Uday Krishna Reddy | మేమిద్దరం పెండ్లి చేసుకోవాలనుకున్నాం.. కానీ ఆమె మరొకరిని వివాహం చేసుకుంది..
Uday Krishna Reddy | 2025 జూన్ నుంచి తామిద్దరం రిలేషన్‌లో ఉన్నామని, వివాహం కూడా చేసుకోవాలనుకున్నామని ఉదయ్ కృష్ణారెడ్డి (Uday Krishna Reddy) వెల్లడించారు. ఆమెకు ఆర్థికంగా కూడా సహాయం చేశానన్నారు. కానీ ఆమె ఓ ఐఏఎస్ ఆఫీసర్‌ను పెండ్లి చేసుకుందని చెప్పారు. ఆమెకు వివాహం అయిన తర్వాత కూడా తమ ఇద్దరి మధ్య శారీరకంగా, భావోద్వేగపరంగా సంబంధం కొనసాగిందని తెలిపారు.
Uday Krishna Reddy | త్రినేత్ర.న్యూస్: నేషనల్ పోలీసు అకాడమీలో(NPA) మహిళా ట్రైనీ ఐపీఎస్‌పై లైంగిక వేధింపుల కేసు రోజుకో మలుపు తిరుగుతున్నది. టైనీ ఐపీఎస్ ఎం. దుయ్ కృష్ణారెడ్డి (Uday Krishna Reddy) తనను బ్లాక్‌మెయిల్ చేస్తున్నారని, లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడని కర్ణాటకకు చెందిన వివాహిత అయిన మహిళా ట్రైనీ ఐపీఎస్ (Trainee IPS) ఆరోపించిన విషయం తెలిసిందే. అయితే 2025 జూన్ నుంచి తామిద్దరం రిలేషన్‌లో ఉన్నామని, వివాహం కూడా చేసుకోవాలనుకున్నామని ఉదయ్ కృష్ణారెడ్డి వెల్లడించారు. ఆమెకు ఆర్థికంగా కూడా సహాయం చేశానన్నారు. కానీ ఆమె ఓ ఐఏఎస్ ఆఫీసర్‌ను పెండ్లి చేసుకుందని చెప్పారు. మళ్లీ అనుబంధాన్ని కొనసాగించాలని తనను కోరుతూ వచ్చారని పేర్కొన్నారు.
ఆమెకు వివాహం అయిన తర్వాత కూడా తమ ఇద్దరి మధ్య శారీరకంగా, భావోద్వేగపరంగా సంబంధం కొనసాగిందని తెలిపారు. దీనికి సంబంధించిన ఆధారంగా తన ఐఫోన్‌లో వీడియోలు రికార్డు చేశానని, వాటిని ఆమె భర్తకు పంపించినట్లు చెప్పారు. ఈ మేరకు అత్తాపూర్ పోలీస్ స్టేషన్‌లో తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ ఉదయ్ కృష్ణారెడ్డి హైకోర్టులో (High Court) దాఖలు చేసిన పిటిషన్ పేర్కొన్నారు. ఫిర్యాదుదారు తొలుత అకాడమీ అధికారులకు, తరువాత ఠాణాలో ఫిర్యాదు చేశారన్నారు. రెండింటిలోనూ భిన్నమైన ఆరోపణలున్నాయని తన పిటిషన్లో వివరించారు. ఈ నేపథ్యంలో విచారణ లేకుండా నమోదు చేసిన కేసును కొట్టివేయాలని ఉదయ్ కృష్ణారెడ్డి కోరారు.
కాగా, ఇప్పటికే ఉదయ్ కృష్ణారెడ్డిపై ఎన్‌పీఏ వేటు వేసిన విషయం తెలిసిందే. అతనిపై నమోదైన కేసు పర్యవేక్షణ బాధ్యతను ఉన్నతాధికారులు మహిళా భద్రతా విభాగానికి (Women Safety Wing) అప్పగించారు. షీటీమ్స్ డీసీపీ లావణ్య నాయక్ జాదవ్ పర్యవేక్షణలో ఈ కేసు దర్యాప్తు కొనసాగుతున్నది. సోమవారం ఉదయం అపస్మారకస్థితిలో ఎస్సార్‌నగర్‌లోని ప్రైవేటు దవాఖానలో చేరిన ఉదయ్‌కృష్ణారెడ్డి ఆరోగ్యం కుదుటపడినట్లు సమాచారం. బుధవారం ఆయన్ను హాస్పిటల్ నుంచి డిశ్ఛార్జి చేయనున్నట్టు తెలిసింది. అయితే అతడు ఎలాంటి విషపదార్థం తీసుకోలేదని మెడికల్ చెకప్‌లో తేలింది. దీంతో కేసును పక్కదారి పట్టించేందుకే నిందితుడు ఇలా చేసినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. అతడు కోలుకున్నాక వివరాలు సేకరించేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. మరోవైపు సీసీటీవీ ఫుటేజ్, ఇరుపక్షాల వాట్సప్ చాటింగ్‌లు, మొబైల్ డేటాను సేకరించే పనిలోపడ్డారు.
సంబంధిత వార్తలు

