త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

New Cheyutha Pensions | దీపావళి కానుకగా కొత్తగా చేయూత పింఛన్లు.. రేపు సీఎం చేతుల మీదుగా పంపిణీ

New Cheyutha Pensions | రేపు దీపావళి (Diwali) పండుగను పుర‌స్క‌రించుకొని రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన మరో 4.5 లక్షల మందికి కొత్తగా చేయూత పింఛన్లు (New Cheyutha Pensions) అందించనుంది.

S

Telangana | Published On Nov 7, 2026, 7.26 pm IST

New Cheyutha Pensions | దీపావళి కానుకగా కొత్తగా చేయూత పింఛన్లు.. రేపు సీఎం చేతుల మీదుగా పంపిణీ
Advertisement
  • ఈ నెల నుంచే నూతన లబ్ధిదారులకు చెల్లింపులు

New Cheyutha Pensions త్రినేత్ర న్యూస్: రేపు దీపావళి (Diwali) పండుగను పుర‌స్క‌రించుకొని రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన మరో 4.5 లక్షల మందికి కొత్తగా చేయూత పింఛన్లు (New Cheyutha Pensions) అందించనుంది. కొడంగల్ నియోజ‌క‌వ‌ర్గంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా రేపు నూతన పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి డా.దనసరి అనసూయ సీతక్క ఈ కార్యక్ర‌మానికి హాజ‌రు కానున్న‌ట్లు అధికార వ‌ర్గాలు తెలిపాయి.

వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, నేత కార్మికులు, గీత కార్మికులు తదితర వర్గాల్లోని అర్హులైన వారికి కొత్తగా పింఛన్లు మంజూరు చేయనున్నారు. ముఖ్యమంత్రి కొంతమంది నూతన లబ్ధిదారులకు రేపు పింఛన్ల మంజూరు పత్రాలను అందజేస్తారు. అనంతరం రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారుల చేతుల మీదుగా అర్హులైన లబ్ధిదారులకు మంజూరు పత్రాలను పంపిణీ చేస్తారు. కొత్తగా పింఛన్లు మంజూరైన వారందరికీ ఈ నెల నుంచే పింఛను మొత్తాన్ని అందించనున్నారు.

Advertisement
Advertisement