణి వార్నింగ్
- ●RTC Lands | హౌసింగ్ బోర్డుకు ముషీరాబాద్ ఆర్టీసీ భూములు.. జీవో జారీ చేసిన సర్కారు..
- ●New Cheyutha Pensions | దీపావళి కానుకగా కొత్తగా చేయూత పింఛన్లు.. రేపు సీఎం చేతుల మీదుగా పంపిణీ
- ●KCR | తెలంగాణ ప్రజలకు కేసీఆర్ దీపావళి శుభాకాంక్షలు
- ●Maheshkumar Goud | నామినేటెడ్ పోస్టుల భర్తీపై కసరత్తు చేస్తున్నం
- ●CM Revanth Reddy | పదేళ్లలో పాలమూరుకు కేసీఆర్ చేసిందేమీ లేదు

Surekha Vani | డిలీట్ చేయండి లేదంటే లీగల్ యాక్షన్ - సురేఖా వాణి వార్నింగ్

RTC Lands | హౌసింగ్ బోర్డుకు ముషీరాబాద్ ఆర్టీసీ భూములు.. జీవో జారీ చేసిన సర్కారు..

New Cheyutha Pensions | దీపావళి కానుకగా కొత్తగా చేయూత పింఛన్లు.. రేపు సీఎం చేతుల మీదుగా పంపిణీ

KCR | తెలంగాణ ప్రజలకు కేసీఆర్ దీపావళి శుభాకాంక్షలు