MLC Dasoju Sravan | నిన్న పులి.. నేడు పిల్లి.. ‘దానం’పై ఎమ్మెల్సీ దాసోజు సెటైర్లు
సెప్టెంబర్ 20, 2026

Mahesh Kumar Goud | ఖైరతాబాద్ అభ్యర్థిని అధిష్టానం నిర్ణయిస్తుంది : మహేశ్ కుమార్ గౌడ్
సెప్టెంబర్ 19, 2026

Vemula Prashanth Reddy | ఫిరాయింపులను ప్రోత్సహించిన ప్రభుత్వానికి మంచి గుణపాఠమిది
సెప్టెంబర్ 18, 2026
తాజావార్తలు
- ●Digital Arrest | డిజిటల్ అరెస్ట్ మోసాలు.. పూణెలో సీనియర్ సిటిజన్లకు రూ.100 కోట్లు నష్టం..
- ●Harish Rao | 8.4 టీఎంసీల నీరున్నా ఎందుకు మనసొస్తలేదు రేవంత్?
- ●Revanth Reddy Sircilla Public Meeting | గులాబీ కోటలపై రేవంత్ దండయాత్ర: ఈనెల 30న సిరిసిల్లలో కాంగ్రెస్ భారీ సభ.. నెక్స్ట్ టార్గెట్ సిద్దిపేట
- ●Samantha | ప్రెగ్నెన్సీతో అర్ధరాత్రి వరకు షూటింగ్.. సమంత డెడికేషన్‌పై నెటిజన్ల ప్రశంసలు
- ●Delhi | ఢిల్లీలో మరో దారుణం.. కాళ్లు, చేతులు కట్టేసి ఆరోతరగతి బాలికపై లైంగిక దాడి
- ●Venkatesh | ముగ్గురు హీరోయిన్లతో వెంకటేష్ స్టెప్పులు - ఆదర్శకుటుంబం ఫస్ట్ సింగిల్‌పై అప్డేట్

Digital Arrest | డిజిటల్ అరెస్ట్ మోసాలు.. పూణెలో సీనియర్ సిటిజన్లకు రూ.100 కోట్లు నష్టం..

Harish Rao | 8.4 టీఎంసీల నీరున్నా ఎందుకు మనసొస్తలేదు రేవంత్?

Revanth Reddy Sircilla Public Meeting | గులాబీ కోటలపై రేవంత్ దండయాత్ర: ఈనెల 30న సిరిసిల్లలో కాంగ్రెస్ భారీ సభ.. నెక్స్ట్ టార్గెట్ సిద్దిపేట

Samantha | ప్రెగ్నెన్సీతో అర్ధరాత్రి వరకు షూటింగ్.. సమంత డెడికేషన్‌పై నెటిజన్ల ప్రశంసలు



