త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Rahul Gandhi | ఇది ఓట్ల చోరీ కాదు.. హక్కుల చోరీ.. ఓటర్ ఐడీతో సంక్షేమ పథకాల‌పై రాహుల్ విమ‌ర్శ‌లు

Rahul Gandhi | సంక్షేమ పథకాల ప్ర‌యోజ‌నాల‌ను పొందడానికి (welfare benefits) ఓటర్ ఐడీ కార్డును (voter ID) ప్రాతిపదికగా మార్చాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై రాహుల్ గాంధీ (Rahul Gandhi) తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇది కేవలం ఓట్ల చోరీ మాత్రమే కాదని, ప్రజల హక్కులను హరించే కుట్ర అని ఆరోపించారు. ఓటు వేయడం అనేది పౌరుడికి రాజ్యాంగ హక్కు అని, అది ఒక ష‌ర‌తు కాద‌ని రాహుల్ నొక్కి చెప్పారు. పేదవారి పింఛనును వారి ఓటరు గుర్తింపు కార్డుతో ముడిపెట్టడం సరికాదని స్పష్టం చేశారు.

D

National | Published On Nov 6, 2026, 3.15 pm IST

Rahul Gandhi | ఇది ఓట్ల చోరీ కాదు.. హక్కుల చోరీ.. ఓటర్ ఐడీతో సంక్షేమ పథకాల‌పై రాహుల్ విమ‌ర్శ‌లు
Advertisement

Rahul Gandhi | త్రినేత్ర న్యూస్ : సంక్షేమ పథకాల ప్ర‌యోజ‌నాల‌ను పొందడానికి (welfare benefits) ఆధార్ స్థానంలో ఓటర్ ఐడీ కార్డును ప్రాతిపదికగా మార్చాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై (BJP government) కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇది కేవలం ఓట్ల చోరీ మాత్రమే కాదని, ప్రజల హక్కులను హరించే కుట్ర అని ఆరోపించారు. పంచాయతీరాజ్ పథకాల లబ్ధిదారుల గుర్తింపునకు, చెల్లింపులకు ఇకపై ఆధార్ కార్డు స్థానంలో ఓటర్ ఐడీ (EPIC) నంబర్‌తో పాటు బయోమెట్రిక్ ప్రామాణీకరణ తప్పనిసరి అని కేంద్రమంత్రి లలన్‌సింగ్ ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ఇందుకు సంబంధించిన వీడియోని రాహుల్ త‌న ఎక్స్‌లో షేర్ చేశారు.

ఒకవైపు ఓటర్ల జాబితా ప్రత్యేక స‌మ‌గ్ర‌ సవరణ (SIR) ప్రక్రియ ద్వారా లక్షలాది మంది పేర్లు గల్లైపోతుంటే.. మరోవైపు సంక్షేమ పథకాలను ఓటర్ల జాబితాతో ముడిపెట్టాలని ప్రభుత్వం కుట్ర పన్నుతోందని రాహుల్ ఆరోపించారు. ముఖ్యంగా బీజేపీని వ్యతిరేకిస్తున్న వారి పేర్లను ఉద్దేశపూర్వకంగానే ఓటర్ల జాబితా నుంచి తొలగిస్తున్నారని మండిప‌డ్డారు. "ఓటు పోతే - హక్కులు పోయినట్లే" అనే విధంగా పరిస్థితి త‌యారైంద‌ని విమ‌ర్శించారు. ఈ రోజు పంచాయతీరాజ్ పథకాలతో మొదలుపెట్టి, రేపు రేషన్, పెన్షన్లు, ఉపాధి హామీ (MGNREGA), ఇళ్లు, స్కాలర్‌షిప్‌లు, రిజర్వేషన్లకు కూడా ఓటర్ ఐడీని తప్పనిసరి చేస్తారా..? అని రాహుల్ ప్రశ్నించారు.

ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్‌ కుమార్ బీజేపీతో కుమ్మక్కై ఓటర్ల జాబితాలను ప్రభుత్వానికి అనుకూలంగా మారుస్తున్నారని ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో ఓటు వేయడం అనేది పౌరుడి రాజ్యాంగ హక్కు అని, అది ఒక ష‌ర‌తు కాద‌ని రాహుల్ నొక్కి చెప్పారు. పేదవారి పింఛనును వారి ఓటరు గుర్తింపు కార్డుతో ముడిపెట్టడం సరికాదని స్పష్టం చేశారు. ఇది ఎన్నికల్లో గెలవడానికి చేసే రాజకీయం కాద‌ని.. ఎన్నికలను దొంగిలించడానికి, అధికారంలో శాశ్వతంగా కొనసాగడానికి చేస్తున్న కుట్ర అని రాహుల్‌ తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. ఈ హక్కుల చోరీని తాము ఎట్టిపరిస్థితుల్లోనూ జరగనివ్వబోమని తేల్చిచెప్పారు. మ‌రోవైపు ఓట్ చోరీ అనేది కేవ‌లం ట్రైల‌ర్ మాత్ర‌మేన‌ని.. అస‌లైన సినిమా హ‌క్కుల చోరీ అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేష్ విమ‌ర్శించారు.

Also Read..

అమితాబ్‌, బాంబే హైకోర్టు, బీఎస్ఈకి వ‌రుస బాంబు బెదిరింపులు.. ముంబైలో హై అల‌ర్ట్‌

నల్లాల్లో నీళ్లు బంద్.. 2.35 లక్షల ట్యాంకర్లే సర్కార్ ఘనతా?

పిల్లల భవిష్యత్తు కోసం ‘నెస్ట్‌వెస్ట్’.. ఏడాదికి కేవలం రూ.29కే పెట్టుబడి సలహాలు..

Advertisement
Advertisement