Ramchander Rao | భారత్‌ను బంగ్లాదేశ్‌లా మార్చాలని చూస్తున్నారా..?
Ramchander Rao | దేశంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న నిరసనలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు నిప్పులు చెరిగారు. భారత్‌ను నేపాల్, బంగ్లాదేశ్‌లా మార్చాలని చూస్తున్నారా..? అని కాంగ్రెస్ పార్టీని, రాహుల్ గాంధీని సూటిగా ప్రశ్నించారు.
రాహుల్ గాంధీని ప్రశ్నించిన బీజేపీ చీఫ్ రామచందర్ రావు
Ramchander Rao | త్రినేత్ర న్యూస్ : దేశంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న నిరసనలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు నిప్పులు చెరిగారు. భారత్‌ను నేపాల్, బంగ్లాదేశ్‌లా మార్చాలని చూస్తున్నారా..? అని కాంగ్రెస్ పార్టీని, రాహుల్ గాంధీని సూటిగా ప్రశ్నించారు.
“భారత్ పరిస్థితి నేపాల్, బంగ్లాదేశ్‌ల కంటే మరింత దారుణంగా మారుతుంది” అంటూ వ్యాఖ్యానించడం ద్వారా జార్ఖండ్ మంత్రి ఇర్ఫాన్ అన్సారీ ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీ అసలు ఉద్దేశాలను బయటపెట్టారని రామచందర్ రావు తెలిపారు. SIR, ఎన్నికల సంస్కరణలు కేవలం సాకులు మాత్రమే. వాస్తవానికి, కాంగ్రెస్ పార్టీ మరోసారి బుజ్జగింపు రాజకీయాలను ప్రోత్సహిస్తూ దేశాన్ని ముక్కలు చేయడానికి ప్రయత్నిస్తోంది. కాంగ్రెస్ మంత్రి ప్రస్తావిస్తున్న ఆ 40 లక్షల మంది ఎవరు? వారు బంగ్లాదేశ్ అక్రమ చొరబాటుదారులా? అని ప్రశ్నించారు.
దేశంలోని ప్రతి ఒక్క అక్రమ చొరబాటుదారుడిని గుర్తించి, దేశం నుంచి బహిష్కరించాలనే దృఢ సంకల్పానికి భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉంది. మరోవైపు, ఈ అక్రమ చొరబాటుదారుల అండతో దేశంలో ‘Regime Change’ తీసుకురావాలని కాంగ్రెస్ పార్టీ కలలు కంటోంది అని రామచందర్ రావు అన్నారు.
సంబంధిత వార్తలు

TGSPDCL | కొత్త విద్యుత్ కనెక్షన్ ఇక ఈజీ.. TGSPDCL ఆన్లైన్ పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోండిలా..!
నవంబర్ 6, 2026

Bhupalapally | వివాహేతర సంబంధం.. ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య
నవంబర్ 6, 2026

Ala Venkateshwer Reddy | క్రాప్ హాలిడే ఇస్తే.. కాంగ్రెస్‌కు కూడా ప్రజలు సెలవిస్తారు
నవంబర్ 6, 2026
తాజావార్తలు
- ●TGSPDCL | కొత్త విద్యుత్ కనెక్షన్ ఇక ఈజీ.. TGSPDCL ఆన్లైన్ పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోండిలా..!
- ●Supreme Court | ఢిల్లీ వెదర్‌ను ఆస్వాదిస్తున్నారని అనుకుంటున్నా.. కాలుష్య సంక్షోభంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
- ●Dasoju Sravan Kumar Ekta Mall | ఏక్తా మాల్ కాదు.. 'దోపిడీ మాల్'
- ●Scene Movie Review | సూర్య సీన్ రివ్యూ - అంధుడైన హీరో... వంద హత్యలు చేసిన కిల్లర్‌ను ఎలా పట్టుకున్నాడంటే?
- ●Nifty 50 | దీపావళి ముహూరత్ ట్రేడింగ్‌లో నిఫ్టీ.. 11 ఏళ్లలో 9 సార్లు లాభాలే..
- ●Bhupalapally | వివాహేతర సంబంధం.. ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య

TGSPDCL | కొత్త విద్యుత్ కనెక్షన్ ఇక ఈజీ.. TGSPDCL ఆన్లైన్ పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోండిలా..!

Supreme Court | ఢిల్లీ వెదర్‌ను ఆస్వాదిస్తున్నారని అనుకుంటున్నా.. కాలుష్య సంక్షోభంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

Dasoju Sravan Kumar Ekta Mall | ఏక్తా మాల్ కాదు.. 'దోపిడీ మాల్'

Scene Movie Review | సూర్య సీన్ రివ్యూ - అంధుడైన హీరో... వంద హత్యలు చేసిన కిల్లర్‌ను ఎలా పట్టుకున్నాడంటే?



