త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

RTC Lands | హౌసింగ్ బోర్డుకు ముషీరాబాద్ ఆర్టీసీ భూములు.. జీవో జారీ చేసిన స‌ర్కారు..

RTC Lands | నగరంలో పేద, మధ్యతరగతి ప్రజలకు అందుబాటు ధరల్లో ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. ముషీరాబాద్‌ మండలం జాంబిస్తాన్‌పూర్‌లోని 6 ఎకరాల 15 గుంటల ప్రభుత్వ భూమిని తెలంగాణ హౌసింగ్‌ బోర్డు (టీజీహెచ్‌బీ)కి కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

P

Telangana | Published On Nov 7, 2026, 7.26 pm IST

RTC Lands | హౌసింగ్ బోర్డుకు ముషీరాబాద్ ఆర్టీసీ భూములు.. జీవో జారీ చేసిన స‌ర్కారు..
Advertisement

RTC Lands | నగరంలో పేద, మధ్యతరగతి ప్రజలకు అందుబాటు ధరల్లో ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. ముషీరాబాద్‌ మండలం జాంబిస్తాన్‌పూర్‌లోని 6 ఎకరాల 15 గుంటల ప్రభుత్వ భూమిని తెలంగాణ హౌసింగ్‌ బోర్డు (టీజీహెచ్‌బీ)కి కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ భూమిలో అత్య‌ల్పాదాయ‌, మధ్య ఆదాయ వర్గాల‌కు ఇండ్లు నిర్మించి ఇవ్వ‌నుంది. ఈ మేరకు రెవెన్యూ (ల్యాండ్‌ అడ్మినిస్ట్రేషన్‌–III) శాఖ జీవో చేసింది.

ఆర్టీసీ ఆధీనంలోని భూమి..

ముషీరాబాద్‌ మండలం జాంబిస్తాన్‌పూర్‌ గ్రామ పరిధిలోని వార్డు నంబర్‌ 154లో బ్లాక్‌–ఏ, సీ, డీకి చెందిన పలు సర్వే నంబర్లలో ఈ భూములున్నాయి. జాంబిస్తాన్‌పూర్‌ డిపో, ఆర్టీసీ ఎక్స్‌ రోడ్డుకు సమీపంలోని ఈ భూమి ప్రస్తుతం టీజీఎస్‌ఆర్టీసీ ఆధీనంలో ఉన్న‌ది. మొత్తం 6.15 ఎకరాల్లో 0.25 గుంటల భూమిని ప్రతిపాదిత భూమి నుంచి మానిటైజేషన్‌ కోసం కేటాయించారు. మిగిలిన భూమిని గృహ నిర్మాణ కార్యక్రమానికి వినియోగించనున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా లక్ష ఇళ్ల లక్ష్యం..

రాష్ట్రవ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లో లక్ష ఎల్‌ఐజీ, ఎంఐజీ అందుబాటు ధరల గృహాలను నిర్మించేందుకు ప్రభుత్వం ఇప్పటికే సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. ఈ మేరకు 2026 మే 29న జారీ చేసిన జీవో నంబర్‌ 23 ద్వారా అనుమతులు మంజూరు చేసింది. ఇందులో భాగంగా పైలట్‌ ప్రాజెక్టుగా 12 వేల ఇళ్ల నిర్మాణ బాధ్యతను తెలంగాణ హౌసింగ్‌ బోర్డుకు అప్పగించింది. ఈ నేపథ్యంలో జాంబిస్తాన్‌పూర్‌లో భూమి కేటాయింపు ప్రాధాన్యం సంతరించుకుంది. భూమి కేటాయింపునకు సంబంధించి అవసరమైన చర్యలు తీసుకోవాలని హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌, భూ పరిపాలన ప్రధాన కమిషనర్‌ను ప్రభుత్వం ఆదేశించింది.

Advertisement
Advertisement