Karimnagar Robbery | కరీంనగర్ భారీ దోపిడీ కేసులో ట్విస్ట్
Karimnagar Robbery | Karimnagar Robbery | త్రినేత్ర.న్యూస్: కరీంనగర్‌లోని భగత్ నగర్‌కు చెందిన అజ్మత్ అలీ అనే వృద్ధుడి ఇంట్లో భారీ చోరీ (Karimnagar Robbery) జరిగింది. అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడిన దుండగులు ఆయుధాలతో బెదిరించి ఇంట్లో ఉన్న 66 తులాల బంగారం, రూ.21 లక్షల నగదు, 10 తులాల వెండి ఎత్తుకెళ్లారు.
Karimnagar Robbery | త్రినేత్ర.న్యూస్: కరీంనగర్‌లోని భగత్ నగర్‌కు చెందిన అజ్మత్ అలీ అనే వృద్ధుడి ఇంట్లో భారీ చోరీ (Karimnagar Robbery) జరిగింది. అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడిన దుండగులు ఆయుధాలతో బెదిరించి ఇంట్లో ఉన్న 66 తులాల బంగారం, రూ.21 లక్షల నగదు, 10 తులాల వెండి ఎత్తుకెళ్లారు. వెళ్తూవెళ్తూ రెండు మోటారు సైకిళ్లను కూడా తీసుకెళ్లారు. ఇది తెలిసినవాళ్లు చేసిన పనేనని, తమ పెద్ద అల్లుడిపైనే తమకు అనుమానం ఉందని ఇంటి యజమాని పోలీసులకు తెలిపారు.
అజ్మత్ అలీ (Azmath Ali) కుటుంబం భగత్ సింగ్ చౌరస్తాలోని ఓ ఇంట్లో మొదటి అంతస్తులో నివాసం ఉంటోంది. నిద్రకు ఉపక్రమించే ముందు.. రోజూలాగే కింది ఫ్లోర్‌లో ఉన్న లైట్ బంద్ చేసేందుకు వృద్ధుడు కిందకు వెళ్తుండగా.. అప్పటికే అక్కడ మాటువేసి దుండగులు అతడిని బంధించారు. అరవకుండా నోటిని మూసివేసి తల, ముఖంపై గట్టిగా కొట్టారు. అనంతరం అతని భార్య, ఇద్దరు కుమార్తెల పైకూడా దాడిచేశారు. అరిస్తే చంపేస్తామని తుపాకులు, కత్తులతో బెదిరించారు.
అందరినీ కట్టేసి ఇంట్లో ఉన్న 66 తులాల బంగారం, రూ.21లక్షల నగదు, 10 తులాల వెండి ఎత్తుకు వెళ్లారు. మొబైల్ ఫోన్లు, పార్క్ చేసి ఉన్న రెండు బైకులను కూడా తీసుకెళ్లారు. కాగా, పెద్ద అల్లుడిపైనే (Son-in-law) అజ్మత్ అలీ అనుమానం వ్యక్తం చేశారు. వచ్చిన వ్యక్తులు ఉత్తరాది హింది భాష మాట్లాడారని, తన అల్లుడు సైతం ఉత్తరప్రదేశ్‌కు చెందిన వాడని వెల్లడించారు. నిందుతులు వేములవాడ బైపాస్ మీదుగా వెళ్లినట్లు అనుమానిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్ దృశ్యాలను పరిశీలిస్తున్నారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
సంబంధిత వార్తలు

Sarnath | 28 ఏళ్ల నిరీక్షణకు తెర.. సారనాథ్‌కు యునెస్కో వారసత్వ కట్టడంగా గుర్తింపు
జులై 25, 2026

Gold And Silver Prices Today | స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. పెట్టుబడిదారులకు అలర్ట్..
జులై 25, 2026

Gold And Silver Prices Today | యుద్ధం ఎఫెక్ట్.. పెట్టుబడిదారుల్లో ఆందోళన.. భారీగా పతనమైన బంగారం ధరలు..
జులై 24, 2026
తాజావార్తలు
- ●Healthcare in Germany | భర్తకు కంటి ఇన్ఫెక్షన్.. వారం తర్వాత అపాయింట్మెంట్: జర్మనీ హెల్త్‌కేర్‌పై భారతీయ మహిళ ఆవేదన
- ●Vande Mataram 150 | 150 మంది దివ్యాంగులతో అక్షర అద్భుతం: రవీంద్రభారతిలో రోమాలు నిక్కబొడుచుకునే 'వందేమాతరం' ప్రదర్శన!
- ●Liver Disease Awareness | మీ లివర్ సేఫేనా? కాలేయ వ్యాధులపై డాక్టర్ సోమశేఖర్ రావు 'ఆఖరి హెచ్చరిక' బుక్ లాంచ్!
- ●BRS Party | కర్ణాటక అక్రమ చెక్‌డ్యాంల పరిశీలనకు బీఆర్ఎస్ బృందం..!
- ●Sri Lanka Tour | బుమ్రా ఫిట్‌నెస్‌పై ఉత్కంఠ.. వచ్చే వారం శ్రీలంక టూర్‌కు జట్టు ఎంపిక..!
- ●Revanth Reddy Speech | 58 ఇంచుల ఛాతీని ఓడించిన 'జెన్-జీ' యువత

Healthcare in Germany | భర్తకు కంటి ఇన్ఫెక్షన్.. వారం తర్వాత అపాయింట్మెంట్: జర్మనీ హెల్త్‌కేర్‌పై భారతీయ మహిళ ఆవేదన

Vande Mataram 150 | 150 మంది దివ్యాంగులతో అక్షర అద్భుతం: రవీంద్రభారతిలో రోమాలు నిక్కబొడుచుకునే 'వందేమాతరం' ప్రదర్శన!

Liver Disease Awareness | మీ లివర్ సేఫేనా? కాలేయ వ్యాధులపై డాక్టర్ సోమశేఖర్ రావు 'ఆఖరి హెచ్చరిక' బుక్ లాంచ్!

BRS Party | కర్ణాటక అక్రమ చెక్‌డ్యాంల పరిశీలనకు బీఆర్ఎస్ బృందం..!



