Gold And Silver Prices Today | ఒక్క రోజులోనే రూ.22వేలు పెరిగిన బంగారం ధర.. కొనుగోళ్లకు పెట్టుబడిదారుల ఆసక్తి..
Gold And Silver Prices Today | మధ్య ప్రాచ్యంలో కొనసాగుతున్న యుద్ధం కారణంగా ఈక్విటీ మార్కెట్లు మళ్లీ నష్టాల్లోకి చేరాయి. అంతర్జాతీయ మార్కెట్లతోపాటు దేశీయ సూచీలు సైతం భారీ నష్టాల్లో ఉన్నాయి. అయితే గత కొద్ది రోజులుగా ఇలాంటి పరిస్థితులే ఉన్నప్పటికీ పెట్టుబడిదారులు మాత్రం బంగారం, వెండి కొనుగోళ్ల పట్ల ఆసక్తిని చూపించలేదు.
Gold And Silver Prices Today | మధ్య ప్రాచ్యంలో కొనసాగుతున్న యుద్ధం కారణంగా ఈక్విటీ మార్కెట్లు మళ్లీ నష్టాల్లోకి చేరాయి. అంతర్జాతీయ మార్కెట్లతోపాటు దేశీయ సూచీలు సైతం భారీ నష్టాల్లో ఉన్నాయి. అయితే గత కొద్ది రోజులుగా ఇలాంటి పరిస్థితులే ఉన్నప్పటికీ పెట్టుబడిదారులు మాత్రం బంగారం, వెండి కొనుగోళ్ల పట్ల ఆసక్తిని చూపించలేదు. కానీ ప్రస్తుతం మళ్లీ అలాంటి పరిస్థితులే ఏర్పడిన నేపథ్యంలో ఈసారి అవకాశాన్ని వదులుకోవడం లేదు. ఆయా లోహాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిని కనబరుస్తున్నారు. దీంతో బంగారం, వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. ఇక అంతర్జాతీయ మార్కెట్లలో బుధవారం ఔన్స్ బంగారం ధర ఏకంగా 1.14 శాతం మేర ఎగబాకి 4,123 డాలర్లకు చేరగా, వెండి ధర 1.42 శాతం పెరిగి 59 డాలర్లకు చేరింది. దేశీయ కమోడిటీ మార్కెట్ ఎంసీఎక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ కాంట్రాక్టు 1703 పాయింట్లు పెరిగి 1,44,586కు చేరగా, సిల్వర్ ఫ్యూచర్స్ కాంట్రాక్టు 2,391 పాయింట్ల మేర ఎగసి 2,26,170 వద్దకు వచ్చింది. ఇక దేశీయ స్పాట్ మార్కెట్‌లోనూ బంగారం, వెండి ధరలు ఒక్క రోజులోనే భారీగా పెరిగాయి.
స్పాట్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు..
24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.14,651 ఉండగా, 8 గ్రాముల ధర రూ.1,17, 208గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,46,510 గా ఉంది. 100 గ్రాముల బంగారం ధర రూ.14,65,100 గా ఉంది. ఇది కిందటి రోజు ముగింపుతో పోలిస్తే రూ.22,900 పెరిగింది.
22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.13,430 ఉండగా, 8 గ్రాముల ధర రూ.1,07,440గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,34,300 ఉండగా, 100 గ్రాముల బంగారం ధర రూ.13,43,000గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.21వేలు పెరిగింది.
18 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.10,988 ఉండగా, 8 గ్రాముల ధర రూ.87,904గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,09,880 ఉండగా, 100 గ్రాముల బంగారం ధర రూ.10,98,800గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.17,200 పెరిగింది.
దేశీయ మార్కెట్‌లో 1 కిలో వెండి ధర రూ.2,40,000 ఉండగా, తులం ధర రూ.2,400గా ఉంది. క్రితం ముగింపుతో పోలిస్తే వెండి ధర కిలోకు రూ.5వేలు పెరిగింది. హైదరాబాద్‌లో 1 కిలో వెండి ధర రూ.2,45,000 ఉండగా, తులం ధర రూ.2,450 గా ఉంది.
సంబంధిత వార్తలు

Gold And Silver Prices Today | స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. పెట్టుబడిదారులకు అలర్ట్..
జులై 25, 2026

Gold And Silver Prices Today | యుద్ధం ఎఫెక్ట్.. పెట్టుబడిదారుల్లో ఆందోళన.. భారీగా పతనమైన బంగారం ధరలు..
జులై 24, 2026

Gold And Silver Prices Today | బంగారానికి మళ్లీ పెరుగుతున్న డిమాండ్.. పెట్టుబడులకు ఇదే మంచి చాన్స్..?
జులై 23, 2026
తాజావార్తలు
- ●Kukatpally | క్రికెట్ ఆడటానికి వెళ్తూ.. కానరాని లోకాలకు..
- ●Komuravelli Railway Station | సాకారమైన దశాబ్దాల కల.. నేడు కొమురెల్లి మల్లన్న రైల్వే స్టేషన్ ప్రారంభం..
- ●Jurala Project | జూరాలను తాకిన కృష్ణమ్మ.. కాలువలకు నీరు విడుదల చేస్తారా?
- ●Pralhad Joshi | నూతన విద్యాశాఖ మంత్రి ఏం చదువుకున్నారంటే?
- ●Cheruvugattu | చెరువుగట్టులో భారీ అగ్నిప్రమాదం.. 15 దుకాణాలు అగ్నికి ఆహుతి
- ●Vemulawada Rajanna Temple | ఎములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి మరో 99.40 కోట్లు విడుదల

Kukatpally | క్రికెట్ ఆడటానికి వెళ్తూ.. కానరాని లోకాలకు..

Komuravelli Railway Station | సాకారమైన దశాబ్దాల కల.. నేడు కొమురెల్లి మల్లన్న రైల్వే స్టేషన్ ప్రారంభం..

Jurala Project | జూరాలను తాకిన కృష్ణమ్మ.. కాలువలకు నీరు విడుదల చేస్తారా?

Pralhad Joshi | నూతన విద్యాశాఖ మంత్రి ఏం చదువుకున్నారంటే?



